అన్వేషించండి

పవర్ తగ్గినా పెర్ఫార్మెన్స్‌లో తగ్గేదేలే.. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X రియల్‌ రోడ్‌ టెస్ట్ రిజల్ట్స్

350cc ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌ యాక్సిలరేషన్, రోల్ ఆన్, బ్రేకింగ్ పనితీరును పరిశీలిస్తే కీలక వివరాలు ఇవే.

350cc Triumph Scrambler 400 X Price And Features Telugu: పాపులర్‌ టూవీలర్‌ కంపెనీ ట్రయంఫ్ నుంచి వచ్చిన స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌.. ఇప్పుడు కొత్త ఇంజిన్‌తో పరుగులు తీస్తోంది. మన దేశంలోనే తయారయ్యే ట్రయంఫ్ మోటార్‌సైకిళ్లలో 399cc ఇంజిన్ స్థానంలో 349cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను తీసుకొచ్చారు. ఇంజిన్ సామర్థ్యం తగ్గినా (399cc నుంచి 349cc) ఈ బండి పెర్ఫార్మెన్స్‌పై మాత్రం పెద్దగా ప్రభావం కనిపించకపోవడమే ఇక్కడ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌.

కొత్త ఇంజిన్ 8,500rpm వద్ద గరిష్ఠంగా 37hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 7,000rpm వద్ద గరిష్ఠ టార్క్ 32Nm వస్తుంది. పాత 399cc ఇంజిన్ 40hp శక్తి & 37.5Nm టార్క్‌ను అందించేది. అంటే కొత్త మోడల్‌లో శక్తి & టార్క్ కొంత తగ్గాయి.

అయితే, వాస్తవ రైడింగ్‌లో ఈ మార్పు అంతగా ఇబ్బంది పెట్టదు. కొత్త ఇంజిన్ పవర్ డెలివరీ మరింత సరళంగా ఉంది. 6,000rpm దాటిన తర్వాత పవర్ బాగా పెరుగుతుంది. ఇంజిన్ 9,700rpm వద్ద రెడ్‌లైన్‌కు చేరుతుంది. వైబ్రేషన్స్ కూడా తగ్గాయి. దీంతో నగర ప్రయాణాలతో పాటు హైవే ప్రయాణాల్లోనూ రైడింగ్ మరింత సౌకర్యంగా ఉంటుంది.

వేగం
పనితీరును పరిశీలించేందుకు ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించిన పరీక్షల్లో స్క్రాంబ్లర్ 400 X మంచి ఫలితాలు చూపించింది. పొడి రోడ్డుపై నిర్వహించిన పరీక్షలో 0-40kph వేగాన్ని 1.79 సెకన్లలో అందుకుంది. 0-60kphకు 3.27 సెకన్లు పట్టింది. 0-80kphకు 5.37 సెకన్లు పట్టగా, 0-100kph వేగాన్ని 8.54 సెకన్లలో చేరుకుంది.

రోల్ ఆన్ పరీక్షల్లోనూ బైక్ చురుకైన పనితీరు చూపించింది. రెండో గేర్‌లో 20-50kph వేగాన్ని 2.82 సెకన్లలో అందుకుంది. మూడో గేర్‌లో 30-70kphకు 4.12 సెకన్లు పట్టింది. నాలుగో గేర్‌లో 50-80kph వేగాన్ని 4.20 సెకన్లలో చేరుకుంది. నగరంలో వేగంగా ఓవర్‌టేక్ చేయడానికి ఈ పనితీరు సరిపోతుంది.

ఇది కూడా చదవండి: డ్రైవింగ్ లైసెన్స్, RC లేకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటీలను నడపవచ్చు! EVల ధరలు చూశారా

బ్రేకింగ్ 
బ్రేకింగ్ సిస్టమ్‌ పనితీరు కూడా సంతృప్తికరంగానే ఉంది. 60kph వేగం నుంచి పూర్తిగా ఆగడానికి 16.51 మీటర్ల దూరం పట్టింది. అయితే బ్రేక్ లివర్ ఫీడ్‌బ్యాక్ మరింత మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి. సింటర్డ్ ప్యాడ్స్‌కు మారితే బ్రేకింగ్ ఫీల్ మెరుగుపడే అవకాశం ఉంది.

ఇతర వివరాలు
ఈ బైక్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. 13 లీటర్ల ఇంధన ట్యాంక్ ఇచ్చారు. బైక్ బరువు 185 కిలోలు. సీటు ఎత్తు 835 మిల్లీమీటర్లు. ముందు 320 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ & వెనుక 230 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ముందు 100/90-19, వెనుక 140/80-17 టైర్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: యంగ్‌స్టర్స్ ఫేవరెట్ Bajaj Pulsar 125 ఆన్-రోడ్ ధర, 3, 4, 5 ఏళ్ల EMI ఫుల్ క్యాలిక్యులేషన్

కొత్త 350cc ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌ ఒకే వేరియంట్‌లో లభిస్తుంది. నాలుగు రంగుల ఎంపికలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దీని ఎక్స్‌-షోరూమ్ ధర రూ.2.65 లక్షలు. పవర్ కొంత తగ్గినా, మెరుగైన వైబ్రేషన్ నియంత్రణ, సరళమైన పవర్ డెలివరీ & మంచి రోల్ ఆన్ పనితీరు ఈ బైక్‌కు ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!
Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
Maruti Fronx కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చిన Brezza Turbo.. సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై మీద ఎంత ఇచ్చిందంటే?
మారుతి బ్రెజ్జా టర్బో నిజమైన మైలేజ్ ఎంత? రియల్ వరల్డ్‌ టెస్ట్‌ ఫలితాలు ఇవిగో
సొంతంగా టాక్సీ నడిపేవాళ్లకు గొప్ప అవకాశం.. 320km రేంజ్‌ ఇచ్చే ఎలక్ట్రిక్‌ కారు.. రూ.4.5 లక్షలే!
టాక్సీ డ్రైవర్ల కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు.. కేవలం రూ.4.5 లక్షలే.. సింగిల్‌ ఛార్జ్‌తో 320km!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - వ్యక్తిగత జీవితాలపై రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
Embed widget