Affordable Royal Enfield Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో చవకైన బైక్, ఎగబడి కొంటున్నారు - మీకు లోన్ కూడా వస్తుంది!
Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ చవకైన బైక్ ఇది. గత నెలలో 16 వేలమందికి పైగా కొత్త కస్టమర్లు ఈ బండికి ఓనర్లుగా మారారు. ఈ సంఖ్య గతేడాది కంటే పెరిగింది.

Royal Enfield Hunter 350 Price, Down Payment and EMI Details: రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌లో చవకైన & ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బైక్ హంటర్ 350. దీనిని యువ రైడర్లు చాలా ఇష్టపడతారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బండిని కనీసం ఒక్కసారైనా నడపకపోతే జీవితం వేస్ట్ అనే స్థాయిలో వాళ్ల అభిమానం ఉంటుంది. గత నెల (జూన్ 2025)లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్ సైకిల్‌ను 16,261 కొత్త కస్టమర్లు కొన్నారు. గత సంవత్సరం జూన్ నెలతో పోలిస్తే ఈ సంఖ్య 4.18 శాతం పెరుగుదలను చూపిస్తుంది. హంటర్ 350ని ఇష్టపడుతున్న కొత్త కస్టమర్లు, ముఖ్యంగా యువ కస్టమర్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది.
మీకు రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 బైక్ నచ్చితే, కేవలం రూ. 25,000 వేలు కట్టి ఈ ఈ బైక్‌ను దర్జాగా మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.
హైదరాబాద్ & విజయవాడలో ఆన్-రోడ్ ధర
హైదరాబాద్‌లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Royal Enfield Hunter 350 Price, Hyderabad) రూ. 1.50 లక్షలు. దీనికి.. RTO ఫీజ్ దాదాపు రూ. 20,000, ఇన్సూరెన్స్ దాదాపు రూ. 13,000, స్టాండర్డ్ యాక్సెసరీస్ రూ. 4,500, ఇతర ఖర్చులు కలిపితే, హైదరాబాద్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 1.91 లక్షలు అవుతుంది. విజయవాడలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Royal Enfield Hunter 350 Price, Vijayawada) రూ. 1.50 లక్షలే అయినప్పటికీ, కొన్ని ఖర్చులు తగ్గిన కారణంగా ధర దాదాపు రూ. 1.81 లక్షలు అవుతుంది.
మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొనాలనుకుంటే ఈ డబ్బు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. డౌన్ పేమెంట్ & EMI ఆప్షన్ ద్వారా ఈజీగా కొనేయవచ్చు.
ఎంత డౌన్ పేమెంట్ చేయాలి?
మీరు, విజయవాడలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొనాలనుకుంటే, ఇందుకోసం రూ. 25,000 డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన 1.56 లక్షల రూపాయలకు బ్యాంక్ రుణం తీసుకోవాలి. బైక్ షోరూమ్‌లోనే ఉండే బ్యాంక్ ప్రతినిధులు దగ్గరుండి మరీ మీకు బైక్ లోన్ ఇప్పిస్తారు. బ్యాంక్ మీకు ఈ లోన్‌ను 9% వార్షిక వడ్డీ రేటుతో ఇచ్చిందని భావిద్దాం. ఇప్పుడు EMI ప్లాన్ చూద్దాం.
EMI ఆప్షన్స్
4 సంవత్సరాల్లో (48 నెలలు) రుణం పూర్తి చెల్లవేయాలని భావిస్తుంటే, మీ నెలవారీ EMI రూ. 5,100 అవుతుంది.
3 సంవత్సరాల (36 నెలలు) కోసం లోన్ తీసుకుంటే, మీరు నెలకు రూ. 5,100 EMI చెల్లించాలి.
2 సంవత్సరాల (24 నెలలు) రుణ కాలపరిమితి పెట్టుకోవాలంటే, నెలకు రూ. EMI బ్యాంక్‌లో జమ చేయాలి.
1 సంవత్సరంలో (12 నెలలు) లోన్ మొత్తం క్లియర్ చేయాలనుకుంటే మీ నెలవారీ EMI రూ. 5,100 అవుతుంది.
బ్యాంక్ ఇచ్చే రుణం, దానిపై నిర్ణయించే వడ్డీ రేటు వంటివి మీ క్రెడిట్ స్కోర్ & బ్యాంక్ పాలసీపై ఆధారపడి ఉంటాయి.
ఫీచర్లు
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో 349cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ & ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 20.4 PS పవర్ & 27 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను యాడ్ చేశారు. ఈ ఇంజిన్ + గేర్‌బాక్స్‌తో సిటీ నగర ట్రాఫిక్ & హైవేలు రెండింటిలోనూ ఈ బండి మృదువుగా & బలంగా నడవగలదు.
మైలేజ్
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మైలేజ్ లీటరుకు 36 కిలోమీటర్లుగా ARAI ధృవీకరించింది. దీనికి 13 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్‌ను పూర్తిగా నింపితే, ఈ బైక్ 460 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఒక వ్యక్తి రోజుకు సగటను 35 కిలోమీటర్ల దూరం బైక్ నడుపుతాడు అనుకుంటే, ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత, మళ్ళీ 13 రోజుల వరకు పెట్రోల్ నింపాల్సిన అవసరం ఉండదు.





















