Toyota Innova Crysta Laon: టయోటా ఇన్నోవా క్రిస్టా కొనాలంటే హైదరాబాద్‌లో ఎంత జీతం ఉండాలి, ఫైనాన్స్‌లో తీసుకోవచ్చా?
Toyota Innova Crysta Finance Plan: టయోటా ఇన్నోవా క్రిస్టా కారును లోన్‌పై కూడా కొనవచ్చు. దీనికి మీకు ఎంత జీతం అవసరం, ఎంత EMI కట్టాలన్న వివరాలు ఈ కథనంలో ఉన్నాయి.

Toyota Innova Crysta Price, Down Payment, Loan and EMI Details: టయోటా ఇన్నోవా క్రిస్టా శక్తివంతమైన గ్రిల్ డిజైన్ & క్రోమ్ ఫినిష్‌తో మునుపెన్నడూ లేని డైనమిక్ లుక్‌తో వచ్చింది. దీని షార్ప్ హెడ్‌ల్యాంప్స్ & బోల్డ్ బోనెట్ స్టైలింగ్ కారుకు అదనపు ఆకర్షణను ఇస్తాయి. వెనుక భాగంలో ఉన్న స్టైలిష్ టెయిల్ ల్యాంప్స్ & రిఫైన్‌డ్ బూట్ డిజైన్ మోడరన్ లుక్‌ను హైలైట్ చేస్తాయి. క్రిస్టా, MPV గా ప్రాక్టికల్ వెహికల్ మాత్రమే కాదు, ప్రీమియం SUV తరహా స్టైల్‌ను కనబరుస్తుంది. ఎక్స్‌టీరియర్ లుక్స్ మాత్రమే కాదు, ఇంటీరియర్ పరంగానూ ఇదొక మోడర్న్ వెహికల్. పైగా మంచి మైలేజ్ ఇస్తుంది. కాబట్టి, టయోటా ఇన్నోవా క్రిస్టాను ఇండియాలో చాలా మంది ఇష్టపడతారు.
హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర
హైదరాబాద్‌లో, టయోటా ఇన్నోవా క్రిస్టా ఎక్స్-షోరూమ్ ధర (Toyota Innova Crysta ex-showroom price) రూ. 19.99 లక్షల నుంచి ప్రారంభమై, హై-ఎండ్ వెర్షన్‌కు రూ. 26.55 లక్షల వరకు ఉంటుంది. దాని బేస్ వేరియంట్ "GX 7 STR" ఆన్-రోడ్ ధర (Toyota Innova Crysta on-road price, Hyderabad) దాదాపు రూ. 25.43 లక్షలు. ఆన్-రోడ్ ధర అంటే, ఇందులో ఎక్స్-షోరూమ్ రేటు + RTO ఛార్జీలు + ఇన్సూరెన్స్ + ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి. ఫైనల్‌గా, బండి రోడ్డు మీదకు వచ్చేందుకు చెల్లించాల్సిన మొత్తం ఇది.
విజయవాడలో, టయోటా ఇన్నోవా క్రిస్టా ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది, ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 24.87 లక్షలు అవుతుంది.
ఈ కారు కొనడానికి కార్ లోన్ ఇస్తారా?
మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ విషయంలో బ్యాంక్ సంతృప్తి చెందితే, టయోటా ఇన్నోవా క్రిస్టా కొనడానికి కార్ షోరూమ్‌లోనే, కేవలం ఒక గంట లోపలే మీకు కార్ లోన్ మంజూరవుతుంది.
ఎంత డౌన్ పేమెంట్ చేయాలి?
కార్ లోన్ పొందడానికి ముందు మీరు కొంత మొత్తాన్ని డౌన్ పేమెంట్ చేయాలి. హైదరాబాద్‌లో, టయోటా ఇన్నోవా క్రిస్టా బేస్ వేరియంట్‌ను కొనడానికి మీరు రూ. 5 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, మీకు బ్యాంకు నుంచి దాదాపు రూ. 20.43 లక్షల రుణం లభిస్తుంది. మీరు ఈ రుణాన్ని మీరు 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో తీసుకున్నారని అనుకుందాం. ఇప్పుడు EMI ఆప్షన్స్ చూద్దాం.
ప్రతి నెలా రూ. 32,870 EMI చెల్లించగలిగితే, మీ కార్ లోన్ మొత్తం 7 సంవత్సరాల్లో క్లియర్ అవుతుంది.
ప్రతి నెలా రూ. 36,826 EMI చెల్లించగలిగితే, మీ రుణం 6 సంవత్సరాల్లో పూర్తిగా తీరిపోతుంది.
ప్రతి నెలా రూ. 42,409 EMI చెల్లించగలిగితే, మీరు మీ లోన్‌ను 5 సంవత్సరాల్లోనే తీర్చేయవచ్చు.
ప్రతి నెలా రూ. 50,840 EMI చెల్లించగలిగితే, మీ బ్యాంక్ రుణం 4 సంవత్సరాల్లో ముగుస్తుంది.
కార్ లోన్, వడ్డీ రేటు పూర్తిగా మీ క్రెడిట్ స్కోర్, బ్యాంక్ పాలసీపై ఆధారపడి ఉంటాయి. మీరు టయోటా ఇన్నోవా క్రిస్టా కొనాలని ఆలోచిస్తుంటే, మీ జీతం/ నెలవారీ ఆదాయం రూ. లక్ష కంటే ఎక్కువ ఉంటేనే ఈ కారు కొనాలన్నది ఆర్థిక నిపుణుల సలహా.
టయోటా ఇన్నోవా క్రిస్టా ఫీచర్లు
టయోటా ఇన్నోవా క్రిస్టా ఫీచర్ల విషయానికి వస్తే.. కారు క్యాబిన్‌లో 20.32 సెం.మీ. డిస్‌ప్లే ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే కనెక్ట్ అవుతుంది. ఇంకా చాలా దీనితో, మీరు మీ మొబైల్ ఫోన్‌ను కారుతో సులభంగా కనెక్ట్ చేయవచ్చు. ఇంకా.. డ్యూయల్ టోన్ డాష్‌బోర్డ్, వుడ్‑గ్రైన్ ఫినిష్, కూల్డ్ గ్లవ్‌బాక్స్, పూర్తి ప్రెష్యర్ సీట్లు, ABS-EBD, VSC/ESP, హిల్ స్టార్ట్ అసిస్టెంట్, ISOfix మౌంట్స్, 6‑9 ఎయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్లు/కెమెరా, అన్ని వరుసలకూ సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.





















