Volkswagen Taigun, Virtus లో యూత్ కోసం 'ఫ్లాష్ రెడ్' ఎడిషన్లు లాంచ్ - కళ్లు జిగేల్‌మనిపించే కలర్!
Volkswagen Red Edition: వోక్స్‌వ్యాగన్ తన ప్రసిద్ధ కార్లు టైగన్ & వర్టస్‌లో స్పోర్ట్స్ లైన్ వేరియంట్‌ల కోసం కొత్త రంగులను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త షేడ్‌కు "ఫ్లాష్ రెడ్" అని పేరు పెట్టారు.

Volkswagen Flash Red Color Edition Launched In India: వోక్స్‌వ్యాగన్, తన రెండు ప్రసిద్ధ కార్లు Taigun & Virtus లోని GT Line & GT Plus Sport వేరియంట్‌ల కోసం కొత్త "ఫ్లాష్ రెడ్ కలర్" (Flash Red Color) ఆప్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త రంగు ఇప్పటికే ఉన్న Wild Cherry Red కంటే కొంచెం ప్రకాశవంతంగా ఉంటుంది & మెటాలిక్ ఫినిషింగ్‌తో వచ్చింది. ఈ కొత్త కలర్ ఆప్షన్‌తో పాటు, ఈ రెండు వేరియంట్లు కాంట్రాస్టింగ్ బ్లాక్ రూఫ్ & B-పిల్లర్‌ను కూడా తీసుకొచ్చాయి.
ఇంజిన్ పవర్ & పెర్ఫార్మెన్స్
వోక్స్‌వ్యాగన్ టైగన్ & వర్టస్ లోని GT ప్లస్ స్పోర్ట్ వేరియంట్‌లు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పవర్ పొందుతాయి. ఈ ఇంజిన్ 148 bhp పవర్‌ను & 250 Nm పీక్ టార్క్‌ను ఇస్తుంది. GT లైన్ వేరియంట్‌లలో అమర్చిన 1.0 లీటర్ TSI ఇంజిన్ కూడా బలంగా పనిచేస్తుంది, ఇది 113 bhp పవర్‌ను & 178 Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. కంపెనీ, ఈ రెండు ఇంజిన్లతో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ప్రామాణికంగా అందిస్తోంది. అయితే, 1.0L TSI వేరియంట్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది. 1.5L EVO వేరియంట్‌ను 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలోనూ కొనవచ్చు. ఈ రెండు ఇంజిన్లు స్మూత్ డ్రైవింగ్, క్విక్ ఆక్సిలరేషన్ & ఫ్యూయల్ ఎఫిషియన్సీలో ఇప్పటికే పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్ & హైవే రెండింటిలోనూ ఈ ఇంజిన్లు అద్భుతమైన పనితీరు అందిస్తున్నాయి.
వోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్
ఇటీవల Volkswagen Taigun Facelift కూడా ఇండియన్ రోడ్ల మీద టెస్టింగ్ టైమ్‌లో కనిపించింది. ఈ ఫేస్‌లిఫ్ట్ కోసం టైగన్‌కు కొత్త గ్రిల్ & రీడిజైన్ చేసిన బంపర్ ఇవ్వవచ్చు, ఇది ఈ SUV రూపాన్ని మరింత ఆకర్షణీయంగా & దూకుడుగా చేస్తుంది. హెడ్‌లైట్‌లను అప్‌గ్రేడ్ చేసిన LED ఎలిమెంట్స్‌తో ఆధునీకరించే అవకాశం ఉంది. అంతర్జాతీయ మోడళ్ల మాదిరిగానే ఉండే కొత్త కనెక్టెడ్ LED టెయిల్‌లైట్‌లను వెనుక భాగంలో చూడవచ్చు. దీనితో పాటు, కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్‌ను కూడా ఫేస్‌లిఫ్ట్‌కు యాడ్ చేయవచ్చు, ఇది ఈ SUVకి మరింత ప్రీమియం అనుభూతిని ఇస్తుంది.
ఇప్పటివరకు వోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌కు సంబంధించి ఎలాంటి ఫొటోలు బయటకు రాలేదు. అయితే, నేషనల్ మీడియా నివేదికల ప్రకారం, ఇంటీరియర్‌లోనూ మార్పులు ఉండవచ్చు. కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, మెరుగైన నాణ్యత గల మెటీరియల్ & కొత్త రంగు ఆప్షన్స్ ఈ లిస్ట్‌లో ఉండవచ్చు. టెక్నాలజీ పరంగా, అప్‌డేటెడ్ & కనెక్టెడ్ కార్ ఫీచర్లను దీనికి జోడించవచ్చు, తద్వారా ఈ SUV, తన సెగ్మెంట్‌లోని ఇతర ఆధునిక కార్లకు గట్టి పోటీని ఇవ్వగలదు. ఈ మార్పులన్నింటితో, టైగన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కస్టమర్లకు మరింత ప్రీమియం, స్మార్ట్ & మోడరన్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతోంది.
ఇంజిన్‌లో ఎటువంటి మార్పు ఉండదు
డిజైన్ & ఫీచర్లలో మార్పులు కనిపించినప్పటికీ, వోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ ఆప్షన్స్‌లో మార్పు ఉండదు. దీనికి మునుపటిలాగే 1.0 లీటర్ & 1.5 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్లు ఇస్తారు, ఇవి మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంటాయి.





















