Powerful Bikes Under Rs 3 Lakhs: రూ. మూడు లక్షల్లో పవర్‌ఫుల్ మోస్ట్ వాంటెడ్ బైక్స్ ఇవే - రోడ్డెక్కితే అందరి చూపు వీటివైపే!
ప్రస్తుతం మనదేశంలో రూ. మూడు లక్షల్లోపు బెస్ట్ పవర్‌ఫుల్ బైక్స్ ఇవే.
![Powerful Bikes Under Rs 3 Lakhs: రూ. మూడు లక్షల్లో పవర్‌ఫుల్ మోస్ట్ వాంటెడ్ బైక్స్ ఇవే - రోడ్డెక్కితే అందరి చూపు వీటివైపే! These Are The Best Powerful Bikes Under Rs 3 Lakhs in India Honda CB300R KTM 390 AdventureX Powerful Bikes Under Rs 3 Lakhs: రూ. మూడు లక్షల్లో పవర్‌ఫుల్ మోస్ట్ వాంటెడ్ బైక్స్ ఇవే - రోడ్డెక్కితే అందరి చూపు వీటివైపే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/04/f020519429d9ff6c43af6c7bad08d4a21699116073560456_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Best Bikes Under 3 Lakh: రూ.3 లక్షల్లోపు మంచి పవర్ ఫుల్ బైకులు మనదేశంలో చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన డిమాండ్ కూడా విపరీతంగా పెరుగుతోంది. పవర్ ఫుల్ బైక్స్‌లో కేటీయం 390 డ్యూక్, రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ఇంటర్‌సెప్టర్ భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్నాయి. కానీ వాటి ఎక్స్ షోరూమ్ ధర రూ.3 లక్షల కంటే ఎక్కువ. ఈ రోజు మనం రూ. 3 లక్షల కంటే తక్కువ ధరలో అద్భుతమైన పనితీరు ఉన్న బైక్‌ల గురించి తెలుసుకుందాం.
2024 కేటీయం 250 డ్యూక్
250 డ్యూక్... జెన్ 3 390 డ్యూక్‌కు సంబంధించిన అనేక ఫీచర్లతో అప్‌డేట్ అయింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత శక్తివంతమైన 250 సీసీ బైక్. దీనిలో బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర 2.39 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) ఉంది. 250 డ్యూక్... హోండా సీబీ300ఆర్ మాదిరిగానే 31 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని బరువు 163 కిలోలుగా ఉంది.
హోండా సీబీ300ఆర్
హోండా సీబీ300ఆర్‌ను ఎల్లప్పుడూ తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. కానీ రూ. 2.40 లక్షల అప్‌డేటెడ్ రేటుతో, ఇది ఇప్పుడు దాని ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇస్తుంది. సీబీ అతిపెద్ద ఫీచర్ దాని బరువు. కేవలం 146 కిలోలు మాత్రమే. ఇది కేటీయం 125 డ్యూక్ కంటే తేలికైనది. 31 హెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది.
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310
అపాచీ ఆర్‌టీఆర్ 310 శక్తివంతమైన 312 సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 35.6 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అపాచీ సిరీస్‌లో అతిపెద్దదైన ఈ బైక్ అనేక ఫీచర్లతో ఉంది. దీని ధర రూ.2.43 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంది.
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400
ఇది బజాజ్, ట్రయంఫ్ భాగస్వామ్యంలో వచ్చిన రెండో ఉత్పత్తి. స్క్రాంబ్లర్ 400ఎక్స్ ప్రాథమికంగా స్పీడ్ 400 కంటే పొడవైన వెర్షన్. అంతేకాకుండా లైట్ ఆఫ్ రోడింగ్ సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 2.63 లక్షలుగా ఉంది.
కేటీయం 390 అడ్వెంచర్ ఎక్స్
రూ. 2.80 లక్షల ధర ట్యాగ్‌తో మార్కెట్లోకి వచ్చిన కేటీయం 390 అడ్వెంచర్ ఎక్స్ 373 సీసీ ఇంజన్‌తో వస్తుంది. ఇది 43.5 హెచ్‌పీ పవర్, 37 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రానిక్ రైడర్ సహాయం లేదు. సాధారణ ఎల్సీడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు.
మరోవైపు హోండా మోటార్ కంపెనీ భారతదేశంలో తన మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి హోండా మోటార్స్ కొన్ని వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఈ జపనీస్ వాహన తయారీ సంస్థ భారతీయ మార్కెట్లో అమేజ్ కాంపాక్ట్ సెడాన్, సిటీ సెడాన్, ఎలివేట్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ అనే మూడు మోడళ్లను మాత్రమే సేల్ చేస్తుంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఎలివేట్ ఎస్‌యూవీని ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం సెకండాఫ్‌లో తమ విక్రయాలను 35 శాతం పెంచుకోవాలని హోండా లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)