అన్వేషించండి

2024 Launching Bikes: 2024లో ఇండియాలో లాంచ్ కానున్న బెస్ట్ టూవీలర్స్ ఇవే - స్కూటీల నుంచి బైక్‌ల దాకా!

Best Bikes Launching in 2024: 2024లో మనదేశంలో కొన్ని బెస్ట్ బైకులు, స్కూటీలు లాంచ్ కానున్నాయి. అవేంటో చూద్దాం.

Two Wheelers Launching in 2024: భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ద్విచక్ర వాహనాలు లాంచ్ అవుతూనే ఉంటాయి. ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు 2024 గొప్ప సంవత్సరంగా మారనుంది. ఈ సంవత్సరం మనదేశంలో అనేక కొత్త ద్విచక్ర వాహనాలు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వీటిలో బెస్ట్ ఏవో ఇప్పుడు చూద్దాం.

కేటీయం 490 డ్యూక్ (KTM 490 Duke)
కేటీయం 490 డ్యూక్ అనేది ఒక స్పోర్ట్స్ బైక్. ఈ ఏడాది డిసెంబర్‌లో కేటీయం 490 డ్యూక్ మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బైక్‌లో 490 సీసీ ఇంజన్ అందిస్తారని వార్తలు వస్తున్నాయి. కేటీయం తీసుకొస్తున్న ఈ మోడల్ ధర దాదాపు రూ. 3.5 లక్షలు ఉండవచ్చని తెలుస్తోంది.

హోండా యాక్టివా 7జీ (Honda Activa 7G)
హోండా యాక్టివా కొత్త మోడల్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అదే హోండా యాక్టివా 7జీ. ఈ మోడల్‌లో 110 సీసీ ఇంజన్ అందుబాటులో ఉంది. హోండా యాక్టివా 7జీ 2024 ఏప్రిల్ 15వ తేదీన విడుదల కానుంది. ఈ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు ఉండవచ్చని సమాచారం.

యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 (Yamaha XSR 155)
యమహా తన కొత్త బైక్ అయిన ఎక్స్ఎస్ఆర్ 155ను ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ బైక్‌లో 155 సీసీ ఇంజన్ ఉండనుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.4 లక్షల కంటే ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ మోడల్‌ను 2024 డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

కవాసకి జెడ్400 (Kawasaki Z400)
స్పోర్ట్స్ బైకులకు కవాసకి అంటే పెట్టింది పేరు. కవాసకి జెడ్400పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ బైక్ 2024 నవంబర్‌లో మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. కవాసకి జెడ్400 ధర దాదాపు రూ.4 లక్షలు ఉండవచ్చు.

బెనెల్లీ టీఎన్‌టీ 300 (Bennelli TNT 300)
బెనెల్లీ లాంచ్ చేయనున్న ఈ మోడల్‌లో 300 సీసీ ఇంజిన్ ఉండవచ్చని తెలుస్తోంది. 2024 నవంబర్‌లోనే ఈ బైక్ కూడా మనదేశంలో లాంచ్ కానుందని సమాచారం. బెనెల్లీ టీఎన్‌టీ 300 ధర మనదేశంలో రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.5 లక్షల మధ్య ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి.

టీవీఎస్ జెప్పెలిన్ (TVS Zeppelin)
ఈ బైక్ ధర రూ.2 లక్షల నుంచి రూ.3.2 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మైల్డ్ హైబ్రిడ్ సిస్టం ఉన్న 220 సీసీ ఇంజిన్ ఈ బైక్‌లో చూడవచ్చు. మనదేశంలో మైల్డ్ హైబ్రిడ్ సిస్టంతో లాంచ్ కానున్న మొదటి క్రూయిజర్ బైక్ ఇదే.

హీరో జూమ్ 160 (Hero Xoom 160)
2024లోనే హీరో జూమ్ 160 మనదేశంలో లాంచ్ కానుంది. దీని ధర రూ.1.4 లక్షల నుంచి రూ.1.5 లక్షల మధ్య ఉండనుంది. ఈ బైక్‌లో 160 సీసీ ఇంజిన్ అందించనున్నారు. బైక్ పెర్ఫార్మెన్స్‌ను ఇది మరింత మెరుగుపరచనుంది. కార్నరింగ్ ఏబీఎస్ టెక్నాలజీతో ఈ బైక్ మార్కెట్లోకి రానుంది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

How To Protect Bike During Heavy Rain:వర్షాకాలంలో మీ డ్రీమ్‌ బైక్ పాడవకుండా ఎలా కాపాడుకోవాలి?
వర్షాకాలంలో మీ డ్రీమ్‌ బైక్ పాడవకుండా ఎలా కాపాడుకోవాలి?
Maruti Brezza Hyderabad On Road Price:హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా కొంటే ఆన్‌రోడ్ ప్రైస్‌ ఎంత? నెలకు ఎంత EMI చెల్లించాలి?
హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా కొంటే ఆన్‌రోడ్ ప్రైస్‌ ఎంత? నెలకు ఎంత EMI చెల్లించాలి?
Upcoming SUVs List: మూడు నెలల్లో అద్భుతమైన ఫీచర్లతో విడుదల కానున్న  శక్తివంతమైన SUVలు!
మూడు నెలల్లో అద్భుతమైన ఫీచర్లతో విడుదల కానున్న  శక్తివంతమైన SUVలు!
అథర్‌ స్కూటర్లలో 'పోత్‌హోల్‌ ప్లస్‌ అలర్ట్స్‌' ప్రారంభం.. రోడ్డుపై గుంతలు, స్పీడ్‌ బ్రేకర్ల గురించి ముందే హెచ్చరికలు
రోడ్డుపై గుంతల గురించి ముందే హెచ్చరించే కొత్త ఫీచర్‌ - అథర్‌ Gen 2 స్కూటర్లకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget