అన్వేషించండి

Tesla in India: ఇండియాలో టెస్లా కార్లు - గ్రీన్ సిగ్నల్‌కు అంతా రెడీ - ఎప్పుడు ప్రారంభం కావచ్చు?

భారతదేశంలో టెస్లా తన ఆపరేషన్స్ ప్రారంభించడానికి అంతా రెడీ అయింది. 2024 జనవరిలో ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

Tesla Cars in India: ఎలాన్ మస్క్ టెస్లాను భారతదేశానికి తీసుకురావడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2024 జనవరి నాటికి టెస్లాకు అవసరమైన అన్ని అనుమతులను అందించడానికి ప్రభుత్వ విభాగాలు వేగంగా పని చేస్తున్నాయని ఈటీ నివేదించింది. సోమవారం ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో టెస్లా పెట్టుబడి ప్రతిపాదనతో సహా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ తదుపరి దశపై చర్చించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.

కంపెనీ ఏం చెప్పింది?
టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారతదేశంలో కారు, బ్యాటరీ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఇందులో పేర్కొన్నారు. టెస్లా దేశంలో ఎకో ఫ్రెండీ సప్లై చెయిన్‌పై ప్రత్యేక ఆసక్తిని వ్యక్తం చేశారు. టెస్లాతో ఏవైనా విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలని, కంపెనీ ఇండియా తయారీ ప్రణాళికను త్వరగా ప్రకటించాలని, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలను ఆదేశించినట్లు ఒక అధికారి ఈటీకి తెలిపారు.

ఈ సమావేశంలో సాధారణ విధానపరమైన విషయాలపై ప్రధానంగా చర్చ జరిగింది. 2024 జనవరి నాటికి దేశంలో టెస్లా ప్రతిపాదిత పెట్టుబడి తీసుకురావడానికి ఫాస్ట్ ట్రాకింగ్ అప్రూవల్ ఇవ్వడమే ప్రధాన ఎజెండా అంశం అని ఒక ఉన్నత అధికారి ఈటీకి చెప్పారు. జూన్‌లో మోదీ యునైటెడ్ స్టేట్స్‌ పర్యటన సందర్భంగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అప్పటి నుంచి వాణిజ్యం, పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖలు టెస్లా ప్రణాళికల గురించి చర్చలు జరుపుతున్నాయి.

ఇంతకుముందు టెస్లా పూర్తిగా అసెంబుల్డ్ ఎలక్ట్రిక్ కార్లపై 40 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలని కోరింది. 40,000 డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలకు ప్రస్తుతం 60 శాతం, అంతకంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలకు 100 శాతం దిగుమతి సుంకం అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ కార్లు, హైడ్రో కార్బన్ వాహనాలకు భారతదేశ కస్టమ్స్ డ్యూటీ ఒకేలా ఉంటుంది. భారత ప్రభుత్వం స్థానిక తయారీని ప్రోత్సహించడానికి అధిక సుంకాలను విధిస్తుంది. అయితే టెస్లా తన కార్లను లగ్జరీ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలుగా వర్గీకరించాలని వాదిస్తోంది.

క్లీన్ ఎనర్జీతో నడిచే వాహనాలకు తక్కువ పన్నులు ఉండేలా దిగుమతి విధానంలో కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఒక అధికారి తెలుపుతున్న దాని ప్రకారం ఈ ప్రోత్సాహకం టెస్లాకు మాత్రమే కాదు. అన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్న ఏ కంపెనీకైనా ఇదే విధమైన ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది.

దిగుమతి సుంకం కోతలను చర్చలు చేయడంలో ఎదురైన సవాళ్ల కారణంగా టెస్లా గతంలో భారతదేశం కోసం దాని ప్రణాళికలను నిలిపివేసింది. భారత ప్రభుత్వం దిగుమతి సుంకం రాయితీలకు బదులుగా స్థానిక తయారీకి నిబద్ధతకు ప్రాధాన్యం ఇచ్చింది. వాహన తయారీదారులకు ప్రత్యక్ష రాయితీలను అందించే మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునేలా కంపెనీలను ప్రోత్సహించింది.

చవకైన టెస్లా మోడల్ 2పై వర్క్ జరుగుతోందా?
రాయిటర్స్ నివేదిక ప్రకారం టెస్లా బెర్లిన్ సమీపంలోని తన కర్మాగారంలో 25,000 యూరోల (మనదేశ కరెన్సీలో సుమారు రూ. 22.3 లక్షలు) కారును కూడా ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. టెస్లాకి ఇది ఒక ముఖ్యమైన దశ అని చెప్పవచ్చు. ఇది చాలా కాలంగా దాని కార్లను పెద్దఎత్తున ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎలాన్ మస్క్ చవకైన ఎలక్ట్రిక్ కారు కోసం ప్రణాళికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. కంపెనీ ఇప్పుడు ఉత్పత్తి ప్రక్రియలలో విప్లవాత్మక మార్పులు చేయడం ద్వారా దాని ఎలక్ట్రిక్ కార్ల ధరను తగ్గించే టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తోంది. 2030 నాటికి 20 మిలియన్ వాహనాలను డెలివరీ చేయాలనేది టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని చేరుకోవడానికి పెద్ద ఎత్తున మరిన్ని మార్కెట్‌లకు విస్తరించడం చాలా అవసరం.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సెడాన్! బుకింగ్స్‌ ప్రారంభం
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget