Toyota Urban SUV: టయోటా అర్బన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ డిజైన్ ఇదే - లాంచ్ ఎప్పుడంటే?
Toyota Urban: టయోటా అర్బన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ వెర్షన్‌ను కంపెనీ రివీల్ చేసింది.
Toyota Urban SUV Concept: టయోటా తన అర్బన్ ఎస్‌యూవీకి సంబంధించిన కాన్సెప్ట్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఇది మారుతి సుజుకి ఈవీఎక్స్‌కి తమ్ముడు లాంటిది అని చెప్పవచ్చు. ఈ రెండూ నేటివ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు. ఇవి 2025లో విడుదల కావచ్చని భావిస్తున్నారు.
టయోటా, సుజుకి వేరియంట్లు రెండూ స్టైలింగ్ పరంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. అర్బన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ టయోటా కార్లలో ఇచ్చిన డిజైన్‌ను కలిగి ఉంటుంది. టయోటా దీని ఫీచర్లను ఇంకా వెల్లడించలేదు. అయితే అర్బన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ పొడవు 4300 మిల్లీమీటర్లు కాగా, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 550 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చని సమాచారం. ఇది రెండు బ్యాటరీ సైజులను కలిగి ఉంటుంది. వీటిలో 550 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే వేరియంట్ టాప్ ఎండ్‌గా ఉంటుంది. ఇది టయోటాకు సంబంధించి అత్యంత కాంపాక్ట్ బీఈవీ. హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ వంటి వాహనాలతో పోటీపడుతుంది.
ఇక ఈవీఎక్స్‌ను పరిశీలిస్తే అర్బన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ మోడల్ వెనుక స్టైలింగ్‌తో సహా కొన్ని అంశాలలో సమానంగా ఉంటుంది. అయితే ఫ్రంట్ ఎండ్ భిన్నంగా కనిపిస్తుంది. ఈవీఎక్స్ కాకుండా, అర్బన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ సొగసైన ఎల్ఈడీ లైటింగ్ స్ట్రిప్‌తో ఉంది. అర్బన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ గుజరాత్‌లో ఈవీఎక్స్‌తో పాటు తయారు అవుతుంది. టయోటా, మారుతి రెండింటి ద్వారా మాస్ మార్కెట్‌లో పరిచయం కానుంది. విపరీతమైన లోకలైజేషన్ కారణంగా ధర తక్కువగా ఉండవచ్చు. ఇది భవిష్యత్తులో ఈ ఈవీకి ప్రయోజనం చేకూరుస్తుంది.
దీని ప్రొడక్షన్ స్పెక్ వేరియంట్ ఇక్కడ చూపిన కాన్సెప్ట్‌కు భిన్నంగా ఉంటుంది. అయితే ఈ రెండు కార్ల తయారీదారుల భవిష్యత్ ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌లకు ఇది చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు. ప్రపంచ స్థాయిలో కూడా టయోటా తన ఈవీ గురించి చాలా ఉత్సాహంగా ఉంది. అర్బన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు, ధర పరంగా ఇది హైరైడర్ కంటే పై స్థాయిలో ఉండనుంది.
మరోవైపు టయోటా ఇటీవలే తన పికప్ ట్రక్ హైలక్స్‌ను మైల్డ్ హైబ్రిడ్ సెటప్‌తో రివీల్ చేసింది. ఈ డీజిల్ ఇంజిన్ ఉన్న ఎస్‌యూవీ భవిష్యత్తు కొత్తగా హైబ్రిడ్ దారివైపు మళ్లుతుందని దీన్ని బట్టి అనుకోవచ్చు. హైలక్స్ ఎంహెచ్ఈవీ ప్రాథమికంగా 2.8 లీటర్ డీజిల్ ఇంజన్‌పై బేస్ అయి రానుంది. ఇది మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో ఉన్న 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ మైలేజీని పెంచడానికి, డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగు పరచడానికి ఉపయోగపడుతుంది. హైలక్స్ మైల్డ్ హైబ్రిడ్ కూడా ఒక చిన్న బ్యాటరీ, మోటారును కలిగి ఉంది. ఇది కారు టార్క్‌ను పెంచడంలో ఉపయోగపడుతుంది. ప్రామాణిక డీజిల్ ఇంజిన్‌తో పోలిస్తే ఇది మైలేజీని 10 శాతం వరకు పెంచనుందని తెలుస్తోంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!
Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!