అన్వేషించండి

Hycross Limited Edition: ఇన్నోవా హైక్రాస్‌లో లిమిటెడ్ ఎడిషన్ - కేవలం డిసెంబర్ వరకు మాత్రమే!

Innova Hycross Limited Edition: టయోటా ఇన్నోవా హైక్రాస్‌లో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ అయింది. దీని ధర రూ.20.07 లక్షల నుంచి ప్రారంభం అయింది.

Toyota Innova Hycross Limited Edition: టయోటా పెట్రోల్ జీఎక్స్ వేరియంట్ ఆధారంగా ఇన్నోవా హైక్రాస్ కొత్త లిమిఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 20.07 లక్షల నుంచి రూ. 20.22 లక్షల మధ్య ఉంటుంది. దీని ధర స్టాండర్డ్ జీఎక్స్ వేరియంట్ కంటే రూ. 40,000 ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొన్ని మార్పులు కూడా చేశారు.

ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్ చాలా తక్కువగా చేశారు. మధ్యలో ఉన్న గ్రిల్‌పై కొత్త క్రోమ్ గార్నిష్, ముందూ వెనుకా ఉన్న బంపర్‌ల్లో కొత్త ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌లు అందించారు. దాని ప్లాటినం వైట్ ఎక్స్‌టీరియర్ పెయింట్ షేడ్ కోసం మీరు అదనంగా రూ.9,500 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే తక్కువ జీఎక్స్ ట్రిమ్‌పై రూపొందిన కారణంగా హైఎండ్ వేరియంట్లలో లభించే బంపర్ గార్నిష్, పెద్ద అల్లాయ్ వీల్స్ ఇందులో లేవు.

ఇంటీరియర్స్‌లో ఏం మార్పులు చేశారు?
దీని ఇంటీరియర్‌లో ముఖ్యమైన అప్‌డేట్‌లు అందించారు. ఇది డాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్‌ల కోసం కొత్త సాఫ్ట్ టచ్, చెస్ట్‌నట్ బ్రౌన్ ఫినిషింగ్‌ను పొందుతుంది. సాధారణ జీఎక్స్ ట్రిమ్ బ్లాక్ ప్లాస్టిక్‌ను పొందుతుంది. విండో కంట్రోల్స్ చుట్టూ కొత్త ఫాక్స్ వుడ్ ట్రిమ్ కూడా ఉంది. అయితే ఫాబ్రిక్ సీట్ కవర్లు కొత్త డ్యూయల్ టోన్ బ్లాక్, బ్రౌన్ ఫినిషింగ్‌ను పొందుతాయి. జీఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్‌ల్లో అందుబాటులో ఉంది.

ఇంజిన్ ఎలా ఉంది?
జీఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ 2.0 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ సీవీటీ గేర్‌బాక్స్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్ 172 హెచ్‌పీ పవర్‌ని, 205 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్నోవా హైక్రాస్ జీఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ డిసెంబర్ వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు టాటా మోటార్స్ త్వరలో టాటా పంచ్ ఈవీ కారును కూడా లాంచ్ చేయనుంది. దీని కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా అందుబాటులో ఉండనుంది. టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలో నెక్సాన్ ఈవీ కంటే దిగువన పంచ్ ఈవీని ఉంచనుందని తెలుస్తోంది. టాటా పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ సైజుల్లో వస్తుంది. ఇందులో మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్ మోడల్స్ ఉండనున్నాయి. లాంగ్ రేంజ్ పంచ్ ఈవీ 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఒక్క ఛార్జ్‌కి 325 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. టియాగో ఈవీ, టిగోర్ ఈవీలకు ప్రత్యామ్నాయంగా టాటా పంచ్ ఈవీ ఉండనుందని సమాచారం. లో రేంజ్ వెర్షన్ మిడ్ రేంజ్ కంటే కొంచెం తక్కువ స్థాయిలో అందుబాటులో ఉంటుంది. 125 బీహెచ్‌పీ కంటే ఎక్కువ శక్తిని టాటా పంచ్ కలిగి ఉంటుందని అంచనా.

Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!

Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!

టాప్ హెడ్ లైన్స్

Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Plug-in Hybrid SUV: 1200 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న SUVలు!
1200 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న SUVలు!
Honda Activa e vs Ampere Magnus Grand: హోండా యాక్టివా ఇ vs యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌! భారత్ ఈవీ మార్కెట్‌లో ఏది బెస్ట్?
హోండా యాక్టివా ఇ vs యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌! భారత్ ఈవీ మార్కెట్‌లో ఏది బెస్ట్?
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget