అన్వేషించండి

LED హెడ్‌ల్యాంప్, USB చార్జింగ్, అలాయ్‌ వీల్స్‌ - TVS XL100 HD తాజా ఫీచర్లతో వచ్చేసింది

TVS XL100 Heavy Duty కొత్త వేరియంట్‌ విడుదలైంది. LED హెడ్‌ల్యాంప్‌, USB చార్జింగ్‌తో, అలాయ్ వీల్స్‌ ఈసారి స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారాయి.

TVS XL100 Heavy Duty Alloy TVS Wheels Launched: టీవీఎస్‌ మోటార్స్, తన ఫేమస్‌ XL100 హెవీ డ్యూటీ లైనప్‌లో తాజాగా కొత్త వేరియంట్‌ని పరిచయం చేసింది, అది - TVS XL100 Heavy Duty Alloy. ఆలాయ్ వీల్స్‌తో వచ్చిన ఏకైక HD (హెవీ డ్యూటీ) వేరియంట్ ఇదే. దీనిలో ట్యూబ్‌లెస్ టైర్లను కూడా కంపెనీ ఇచ్చింది. కొత్త లుక్ కేవలం స్టైలిష్‌ మాత్రమే కాకుండా, పంక్చర్‌ రిపేర్‌ విషయంలో కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సౌలభ్యాన్ని ఇస్తుంది.

ప్రత్యేకమైన LED హెడ్‌ల్యాంప్‌
ఈ కొత్త XL100 Heavy Duty Alloy వేరియంట్ ప్రత్యేకంగా LED హెడ్‌ల్యాంప్‌తో లాంచ్‌ అయింది, రాత్రి సమయాల్లో మరింత ఎక్కువ కాంతిని పెంచి, గ్రామీణ రోడ్లపై గుంతలు & మలుపులు వంటి వాటిని స్పష్టంగా చూపిస్తుంది. అదనంగా, USB చార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది, రైడింగ్‌ సమయంలో ఫోన్లు & ఇతర పరికరాలను సులభంగా చార్జ్ చేసుకోవచ్చు, సమయం ఆదా అవుతుంది. 

రంగులు
తాజా XL100 Heavy Duty Alloy వేరియంట్‌ మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది, అవి - రెడ్, బ్లూ, & గ్రే. వీటిలో ప్రతి ఒక్క రంగూ ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఇంజిన్ విషయానికి వస్తే, XL100 Heavy Duty Alloy మిగతా వేరియంట్ల లాగే మెకానికల్‌గా ఒకే విధంగా ఉంటుంది. 99.7cc, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 4.3 hp పవర్‌తో 6.5 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. సస్పెన్షన్ & బ్రేకింగ్ సిస్టమ్ కూడా మిగతా వేరియంట్ల తరహాలోనే ఉంటాయి, ఫ్రంట్ & రియర్ రెండూ డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి.

ఆఅయ్ వీల్స్ తీసుకురావడం వల్ల ఈ మోటార్‌ సైకిల్‌ మోడర్న్ లుక్ అందుకుంది, పాత స్పోక్డ్ వీల్స్ కంటే భిన్నమైన ఫీల్ ఇస్తుంది. మరొక ప్రాక్టికల్ బెనిఫిట్‌ ఏమిటంటే, పంక్చర్ రిపేర్ చాలా సులభం అయింది. ఈ వేరియంట్ కర్బ్ వెయిట్ విషయంలోనూ పెద్ద మార్పు లేదు, ఇది ఇతర మోడల్స్‌తో దాదాపు సమానంగా, సుమారుగా 89 కిలోల బరువు తూగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ధర
ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో, XL100 Heavy Duty Alloy ధర రూ. 60,500 (ఎక్స్-షోరూమ్), ఈ మోడల్‌లో ఇదే టాప్-స్పెక్స్ వేరియంట్‌. రిజిస్ట్రేషన్‌ ఖర్చులు దాదాపు రూ. 7,300, ఇన్సూరెన్స్‌ దాదాపు రూ. 6,300, ఇతర ఖర్చులు కలుపుకుని ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 78,000 అవుతుంది.

ప్రస్తుతం, ఈ మోటర్‌ సైకిల్‌కు డైరెక్ట్‌గా పోటీ ఇచ్చే బండి మార్కెట్‌లో లేదు, కానీ ఎలక్ట్రిక్ Kinetic e-Luna (రూ. 69,990 - 82,490) కొంత పోలిక ఉంటుంది.

TVS XL100 Heavy Duty Alloy ఒక చవకైన, స్టైలిష్‌, ఫీచర్లతో ఫుల్ ఫ్లెక్సిబుల్ ఆఫ్షన్స్ ఇచ్చే టూ-వీల్‌ర్ కావడం వల్ల రైడర్లకు బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. రోజువారీ తిరగడానికి ఉపయోగించే కమ్యూటర్‌ బైక్‌లా ఉపయోగించుకోవడానికి కూడా ఇది పర్ఫెక్ట్. LED లైట్‌, USB చార్జింగ్‌, & అలాయ్ వీల్స్ వంటివి ఈ వేరియంట్‌కు ప్రీమియం ఫీల్ ఇస్తాయి, కానీ ధర అందుబాటులోనే ఉంది.

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
CJP Protests: ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Sweets With Alcohol : మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Embed widget