అన్వేషించండి

TVS Zest SXC - ₹75,500కే డిజిటల్‌ మీటర్‌, బ్లూటూత్‌ ఫీచర్లు, కూల్‌ లుక్‌తో యూత్‌కి కొత్త ఫేవరెట్‌

కొత్త TVS Zest SXC స్కూటీ భారత మార్కెట్‌లో ₹75,500 ఎక్స్‌-షోరూమ్‌ ధరతో లాంచ్‌ అయ్యింది. డిజిటల్‌ డిస్‌ప్లే, బ్లూటూత్‌, కొత్త కలర్స్‌తో దీనిని యువత కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

TVS Zest SXC Price Features Mileage Details: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ, తన పాపులర్‌ 110సీసీ స్కూటీ సిరీస్‌లోకి కొత్త పేరును యాడ్‌ చేసింది. అక్టోబర్‌లో, టీవీఎస్‌ జెస్ట్‌ SXC అనే కొత్త వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. ఈ బండి ఎక్స్‌-షోరూమ్‌ ధరను ₹75,500గా నిర్ణయించింది. ఈ కొత్త స్కూటీ... డిజైన్‌, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా పూర్తిగా అప్‌గ్రేడ్‌ అయ్యింది. యూత్‌కి నచ్చే డిజిటల్‌ డిస్‌ప్లే, బ్లూటూత్‌ కనెక్టివిటీ, స్టైలిష్‌ లుక్‌ ఈ మోడల్‌కి ప్రధాన హైలైట్స్‌.

ఫుల్‌ డిజిటల్‌ కన్సోల్‌ - స్మార్ట్‌ ఫీచర్లతో బెటర్‌ కనెక్టివిటీ
జెస్ట్‌ SXCలో అత్యంత ఆకర్షణీయమైన అప్‌డేట్‌ ఫుల్‌ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌. ఇంతకుముందు ఉన్న అనలాగ్‌ మీటర్‌ స్థానంలో ఇప్పుడు పూర్తి డిజిటల్‌ డిస్‌ప్లే ఇచ్చారు. స్పీడ్‌, ఫ్యూయల్‌ లెవల్‌, ఓడోమీటర్‌, ట్రిప్‌ మీటర్‌ వంటి అన్ని వివరాలు డిస్‌ప్లేలో కనిపిస్తాయి. అంతేకాదు, ఇందులో బ్లూటూత్‌ కనెక్టివిటీ కూడా ఉంది. TVS Connect యాప్‌ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను స్కూటీకి కనెక్ట్‌ చేసుకోవచ్చు. దీంతో టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్‌, ఫోన్‌ నోటిఫికేషన్లు కూడా ఈ డిజిటల్‌ డిస్‌ప్లేలోనే ప్రత్యక్షమవుతాయి - ఇది రైడింగ్‌ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మారుస్తుంది.

లుక్‌ & కొత్త కలర్స్‌
టీవీఎస్‌ జెస్ట్‌ SXC ఇప్పుడు రెండు ఆకర్షణీయమైన కొత్త రంగుల్లో అందుబాటులో ఉంది, అవి - గ్రాఫైట్‌ గ్రే & బోల్డ్‌ బ్లాక్‌. కొత్త డెకల్స్‌ & బాడీ గ్రాఫిక్స్‌ వల్ల స్కూటీకి ఫ్రెష్‌ & ప్రీమియం లుక్‌ వచ్చింది. డిజైన్‌ పరంగా జెస్ట్‌కి ప్రత్యేకమైన కాంపాక్ట్‌ లుక్‌ కొనసాగించారు. కొత్త కలర్‌ థీమ్‌లు & అట్రాక్టివ్‌ ఫినిషింగ్‌ వల్ల ఇప్పుడు ఇది యూత్‌కి మరింత మోడర్న్‌గా కనిపిస్తుంది.

ఇంజిన్‌ & పనితీరు
పెర్ఫార్మెన్స్‌ విషయానికి వస్తే, జెస్ట్‌ SXCలో 109.7cc సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 7.8 PS పవర్‌, 8.8 Nm టార్క్‌ ఇస్తుంది. CVT ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో అనుసంధానమైన ఈ స్కూటీ సిటీ ట్రాఫిక్‌లో సూపర్‌ స్మూత్‌గా నడుస్తుంది. లైట్‌ థ్రోటిల్‌ రెస్పాన్స్‌, పవర్‌ఫుల్‌ ఇంజిన్‌, రిఫైన్డ్‌ రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ - ఇవన్నీ ఈ స్కూటీని రోజువారీ ప్రయాణాలకు పర్ఫెక్ట్‌ పార్ట్‌నర్‌గా మారుస్తాయి.

డిజైన్‌ & ప్రాక్టికల్‌ ఫీచర్లు
జెస్ట్‌ SXC బరువు కేవలం 103 కిలోలు మాత్రమే. అంటే ఈ సెగ్మెంట్‌లోని అత్యంత తేలికపాటి స్కూటీలలో ఒకటి. 760 mm సీట్‌ ఎత్తు వల్ల ఎవరైనా సులభంగా నడపగలరు. LED DRLs, ఎక్స్‌టర్నల్‌ ఫ్యూయల్‌ ఫిల్లింగ్‌, 19 లీటర్ల అండర్‌-సీట్‌ స్టోరేజ్‌ వంటి ఫీచర్లు దీనిని, ముఖ్యంగా మరిళలకు మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. కాంపాక్ట్‌ డిజైన్‌, లైట్‌ వెయిట్‌ ఫ్రేమ్‌ వల్ల ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌ కూడా సులభమే.

పోటీదారులు
టీవీఎస్‌ జెస్ట్‌ SXCకి మార్కెట్‌లో Honda Dio, Hero Pleasure+ & Yamaha Fascino వంటి స్కూటీలతో పోటీ ఉంది. కానీ కొత్త డిజిటల్‌ టెక్నాలజీ, లైట్‌ వెయిట్‌ బాడీ, కూల్‌ కలర్‌ ఆప్షన్లతో జెస్ట్‌ SXC వాటిలో ప్రత్యేకంగా నిలుస్తుంది.

టీవీఎస్‌ జెస్ట్‌ SXC యూత్‌ కోసం మోడర్న్‌ లైఫ్‌కి సరిపోయే స్మార్ట్‌ స్కూటీ. స్టైలిష్‌ లుక్‌, శక్తిమంతమైన ఇంజిన్‌, ఫీచర్లతో ఇది “కంఫర్ట్‌ & స్టైల్‌” మేళవింపుగా నిలుస్తుంది. ₹75,500 ఎక్స్‌-షోరూమ్‌ ధరలో ఇంత టెక్‌ అప్‌డేట్‌ స్కూటీ నిజంగా “వావ్‌ ఫ్యాక్టర్‌”!.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Driving Licence Renewal: RTO ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు! డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఇలా చేయండి!
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగుస్తోందా? ఇంట్లోనే ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోండి.. కేవలం 12 స్టెప్స్‌లో!
Kia Carens Clavisలో ఏ వేరియంట్‌ ధర ఎంత? మిడ్‌ వేరియంట్‌లో ఏ ఫీచర్లున్నాయి? పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో పూర్తి వివరాలు
Kia Carens Clavis లో 11 వేరియంట్లు.. ధర, ఫీచర్ల పరంగా మీకు ఏది బెస్ట్?
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
AdBlue In Cars: డీజిల్ కారు ఓనర్లు, డ్రైవర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం.. AdBlue ఎప్పుడు నింపాలి? ధర ఎంత?
డీజిల్ కారులో AdBlue అంటే ఏమిటి? ఇది అయిపోతే ఇంజిన్ మళ్లీ స్టార్ట్ కాదా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget