By: ABP Desam | Updated at : 21 Jan 2022 02:14 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
టాటా టియాగో, టిగోర్ సీఎన్‌జీ వేరియంట్లు లాంచ్ అయ్యాయి.
టాటా మోటార్స్ టియాగో, టైగోర్‌ల్లో సీఎన్‌జీ వేరియంట్లను లాంచ్ చేసింది. దీంతో టాటా మోటార్స్ కూడా సీఎన్‌జీ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. టియాగో సీఎన్‌జీ ధర రూ.6.1 లక్షల నుంచి రూ.7.65 లక్షల మధ్య ఉండగా.. టిగోర్ సీఎన్‌జీ వేరియంట్ ధర రూ.7.7 లక్షల నుంచి రూ.8.42 లక్షల మధ్య ఉండనుంది. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే.
సీఎన్‌జీ మోడల్స్‌తో పాటు టాటా మోటర్స్ వీటిలో పెట్రోల్ ఓన్లీ వేరియంట్లను కూడా లాంచ్ చేసింది. దీని టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఎక్స్‌జెడ్+ మోడల్‌లో పెట్రోల్ ఓన్లీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. టాటా టియాగో ఎక్స్‌జెడ్+లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, బ్లాక్ బీజ్ ఇంటీరియర్ థీమ్, కొత్త మిడ్‌నైట్ ప్లమ్ కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి.
టాటా టిగోర్ ఎక్స్‌జెడ్+ వేరియంట్లో రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, బ్లాక్ బీజ్ ఇంటీరియర్, డ్యూయల్ టోన్ రూఫ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ సబ్ కాంపాక్ట్ టాటా సెడాన్ గ్రూపులో కొత్త మ్యాగ్నెటిక్ రెడ్ కలర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
టాటా కార్ల ధర పెంపు ప్రభావం టియాగో, టిగోర్‌లపై కూడా పడింది. ప్రస్తుతం మనదేశంలో టాగా టియాగో ధర రూ.5.2 లక్షల నుంచి రూ.7.3 లక్షల మధ్య ఉంది. ఇక టిగోర్ ధర రూ.5.8 లక్షల నుంచి రూ.8.12 లక్షల మధ్య ఉంది.
ఈ రెండు కార్లలోనూ 1.2 లీటర్ త్రీ సిలెండర్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ బీహెచ్‌పీ 85 కాగా.. పీక్ టార్క్ 113 ఎన్ఎంగా ఉంది. ఆటోమేటిక్, మాన్యువల్ గేర్ బాక్స్ వేరియంట్లు ఇందులో ఉన్నాయి.
Also Read: Best Selling Cars: 2021లో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే.. ఏ కారును ఎక్కువ కొన్నారంటే?
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?
Mahindra Scorpio N: కొత్త మహీంద్రా స్కార్పియో లాంచ్ అయ్యేది అప్పుడే - ప్రకటించిన కంపెనీ!
Maruti Suzuki New Facility: కొత్త ప్లాంట్ పెడుతున్న మారుతి సుజుకి - రూ.20 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల ఉద్యోగాలు - ఎక్కడో తెలుసా?
Santro Stopped: ఆ బడ్జెట్ కారును ఆపేసిన హ్యుండాయ్ - ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీ!
Hyundai Santro: చిన్న కార్లు కొనే కస్టమర్లకు ‘హ్యుందాయ్’ బ్యాడ్ న్యూస్, ఆ హ్యాచ్‌బ్యాక్ కారు ఇక కనిపించదా?
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!
Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి