లుక్స్‌లో స్టైల్, ఫీచర్లలో మోడ్రన్ - VLF Mobster 135 లాంచ్, ధర ఎంతంటే?
ఇటాలియన్ కంపెనీ Motohaus, భారతదేశంలో VLF Mobster 135 ను విడుదల చేసింది. ఈ స్కూటర్ శక్తిమంతమైన 125cc ఇంజిన్, ప్రీమియం ఫీచర్లు & స్పోర్టీ డిజైన్‌తో వచ్చింది.

VLF Mobster 135 Scooter Launched Price Features: మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ లేదా ఆఫీస్‌లో ప్రత్యేకంగా చూపించే స్టైలిష్ స్కూటర్ కోసం సెర్చ్ చేస్తుంటే, ఇటాలియన్ ద్విచక్ర వాహన సంస్థ మోటోహాస్ (Motohaus) ఒక కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఈ ఇటాలియన్ బండిని కొనడానికి మీరు ఇటలీ వరకు వెళ్లక్కరలేదు, మన తెలుగు రాష్ట్రాల్లోనూ లాంచ్ అయింది. ఈ కొత్త స్టైలిష్ స్కూటర్ పేరు - VLF మోబ్‌స్టర్ 135. ప్రత్యేకంగా యంగ్ కస్టమర్ల కోసం దీనిని డిజైన్ చేశారు. స్టైల్, పెర్ఫార్మెన్స్ & ఫీచర్లు ఫుల్లుగా ఉన్న ఈ బండి, మీకు ప్రత్యేకతను తెచ్చి పెడుతుంది. శక్తిమంతమైన ఇంజిన్ & స్పోర్టి డిజైన్‌తో మోటోహాస్ ఈ కొత్త స్కూటర్‌ను తెలుగు వాళ్లకు పరిచయం చేసింది.
VLF మాబ్‌స్టర్ 135 ఫీచర్లు
ఈ స్కూటర్‌లో కంపెనీ చాలా మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ & 797 mm సీట్ ఎత్తుతో ఇది వచ్చింది, ఇది రోజువారీ రైడింగ్ & కఠినమైన రోడ్లపై ఈజీ హ్యాండ్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ABS & స్విచ్చబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి, వేగంలోనూ బండి మీ కంట్రోల్‌లోనే ఉంటుంది. మోడ్రన్ లుక్స్ కోసం LED లైట్లు, డ్యూయల్ గ్యాస్-చార్జ్డ్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు & ఐదు అంగుళాల TFT డిస్‌ప్లే ఇచ్చారు. దీనికి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. కీలెస్ ఇగ్నిషన్ & ఆటో స్టార్ట్/స్టాప్‌ను కూడా VLF మాబ్‌స్టర్ 135 లో ఉన్నాయి. మోటోహాస్, ఈ స్కూటర్‌ను గ్రే, వైట్, రెడ్ & ఫ్లోరోసెంట్ ఎల్లో కలర్స్‌లో అమ్ముతోంది.
ఇంజిన్ & పనితీరు
VLF మోబ్‌స్టర్ 135.. 125cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పవర్‌ఫుల్‌గా పరుగులు తీస్తుంది. ఈ ఇంజిన్ 12.1 bhp & 11.7 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది, ఇది స్కూటర్ గరిష్టంగా గంటకు 105 km వేగాన్ని చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. స్కూటర్‌లో 8 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కూడా ఉంది, ట్యాంక్ ఫుల్ చేసి హ్యాపీగా లాంగ్ రైడ్‌కు వెళ్లిపోవచ్చు.
ధర & బుకింగ్ వివరాలు
రేటు విషయానికి వస్తే... VLF మాబ్‌స్టర్ 135 మన తెలుగు రాష్ట్రాల్లో ₹1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ధర మొదటి 2,500 మంది కస్టమర్లకు మాత్రమే & ఆ తర్వాత రేటు పెరగవచ్చు. అన్నింటికంటే ముందుగా, ఈ స్కూటర్‌ను కేవలం ₹999 కి బుక్ చేసుకోవచ్చు & డెలివరీలు నవంబర్ 2025లో ప్రారంభమవుతాయి.
వారంటీ & అమ్మకాల తర్వాత సేవలు
మోటోహాస్, VLF మోబ్‌స్టర్ 135 స్కూటర్‌పై కస్టమర్లకు నాలుగు సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. ఒక సంవత్సరం రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA) కూడా ఇస్తుంది, ఇది కస్టమర్లకు అమ్మకాల తర్వాత సర్వీస్‌పై విశ్వాసాన్ని ఇస్తుంది.
VLF మోబ్‌స్టర్ 135 స్కూటర్‌ను మన మార్కెట్లో ప్రీమియం & స్టైలిష్ ఆప్షన్‌గా లాంచ్ చేశారు. శక్తిమంతమైన ఇంజిన్, ఆధునిక లక్షణాలు & అందుబాటు ధర యువతను ఆకర్షిస్తాయి.





















