అన్వేషించండి

Next Gen Kia Sonet Spotted Testing: రోడ్డుపైకి వచ్చేసిన కొత్త కియా సోనెట్.. అదిరిపోయే డిజైన్ తో నెక్స్ట్ జనరేషన్ మోడల్! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

కియా మోటార్స్ తన పాపులర్ ఎస్‌యూవీ సోనెట్ లో సెకండ్ జనరేషన్ మోడల్ ను సిద్ధం చేస్తోంది. తాజాగా భారత్ లో టెస్టింగ్ లో ఉండగా ఈ కారు కనిపించింది.

Next Gen Kia Sonet Spotted Testing for the First Time : ఇండియ‌న్ మార్కెట్లో కియా సోనెట్ కు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ కారును మరింత అప్‌గ్రేడ్ చేస్తూ సెకండ్ జనరేషన్ మోడల్ ను కంపెనీ రెడీ చేస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన టెస్టింగ్ పనులు మొదలయ్యాయి. ఇటీవల స్పై ఇమేజెస్ లో కనిపించిన వివరాల ప్రకారం ఈ కారులో భారీ మార్పులే ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.

డిజైన్ హైలైట్స్..
కొత్త సోనెట్ డిజైన్ కియా లేటెస్ట్ సేల్టోస్ ను పోలి ఉంటుంది. ముఖ్యంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్ సెల్టోస్ కారును గుర్తుకు తెస్తుంది. హెడ్ లైట్ల పైన ఐబ్రో షేప్ లో ఉన్న ఎల్ఈడీ డిఆర్ఎల్స్ కారుకు అగ్రెసివ్ లుక్ ఇస్తున్నాయి. కారు బంపర్ కూడా ఇప్పుడు చాలా క్లీన్ గా, స్టైలిష్ గా కనిపిస్తోంది. కొత్త డిజైన్ తో వచ్చిన అలాయ్ వీల్స్ కారు అందాన్ని మరింత పెంచుతున్నాయి. ఇక సన్‌రూఫ్ విషయానికి వస్తే, ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ ఇస్తారా లేదా సింగిల్ పేన్ తోనే సరిపెడతారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

క్యాబిన్ , సేఫ్టీ..
నెక్స్ట్ జనరేషన్ సోనెట్ ఇప్పుడున్న K2 ప్లాట్‌ఫారమ్ నుంచి సరికొత్త K1 ప్లాట్‌ఫారమ్ కు మారబోతోంది. దీనివల్ల కారు లోపల లెగ్ స్పేస్, హెడ్ స్పేస్ పెరిగే అవకాశం ఉంది. హ్యుందాయ్ వెన్యూ, కియా సైరోస్ వంటి కార్లను కూడా ఇదే ప్లాట్‌ఫారమ్ పై తయారు చేస్తున్నారు. లోపల ఇంటీరియర్ చూస్తే.. పూర్తిగా కొత్త డిజైన్ తో కూడిన డ్యాష్ బోర్డ్ ఉండబోతోంది. 12.3 ఇంచుల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అదే సైజులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చే అవకాశం ఉంది. సేఫ్టీ పరంగా భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP) లో 5 స్టార్ రేటింగ్ సంపాదించడమే కియా లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందులో లెవల్-2 అడాస్ (ADAS) ఫీచర్లు ఉండే అవకాశం కూడా ఉంది.

ఇంజిన్ ఆప్షన్లు..
మెకానికల్ గా చూస్తే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లనే కియా కొనసాగించే అవకాశం ఉంది. వీటిలో మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు కూడా ఉంటాయి. అయితే ఒక కీలకమైన అప్‌డేట్ ఏంటంటే.. కియా ఇప్పుడు స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ పై కూడా పని చేస్తోంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో కూడిన హైబ్రిడ్ మోడల్ 2028 లేదా 2029 నాటికి మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల మైలేజీ పరంగా సోనెట్ తన సెగ్మెంట్ లోనే టాప్ లో నిలుస్తుంది.

పోటీ కంపెనీలు..
మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లకు ఈ కొత్త సోనెట్ గట్టి పోటీ ఇవ్వబోతోంది. కియా తన క్వాలిటీ, ఫీచర్ల లోడ్ తో మరోసారి మార్కెట్ ను శాసించాలని ప్లాన్ చేస్తోంది. 2027 లో లాంచ్ అయ్యే నాటికి ఈ కారులో మరిన్ని కొత్త హంగులు చేర్చే అవకాశం ఉంది. ఎస్‌యూవీ లవర్స్ ఈ కొత్త సోనెట్ కోసం కచ్చితంగా వెయిట్ చేయాల్సిందే.

టాప్ హెడ్ లైన్స్

CNG కార్లకు వరుస అప్‌డేట్స్‌ వదిలిన మారుతి.. ఇప్పుడు స్విఫ్ట్, డిజైర్‌లో కూడా AMT ఆప్షన్‌
ఇప్పుడు స్విఫ్ట్, డిజైర్‌ CNG వెర్షన్ల డ్రైవింగ్‌ మరింత స్మూత్‌.. AMT గేర్‌బాక్స్‌ ఇచ్చిన మారుతి
రూ.8.32 లక్షలకే Maruti Baleno CNG AMT.. కిలోకు ఏకంగా 34.47 కిలోమీటర్లు!
మారుతి బలెనో CNGలో 'ఆటోమేటిక్‌' అప్‌డేట్.. కొత్త వేరియంట్‌ మైలేజ్ ఎంతంటే?
పాత లుక్ - కొత్త అనుభూతి.. నిజ జీవితంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 440 రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌
సాధారణ రోడ్లపై Royal Enfield Himalayan 440 పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉంది? - ఎక్స్‌పర్ట్‌ రిపోర్ట్‌
క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV.. బేయాన్‌ గురించి కీలక వివరాలు షేర్‌ చేసిన హ్యుందాయ్‌
మిడిల్‌క్లాస్ ఫ్యామిలీలకు ప్రీమియం SUV.. Hyundai Bayon కొత్త టీజర్‌ లాంచ్‌ - ఇవే హైలైట్స్

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget