అన్వేషించండి

TVS Jupiter 110 ప్రయోజనాలు, పరిమితులు - కొనే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

TVS Jupiter 110 Review: టీవీఎస్‌ జూపిటర్ 110 స్కూటర్‌ లోని లాభాలు & నష్టాలు ఏమిటో తెలుసుకుంటే, మీకు సరైన స్కూటర్‌ ఇదా-కాదా అని ఈజీగా నిర్ణయించుకోవచ్చు.

TVS Jupiter 110 Pros And Cons Full Details Telugu: స్కూటర్‌ సెగ్మెంట్‌లో TVS కంపెనీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందులోనూ TVS జూపిటర్ 110 మోడల్‌ చాలా కాలంగా మార్కెట్లో నిలకడగా అమ్ముడవుతోంది. ఇది ఫ్యామిలీ స్కూటర్‌గా మాత్రమే రాలేదు, యువత నుంచి సీనియర్‌ సిటిజన్స్‌ వరకు అందరికీ సరిపడేలా తయారైంది. అయితే, ప్రతి వాహనంలో ఉన్నట్టుగానే దీనిలో కూడా లాభాలు, నష్టాలు (Pros And Cons) రెండూ ఉన్నాయి. కాబట్టి, ఈ టూవీలర్‌ కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి స్పష్టమైన అవగాహనకు రావడం మంచిది.

లాభాలు (Pros)

1. మైలేజీ & పెర్ఫార్మెన్స్‌
TVS Jupiter 110 లో 109.7 cc ఇంజిన్‌ ఉంది. ఇది శక్తిమంతమైన & ఫ్యూయల్‌ ఎఫిషియెంట్‌ స్కూటర్‌గా పేరు సంపాదించుకుంది. సిటీ రైడింగ్‌లో లీటరుకు 45-50 km వరకు మైలేజీ ఇస్తోంది. దీనివల్ల, రోజూ ఆఫీస్‌ లేదా కాలేజీకి వెళ్ళే వారికి ఇది ఒక మంచి ఆప్షన్‌.

2. కంఫర్ట్‌ & రైడింగ్‌ క్వాలిటీ
ఈ స్కూటర్‌ రోడ్డుపై చాలా స్మూత్‌గా నడుస్తుంది. సస్పెన్షన్‌ సెటప్‌ & వెడల్పాటి సీటు రైడర్‌కి, పిలియన్‌కి (వెనుక కూర్చున్న వ్యక్తి) ఇద్దరికీ మంచి కంఫర్ట్‌ ఇస్తుంది. లాంగ్‌ డ్రైవ్స్‌లో కూడా అలసట తక్కువగా ఉంటుంది.

3. ప్రాక్టికల్‌ ఫీచర్లు
జూపిటర్‌లో లార్జ్‌ అండర్‌-సీట్‌ స్టోరేజ్‌ దీనికి పెద్ద ప్లస్‌. హై-స్పెక్‌ వేరియంట్‌లో మొబైల్‌ ఛార్జింగ్‌ సాకెట్‌, ఈజీ స్టార్ట్‌ టెక్నాలజీ ఉన్నాయి. అలాగే, పెట్రోల్‌ బంకుకు వెళ్లినప్పుడు ఫిల్లింగ్‌ కోసం స్కూటర్‌ దిగాల్సిన అవసరం లేదు. స్కూటర్‌ సీటును పైకి ఎత్తాల్సిన అవసరం లేకుండా, హ్యాండిల్‌ దగ్గరే ఫ్యూయల్‌ క్యాప్‌ ఇచ్చారు. ముఖ్యంగా, సీనియర్‌ సిటిజన్లు, మహిళలకు ఇది పెద్ద వెసులుబాటు.

4. నమ్మకమైన బ్రాండ్‌
మన్నిక, సర్వీస్‌ అందుబాటు, స్పేర్‌ పార్ట్స్‌ సులభంగా అందుబాటులో ఉండడం వంటి కారణాల వల్ల TVS స్కూటర్లను కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు, మెకానిక్‌ దగ్గర సులభంగా సర్వీస్‌ చేయించుకోవచ్చు.

నష్టాలు (Cons)

1. కాస్త సాధారణంగా కనిపించే డిజైన్‌
జూపిటర్ 110 లుక్‌ ప్రాక్టికల్‌గా ఉన్నా, యువత కోరుకునే షార్ప్‌ & మోడ్రన్‌ డిజైన్‌ ఫీల్‌ దీనిలో కొద్దిగా లోపించింది. ఆకర్షణీయంగా కాకుండా సింపుల్‌గా కనిపించడం కొంతమందికి నచ్చకపోవచ్చు.

2. హై-ఎండ్‌ ఫీచర్లు లేవు
ఇప్పుడు మార్కెట్లో చాలామంది స్కూటర్లలో డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ లాంటివి వస్తున్నాయి. కానీ జూపిటర్ 110లో ఇవి లేవు. బేసిక్‌ ఫీచర్లకే పరిమితం అవుతుంది.

3. హైవే రైడింగ్‌కు సరిపోదు
ఈ స్కూటర్‌ ప్రధానంగా సిటీ రైడింగ్‌ కోసం రూపొందించబడింది. కాబట్టి హైవేలో లాంగ్‌ రైడ్‌కు వెళ్లినప్పుడు ఇంజిన్‌ పవర్‌ కొంత తక్కువగా అనిపిస్తుంది.

4. వెరియంట్లలో కన్ఫ్యూజన్‌
కొనుగోలు సమయంలో Classic, ZX, Standard లాంటి వెరియంట్లు ఉండటంతో కొత్త కస్టమర్లు ఏది ఎంచుకోవాలో కాస్త గందరగోళానికి గురవుతారు.

TVS జూపిటర్ 110 ఒక నమ్మకమైన, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ స్కూటర్‌. మైలేజీ, కంఫర్ట్‌, ప్రాక్టికల్‌ ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్‌. కానీ మీరు మోడ్రన్‌ ఫీచర్లు, స్టైలిష్‌ డిజైన్‌ కోరుకుంటే మార్కెట్లో ఇతర ఆప్షన్లను కూడా పరిశీలించవచ్చు. మొత్తానికి, రోజువారీ ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉండే, తక్కువ మెయింటెనెన్స్‌ స్కూటర్‌ కావాలనుకుంటే TVS జూపిటర్ 110 సరైన ఎంపిక అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget