₹1 లక్షలోపే TVS Orbiter లాంచ్ - రేటు, రేంజ్‌లో Ola, Vida స్కూటర్లకు గట్టి పోటీ! - ఏది బెస్ట్?
TVS Orbiter Price 2025: TVS Orbiter ₹99,900కి లాంచ్ అయి Ola S1 X+ & Vida VX2 Plusతో పోటీలోకి దిగింది. రేంజ్, స్పీడ్, ప్రైస్‌లో ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

TVS Orbiter Vs Ola S1 X+ Vs Vida VX2 Plus: ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో రోజురోజుకూ హీట్ పెరుగుతోంది. కస్టమర్లను ఆకర్షించడానికి, ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడానికి ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు కొత్త మోడల్స్‌తో పోటీ పడుతున్నాయి. తాజాగా, TVS Motor తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ TVS Orbiter ని లాంచ్ చేసింది. దీని ధర రూ. 99,900 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ఆర్బిటర్ ఆరు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది, అవి - నియాన్ సన్బర్స్ట్ (Neon Sunburst), స్ట్రాటోస్ బ్లూ (Stratos Blue), లూనార్ గ్రే (Lunar Grey), స్టెల్లార్ సిల్వర్ (Stellar Silver), కాస్మిక్ టైటానియం (Cosmic Titanium), మార్షియన్ కాపర్ (Martian Copper). ఇప్పుడు మార్కెట్లో బాగా అమ్ముడువుతున్న Ola S1 X+ & Vida VX2 Plus కు డైరెక్ట్‌గా పోటీగా TVS Orbiter రంగంలోకి దిగింది.
టీవీఎస్ ఆర్బిటర్ -- ఓలా S1 X+ -- విడా VX2 Plus
ప్రత్యేకతలు (Specifications)
TVS Orbiter - ఆర్బిటర్‌లో 3.1 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఫుల్ ఛార్జ్ చేస్తే 158 km రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. టాప్ స్పీడ్ 68 km/h వరకు దూసుకుపోతుంది. ఇది డైలీ కమ్యూటింగ్‌కి సరిపడే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా నిలుస్తోంది.
Ola S1 X+ (Gen 3) - ఓలా స్కూటర్‌లో 4 kWh బ్యాటరీ ఉంది. దీని IDC రేంజ్ 242 km వరకు ఉంది. పవర్ విషయానికి వస్తే 14.75 hp పీక్ అవుట్‌పుట్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 125 km/h. అంటే, స్పీడ్ లవర్స్‌కి Ola S1 X+ టఫ్ కాంపిటేటర్.
Vida VX2 Plus -హీరో Vida VX2 Plus లో 3.4 kWh బ్యాటరీ ఉంది. రేంజ్ 142 km వరకు ఇస్తుంది. స్పెషల్ ఫీచర్ ఏమిటంటే, ఇది 0-40 km/h ని కేవలం 3.1 సెకన్లలో చేరుతుంది. టాప్ స్పీడ్ 80 km/h. పర్ఫార్మెన్స్ & యాక్సిలరేషన్‌లో ఇది యూత్‌కి బాగానే నచ్చే ఛాయిస్.
ధరలు (Prices)
TVS Orbiter: సుమారు ₹1.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధర (Hyderabad, Vijayawada).
Ola S1 X+: రూ. 89,999 ఎక్స్-షోరూమ్.
Vida V2 Plus: రూ. 1.26 లక్షల ఎక్స్-షోరూమ్.
ధర పరంగా చూస్తే Ola S1 X+ చవకగా దొరుకుతుండగా, ఫీచర్స్ విషయంలో TVS Orbiter, Vida V2 Plus కొంచెం ఎక్కువ అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి.
ఫీచర్స్ (Features)
TVS Orbiter: డిజిటల్ క్లస్టర్, స్మార్ట్ కనెక్టివిటీ, GPS, నావిగేషన్, క్విక్ ఛార్జింగ్ ఆప్షన్.
Ola S1 X+: టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, మ్యూజిక్ బ్లూటూత్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్.
Vida V2 Plus: స్వాపబుల్ బ్యాటరీ, రిమూవబుల్ ఆప్షన్, ఆన్‌లైన్ OTA అప్‌డేట్స్.
ఫీచర్స్‌లో Ola S1 X+ యువతకు అట్రాక్టివ్‌గా అనిపిస్తే, Vida V2 Plus టెక్-ఫ్రెండ్లీ యూజర్లకు బెటర్.
ఛార్జింగ్ టైమ్ (Charging Time)
TVS Orbiter: 0-80% కేవలం 60 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జింగ్.
Ola S1 X+: 5 గంటల్లో ఫుల్ ఛార్జ్.
Vida V2 Plus: 6 గంటల సమయం.
డిజైన్ & కంఫర్ట్ (Design & Comfort)
TVS Orbiter: షార్ప్ & మాడర్న్ లుక్, స్పోర్టీ ఫినిషింగ్.
Ola S1 X+: స్టైలిష్, యూత్‌ఫుల్ డిజైన్.
Vida V2 Plus: కాంపాక్ట్, సింపుల్, ప్రాక్టికల్.
ఎవరికి బెస్ట్?
తక్కువ బడ్జెట్ & స్టైలిష్ ఆప్షన్ కావాలంటే - Ola S1 X+
లాంగ్ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే - TVS Orbiter
స్వాపబుల్ బ్యాటరీ, టెక్నాలజీ ఫ్రెండ్లీ స్కూటర్ కావాలంటే - Vida V2 Plus
ఓవరాల్‌గా చూస్తే, TVS Orbiter ఒక బ్యాలెన్స్‌డ్ ప్యాకేజ్‌లా అనిపిస్తోంది.





















