Tork Kratos E Bike: ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.33 వేల వరకు తగ్గింపు - కొనాలనుకుంటే బెస్ట్ ఆప్షన్!
Tork Kratos E Bike Discount: టోర్క్ క్రేటోస్ ఎలక్ట్రిక్ బైక్‌పై ఆఫర్ లభించింది. దీనిపై ఏకంగా రూ.32,500 వరకు తగ్గింపు లభించనుంది.
Discount on Tork Kratos E Bike: పుణేకు చెందిన ఈవీ స్టార్టప్ టోర్క్ మోటార్స్ తన క్రేటోస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్‌పై ఇయర్ ఎండింగ్ ఆఫర్‌ను అందిస్తుంది. ఈ ఆఫర్ కింద కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై రూ. 32,500 వరకు తగ్గింపును అందిస్తోంది.
దీంతో పాటు డీల్‌ను మరింత మెరుగుపరచడానికి కంపెనీ తన కొత్త కస్టమర్‌లకు రూ. 10,500 వరకు సర్వీసులను అందిస్తుంది. ఇందులో ఎక్స్‌టెండెడ్ వారంటీ, డేటా ఛార్జ్, పీరియాడిక్ సర్వీస్ ఛార్జ్, ఛార్జ్‌ప్యాక్ ఉన్నాయి.
ఈ సంవత్సరానికి మాత్రమే ఆఫర్
కొత్త సంవత్సరానికి ముందు ఈ బైక్‌ను కొనుగోలు చేసిన కస్టమర్‌లు మాత్రమే ఈ ఆఫర్‌లను పొందగలరు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర గురించి మాట్లాడితే క్రేటోస్ ఆర్ మార్కెట్లో రూ. 1.67 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది.
పవర్ ప్యాక్, రేంజ్, టాప్ స్పీడ్
టోర్క్ క్రేటోస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్‌లో 4.0 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది అందులో ఉన్న మోటారుకు 12 బీహెచ్‌పీ పవర్, 38 ఎన్ఎం పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లో ఉన్న 'సిటీ' రైడ్ మోడ్‌లో దాని టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్ల వరకు ఉంది. రేంజ్ గురించి చెప్పాలంటే ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఇందులో నాలుగు రైడింగ్ మోడ్‌లు (ఎకో, ఎకో+, సిటీ, స్పోర్ట్స్) ఉన్నాయి.
రాబోయే కాలంలో కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా కావచ్చు. ఇది ఇటీవల పుణేలో కనిపించింది. రాబోయే స్కూటర్ ఓలా ఎస్1, ఏథర్ 450ఎస్‌లతో పోటీ పడుతుందని ఆశించవచ్చు. అయితే కంపెనీ నుంచి కొత్త లాంచ్‌లు వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఆశించవచ్చు.
మరోవైపు ఈవీ స్టార్టప్ ఏథర్ లాంచ్ అయినప్పటి నుంచి రెండు లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించడం ద్వారా భారతదేశంలో గణనీయమైన మైలురాయిని సాధించింది. ఈ సంవత్సరం జనవరిలో కంపెనీ లక్ష యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది. మరో సంవత్సరం లోపే ఇంకో లక్ష మంది వినియోగదారులను ఈవీలతో కనెక్ట్ చేయగలిగింది. ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం భారతదేశంలో 450ఎస్, 450ఎక్స్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా స్పోర్టియర్ ఏథర్ 450 అపెక్స్‌ని 2024 జనవరిలో విడుదల చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఈ స్కూటర్‌ను 2024 మార్చి నుంచి డెలివరీ చేయనున్నారు.
ఏథర్ నుంచి అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్‌ల్లో 450ఎక్స్ ముందంజలో ఉంది. ఈ స్కూటీలో 6.2 కేడబ్ల్యూ మోటార్, 3.7 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ అందుబాటులో ఉన్నాయి. ఈ సెటప్‌తో స్కూటర్ 105 కిలోమీటర్ల (ఎకో మోడ్) రేంజ్‌ను పొందడం విశేషం. ఇది గంటకు గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!