అన్వేషించండి

Turbo Petrol vs Naturally Aspirated Engines: టర్బో పెట్రోల్ వర్సెస్ నార్మల్ ఇంజిన్: మీ కారుకు ఏది బెస్ట్? 

భారత ఆటోమొబైల్ మార్కెట్లో టర్బో , నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు, వాటి పనితీరు అలాగే మైలేజీ గురించి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Turbo Petrol vs Naturally Aspirated Engines Comparison : ప్రస్తుతం ఇండియన్ కార్ మార్కెట్లో టర్బో పెట్రోల్ ఇంజిన్ల హవా విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా కాంపాక్ట్ ఎస్‌యూవీలు, సెడాన్లు ఇంకా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో కంపెనీలు వీటినే ఎక్కువగా వాడుతున్నాయి. పాత కాలపు పెద్ద ఇంజిన్ల ప్లేస్‌లో చిన్న సైజు టర్బో యూనిట్లను ప్రవేశపెట్టడం ద్వారా అటు పర్ఫార్మెన్స్ ఇటు కాలుష్య నియంత్రణ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాయి. అయితే తక్కువ మెయింటెనెన్స్ అలాగే స్మూత్ డ్రైవింగ్ కోరుకునే వారు ఇప్పటికీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (NA) ఇంజిన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ రెండు ఇంజిన్ల మధ్య అసలు తేడా ఏమిటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

తేడా ఏంటంటే..?
ముందుగా గాలి ఇంజిన్‌లోకి ఎలా వెళ్తుంది అనే అంశంపైనే ఈ రెండింటి డిఫరెన్స్ ఆధారపడి ఉంటుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్లలో ఒక టర్బోచార్జర్ ఉంటుంది. ఇది కంబషన్ ఛాంబర్‌లోకి ఫోర్స్‌గా గాలిని పంపి చిన్న ఇంజిన్ అయినా సరే ఎక్కువ పవర్ ఇంకా టార్క్‌ను జనరేట్ చేసేలా చేస్తుంది. అదే నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్లు కేవలం వాతావరణ పీడనం (Atmospheric Pressure) మీద ఆధారపడి గాలిని పీల్చుకుంటాయి. దీనివల్ల పవర్ డెలివరీ చాలా లీనియర్‌గా, అంటే క్రమ పద్ధతిలో సాగుతుంది.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టర్బో ఇంజిన్లదే పైచేయి అని చెప్పవచ్చు. సాధారణంగా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు దాదాపు 170Nm నుండి 200Nm వరకు టార్క్‌ను ఇస్తాయి. కానీ అదే సైజులో ఉన్న నార్మల్ ఇంజిన్లు కేవలం 110Nm నుండి 145Nm టార్క్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి. టర్బో ఇంజిన్లు తక్కువ ఆర్‌పీఎమ్ (RPM) దగ్గరే పీక్ టార్క్‌ను ఇస్తాయి కాబట్టి హైవేల మీద ఓవర్ టేక్ చేసేటప్పుడు లేదా స్పీడ్ పెంచేటప్పుడు ఇవి రాకెట్లా దూసుకుపోతాయి. హై స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు పదే పదే గేర్లు మార్చాల్సిన అవసరం కూడా ఉండదు.

న‌గ‌రాల్లో కంఫ‌ర్ట్..
నగరాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్లు చాలా కంఫర్ట్ ఇస్తాయి. ట్రాఫిక్‌లో తక్కువ స్పీడ్ వద్ద కారును కంట్రోల్ చేయడం వీటితో చాలా ఈజీ. టర్బో ఇంజిన్లలో స్టార్టింగ్‌లో కొంచెం లాగ్ (Turbo Lag) అనిపిస్తుంది. నేటి కాలంలో కంపెనీలు ఈ లాగ్‌ను తగ్గించినప్పటికీ, నార్మల్ ఇంజిన్లలో ఉండే ఆ స్మూత్ రెస్పాన్స్ వీటికి రాదు. ముఖ్యంగా డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఉన్న టర్బో కార్లు ట్రాఫిక్‌లో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. అందుకే సిటీలో తిరిగే వారికి నార్మల్ ఇంజిన్లే సరైన ఛాయిస్ అవుతాయి.

ఇక అందరూ ఆశించే మైలేజీ విషయానికి వస్తే పేపర్ మీద టర్బో ఇంజిన్లు మంచి ఫిగర్స్ చూపిస్తాయి. ఎందుకంటే వాటి సైజు తక్కువ కాబట్టి తక్కువ ఇంధనం ఖర్చు చేస్తాయని అనుకుంటారు. కానీ రియల్ వరల్డ్ లో మైలేజీ అనేది మన డ్రైవింగ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. హైవే మీద ఒకే స్పీడ్ తో వెళ్తే టర్బో ఇంజిన్లు అదిరిపోయే మైలేజీ ఇస్తాయి. అదే మనం దూకుడుగా ఎక్సలరేటర్ నొక్కితే మాత్రం పెట్రోల్ తాగేస్తాయి. నార్మల్ ఇంజిన్లు అలా కాదు, సిటీలోనైనా హైవేలోనైనా దాదాపు ఒకే రకమైన మైలేజీని నిలకడగా ఇస్తాయి.

మెయింట‌నెన్స్..
లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ గురించి ఆలోచిస్తే నార్మల్ ఇంజిన్లు చాలా సింపుల్ గా ఉంటాయి. వీటిలో విడిభాగాలు తక్కువ కాబట్టి రిపేర్లు కూడా తక్కువ ఖర్చుతో అయిపోతాయి. కానీ టర్బో ఇంజిన్లు ఎక్కువ వేడి ఇంకా ప్రెజర్ వద్ద పనిచేస్తాయి. కాబట్టి వీటిని టైమ్ కి సర్వీస్ చేయించడం, మంచి క్వాలిటీ ఇంజిన్ ఆయిల్ వాడటం చాలా ముఖ్యం. ఒకవేళ వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత టర్బోచార్జర్ పాడైతే మాత్రం జేబుకు చిల్లు పడటం ఖాయం.

చివరగా చెప్పాలంటే మీకు హైవే డ్రైవింగ్ ఎక్కువగా ఉండి, అదిరిపోయే పికప్ కావాలి అనుకుంటే టర్బో పెట్రోల్ కారు తీసుకోండి. అలా కాకుండా నాకు మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, సిటీలో స్మూత్ గా డ్రైవ్ చేయాలి అనుకుంటే మాత్రం నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ బెస్ట్ ఆప్షన్. మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన ఇంజిన్‌ను ఎంచుకోవడం వల్ల డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది. కారు కొనేముందు ఈ రెండు రకాలను టెస్ట్ డ్రైవ్ చేసి మీకు ఏది సెట్ అవుతుందో చెక్ చేసుకోవడం మంచిది.

టాప్ హెడ్ లైన్స్

ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget