Bike Loan and Interest Rates: బైక్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ బ్యాంకుల వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు తెలుసుకోండి!
Bike Loan and Interest Rates:లోన్‌పై టూవీలర్ తీసుకుంటే కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. లేకుంటే చాలా నష్టపోతారు. బ్యాంకు వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు ఇతర ఛార్జీలు తెలియనప్పుడు ఇబ్బంది పడతారు

Bike Loan and Interest Rates: ప్రస్తుతం ప్రతి ఒక్కరికి బైక్ కనీస అవసరంగా మారిపోయింది. ఉద్యోగ అవసరాలు కావచ్చు, ఇంటి కోసం కావచ్చు బైక్ అనేది కచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అందుకే చిన్నదో పెద్దదో బైక్ కొనుక్కుంటే సమయం వృథా కాకుండా చాలా పనులు చేసుకోవచ్చని చాలా మంది అనుకుంటారు. అలా కొనుక్కుందామనే ఆలోచన వచ్చినప్పుడు ముందుగా ఏ బ్యాంకు ఎంత లోన్ ఇస్తుంది. ఎంత వడ్డీ వసూలు చేస్తుంది. ప్రోసెసింగ్ ఫీజు ఎంత చెల్లించాలి అనే ఆలోచన రావడం సహజం. అందుకే బైక్ కొనుగోలు చేయడానికి ఏ బ్యాంకు ఎంత వడ్డీ వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు.
మీరు బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డు, మంచి సిబిల్ స్కోరు ఉంటే చాలు కాస్త డౌన్ పేమెంట్ కడితే మీరు బైక్ సొంతం చేసుకోవచ్చు. మిగతా డబ్బులను ఈఎంఐ రూపంలో నెలనెలా చెల్లించుకోవచ్చు. దీనికి గాను బ్యాంకులు కొంత వడ్డీని వసూలు చేస్తాయి. లోన్ ప్రక్రియను ప్రాసెస్ చేయడానికి కూడా కొంత ఫీజును కూడా తీసుకుంటాయి. వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు బ్యాంకులను బట్టీ మారుతూ ఉంటుంది.
ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి లోన్‌లు ఎక్కువ తీసుకునే ప్రోత్సహించడానికి కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేయడం లేదు. మరికొన్ని మాత్రం ఒకట్రెండు శాతం వసూలు చేస్తున్నాయి. మీరు తీసుకున్న లోన్ ఆధారంగా ఈ ప్రాసెసింగ్ ఫీజు ఆధార పడి ఉంటుంది.
వడ్డీ రేటు విషయం మీ సిబిల్ స్కోరుపై ఆధార పడి ఉంటుంది. మీకు మంచి సిబిల్ స్కోరు ఉంటే బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడి వడ్డీ రేటును తగ్గించుకోవచ్చు. అదే సిబిల్ స్కోరు సరిగా లేకుంటే మాత్రం కచ్చితంగా వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉండదు. ఈ వడ్డీ కూడా ఆయా బ్యాంకులను బట్టీ మారుతూ ఉంటుంది.
పది శాతానికిపైగానే బ్యాంకులు బైక్‌లపై ఇచ్చే లోన్‌పై వసూలు చేస్తున్నారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు, హెచ్‌డీబీ పైనాన్సియల్ సర్వీస్ రెండూ కూడా ప్రాసెసింగ్ ఫీజులు తీసుకోవడం లేదు. ఐడీఎఫ్‌సీ 11 శాతం వడ్డీ వసూలు చేస్తుంటే హెచ్‌డీబీ పైనాన్సియల్ సర్వీస్ మాత్రం 12 శాతం వడ్డీ వసూలు చేస్తుంది.
బజాజ్ ఫైనాన్స్ సంస్థ ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది. ఇచ్చే లోన్‌పై 11 శాతం వడ్డీ వేస్తోంది. హీరో ఫిన్ కార్ప్ కూడా 2శాతం ప్రాసెసింగ్ ఫీజుల వడ్డిస్తోంది. వడ్డీ రేటు కూడా 12 శాతం వసూలు చేస్తోంది.
మిగతా బ్యాంకుల వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి
HDFC -14.5%
Axis Bank -10.50%
Bank Of Baroda -13.65 %
మీరు లోన్‌పై బైక్ తీసుకునేటప్పుడు వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజుతోపాటు మరికొన్ని విషయాలను గమనించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రీక్లోజర్ ఛార్జెస్ అనేవి కూడా ఉంటాయి. మీకు ఏదో రూపంలో డబ్బు సమకూరిన తర్వాత టెన్యూర్ కాకుండానే లోన్ క్లోజ్ చేయాలని అనుకుంటే మాత్రం కచ్చితంగా కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు బైక్ లోన్ ఐదేళ్లకు తీసుకుంటే... మీరు ముందుగానే అంటే మూడేళ్లకే క్లోజ్ చేయాలనుకుంటే మాత్రం కచ్చితంగా కొంత నగదు అదనంగా వసూలు చేస్తారు. కొన్ని బ్యాంకులు ఇలాంటి ఫీజును తీసుకోవు. ఆ విషయంపై బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడి కన్ఫామ్ చేసుకోవాలి. లేకుంటా మీరు పత్రాలపై సంతకాలు పెట్టిన తర్వాత తలబాదుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు.





















