News
News
X

Electric Scooters India: దేశంలో టాప్-4 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే, మీకు ఏది సరైనదో ఎంచుకోండి!

పర్యావరణ హితమైన ప్రయాణానికి ప్రజలు మొగ్గు చూపడంతో ఎలక్ట్రిక్ వాహనల వినియోగం రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని టాప్-4 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

FOLLOW US: 
 
దేశీయ మార్కెట్లో రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. పెట్రో ధరలు పెరగడంతో పాటు పొల్యూషన్ ప్రీ జర్నీ పట్ల ప్రజల్లో అవగాహన రావడంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. గతేడాది దేశంలో  2,25,000 యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలోని టాప్ 4 ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్టో చూడండి.

1. ఓలా ఎలక్ట్రిక్:

కొత్త తరం ఓలా ఇ-స్కూటర్‌ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. S1, S1 ప్రో పేరుతో వినియోగదారులకు లభిస్తోంది. Ola S1 మిడ్ డ్రైవ్ IPM మోటార్‌తో పాటు 2.5 kWh బ్యాటరీతో పని చేస్తుంది. దీని ధర రూ. 79,999 నుండి రూ. 1,40,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. ఈ బైక్ ప్రస్తుతం  ఎయిర్, STD, ప్రో అనే మూడు వెర్షన్లలో అందుబాటులో ఉంది. Ola S1 3 kWh Li-ion బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 141 కిమీ రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. అయితే S1 ప్రో పెద్ద 4 kWh యూనిట్‌ను కలిగి ఉంది. ఇది ఒక్కో ఛార్జీకి 181 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ రెండు 8.5 kW ఎలక్ట్రిక్ మోటార్లతో రన్ అవుతాయి.

2. బెన్లింగ్ ఆరా:

ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌ లో ఎక్కువ ఖర్చు చేయకూడదు అనుకునే వారికి ఈ బైక్ బెస్ట్ అనుకోవచ్చు.  బెన్లింగ్ ఆరా 2.5kW BLDC మోటార్‌ను కలిగి ఉంది.  72V/40Ah లిథియం-అయాన్ బ్యాటరీతో రన్ అవుతుంది. ధర విషయానికి వస్తే రూ. 91,600 (ఎక్స్-షోరూమ్)తో అందుబాటులో ఉంది. ఇది ఎకో మోడ్‌లో సగటున 120 కి.మీ పరిధితో 60 కి.మీ.ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఇది లో, స్పోర్ట్స్, టర్బో స్పీడ్ అనే మూడు మోడ్‌లను కలిగి ఉంది.  

3. TVS iQube:

పవర్ డ్రైవెన్ వెహికల్ కోసం చూసే వ్యక్తులకు ఇది పవర్ ఫుల్ ఎంపికగా చెప్పుకోవచ్చు. TVS iQube హబ్‌ను కలిగి ఉంది. 4.4 kW మౌంటెడ్ మోటార్‌తో పాటు 2.25kWh బ్యాటరీతో వస్తుంది. కంపెనీ ఇ-స్కూటర్‌ను మూడు వేర్వేరు వేరియంట్‌లలో అందిస్తోంది- స్టాండర్డ్, S,  STగా అందుబాటులో ఉంది. వీటి ధర రూ. 99,130 నుంచి రూ. 1.04 లక్షల వరకు ఉంటుంది. ఆయా వేరియంట్ ఆధారంగా

News Reels

  అత్యధికంగా 80 Kmph వేగాన్ని అందుకోగలదు.

4. ఏథర్ X:

ఏథర్ 450X ఫీచర్లతో కూడిన స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది 3.7 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో కలిపి 6 kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది.   ఈ ఎలక్ట్రిక్ స్కూటర్  ఒక్కసారి ఛార్జ్ చేస్తే 146 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ప్రస్తుతం, Ather 450X Gen 3 ధర రూ. 1.39 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) లక్షల్లో లభిస్తుంది.

Read Also: సరికొత్తగా స్కోడా కుషాక్ - యానివర్సరీ ఎడిషన్ లాంచ్, ధర, ఫీచర్లు మీ కోసం!

Published at : 25 Oct 2022 05:58 PM (IST) Tags: India Ola electric TVS iQube Top Electric Scooters Benling Aura Ather X

సంబంధిత కథనాలు

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Geared Electric Motorbike: దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ, స్పెసిఫికేషన్లు, లాంచింగ్ వివరాలు మీకోసం!

Geared Electric Motorbike: దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ, స్పెసిఫికేషన్లు, లాంచింగ్ వివరాలు మీకోసం!

Brakes Fail: కారు బ్రేకులు ఫెయిల్ అయితే, ఎలా సేఫ్‌గా బయటపడాలో తెలుసా?

Brakes Fail: కారు బ్రేకులు ఫెయిల్ అయితే, ఎలా సేఫ్‌గా బయటపడాలో తెలుసా?

మొట్టమొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది - హైరైడర్‌ను లాంచ్ చేసిన టొయోటా!

మొట్టమొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది - హైరైడర్‌ను లాంచ్ చేసిన టొయోటా!

Car Insurance Premium: కారు ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి!

Car Insurance Premium: కారు ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి!

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?