Ola Electric Car Teaser: వారెవ్వా, ఓలా ఎలక్ట్రిక్ కారు ఫస్ట్ లుక్ అదుర్స్ - ఎప్పుడు లాంచ్ కానుందో తెలుసా?
ఓలా నుంచి ఎలక్ట్రిక్ కారు రాబోతుందని చాలా కాలంగా వార్తలు విపిస్తున్నాయి. ఎట్టకేలకు ఆ వార్తలు వాస్తవమేనని కంపెనీ వెల్లడించింది. ఈమేరకు తమ తొలి ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసింది.
ఆకట్టుకుంటున్న ఓటా ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా.. భారత్ లో అత్యంత తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కంపెనీ నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో తొలి ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్ లో అదిరిపోయే లుక్ తో అద్భుతంగా ఆకట్టుకునే లా ఉంది. అక్టోబర్ 22న ఓలా కంపెనీ తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని విడుదల చేసిన వెంటనే కొత్త టీజర్ ను జనాల్లోకి వదిలింది. డిసెంబర్ 2024 నాటికి EVని లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. అయితే, ఓలా ఎలక్ట్రిక్ కారుకు సంబంధిచి పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేసి వాటికి చెక్ పెట్టింది.
This one’s going to be a dream on 4 wheels! We know you’re as excited for it as we are. Give us #EndICEage in the comments! pic.twitter.com/g1kgk9ONrt
— Ola Electric (@OlaElectric) October 23, 2022
అదుర్స్ అనిపిస్తున్న డిజైన్
తాజాగా విడుదలైన ఈ టీజర్ లో డ్యాష్‌బోర్డ్ కు సంబంధించిన మినిమలిస్ట్ డిజైన్ కనిపిస్తుంది. కారు యొక్క రెక్టాంగులర్ స్టీరింగ్ వీల్‌ను కూడా చూపిస్తుంది. స్టీరింగ్ దాని స్పోక్స్‌పై ఓలా లోగోను కలిగి ఉన్న ఆక్టాంగిల్ సెంటర్ తో బ్యాక్‌లిట్ నియంత్రణలను కలిగి ఉంది. ఇది స్పీడోమీటర్ రీడౌట్‌ను చూపించే ఫ్రీ-స్టాండింగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ కారు డాష్‌బోర్డ్ మధ్యలో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంది. కూల్ బ్లూ ఇంటీరియర్ యాంబియంట్ లైటింగ్ స్టీరింగ్ వీల్ వెనుక కనిపిస్తుంది. పైభాగంలో, AC వెంట్‌ల పలుచని స్ట్రిప్ ఉంది. దాని తర్వాత ఒక సన్నని స్ట్రిప్ యాంబియంట్ లైటింగ్ ఉంటుంది. డ్యాష్‌బోర్డ్‌లో ఇతర స్విచ్‌లు, కంట్రోలర్స్ మాత్రం కనిపించడం లేదు. ఇక ఫ్రంట్ ఫాసియా డిజైన్ మనం ఇంతకు ముందు చూసిన దానికంటే భిన్నంగా కనిపిస్తున్నది. టీజర్‌లో ఇదే విధమైన మృదువైన మినిమలిస్ట్ డిజైన్, స్మూత్‌డ్ ఎయిర్ ఇన్‌టేక్‌లు, తక్కువ బంపర్, ముందు బంపర్‌లో LED లైట్ బార్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంకా, హెడ్‌ల్యాంప్‌ల డిజైన్ LED హారిజెంటర్ స్టాక్‌ల నుంచి డిఫరెంట్ గా ఉన్నట్లు కనిపిస్తుంది.
Read Also: అబ్బ, భలే ఆఫర్ - ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు పేదలకు భారీ సబ్సీడీలు, ఎక్కడో తెలుసా?
ఒక్క ఛార్జ్ తో 500 కిమీ పరిధి?
ఓలా ఎలక్ట్రిక్ కారు ధర వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే, ఈ కారు బడ్జెట్ సెగ్మెంట్ ను టార్గెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 70-80kWh బ్యాటరీని కలిగి ఉండి, 500 కిలో మీటర్ల కంటే ఎక్కువ అంచనా పరిధిని కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. హ్యుందాయ్ కోనా EV, మహీంద్రా XUV400, టాటా నెక్సాన్ EV మ్యాక్స్ వంటి ప్రత్యర్థులతో పోటీ పడేందుకు ఈ లక్షణాలు తప్పకుండా ఉండాలి.