అన్వేషించండి

Tata Tiago Smart Base Variant Features: టాటా టియాగో స్మార్ట్‌ వేరియంట్‌! తక్కువ ధరలో అత్యుత్తమ భద్రత, సీఎన్జీ ఆప్షన్‌! 

Tata Tiago Smart Base Variant Features: టాటా మోటార్స్ టియాగోలో అత్యంత చౌకైన స్మార్ట్ వేరియంట్‌ను పరిచయం చేసింది. పెట్రోల్ సీఎన్జీ ఆప్షన్లతో లభించే ఈ బేస్ మోడల్ ధర, ఫీచర్లు, ఇతర వివరాలు తెలుసుకోండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా టియాగో స్మార్ట్, మధ్యతరగతి వినియోగదారులకు బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్.
  • బేస్ వేరియంట్ అయినప్పటికీ, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పూర్తి భద్రత.
  • పెట్రోల్, సీఎన్‌జీ ఎంపికలు, ట్యాటా ట్విన్-సిలిండర్ టెక్నాలజీ ఉంది.
  • మారుతి స్విఫ్ట్, నియోస్ వంటి పోటీదారుల కంటే తక్కువ ధర.

Tata Tiago Smart Base Variant Features: సాధారణంగా కార్ల కంపెనీలు తమ కొత్త మోడళ్లను లాంచ్ చేసినప్పుడు కేవలం టాప్ ఎండ్ వేరియంట్లలో ఉండే ఆకర్షణీయమైన ఫీచర్లనే హైలైట్ చేస్తుంటాయి. కానీ మెజారిటీ భారతీయులు చూసేది బేస్ వేరియంట్‌ వైపే. అతి తక్కువ ధరలో ఒక కారును ఇంటికి తీసుకెళ్లాలనుకునే సగటు మధ్యతరగతి వినియోగదారుడి కోసం టాటా మోటార్స్ తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌ టియాగోలో స్మార్ట్ వేయింరట్‌ను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దింది. 

హైదరాబాద్‌ ఆన్‌రోడ్ ధర ప్రకారం కేవలం 5.67 లక్షల నుంచే ప్రారంభమయ్యే ఈ వేరియంట్‌, అటు పెట్రోల్, ఇటు సీఎన్జీ ప్రియులకు ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. అసలు ఈ స్మార్ట్ వేరియంట్‌లో ఏముంది? ఏయే ఫీచర్లు మిస్‌ అవుతున్నాయి? భద్రత విషయంలో టాటా తీసుకున్న జాగ్రత్తలు గురించి చూద్దాం. 

overview-tiago-web

స్మార్ట్ వేరియంట్‌లో ఉన్నవేంటీ?

టాటా టియాగో లైనప్‌లో స్మార్ట్ అనేది ఎంట్రీ లెవల్‌ లేదా బేస్ వేరియంట్. సాధారణంగా బేస్ వేరియంట్‌ అంటే కేవలం ఇంజిన్, బాడీ మాత్రమే ఉంటాయని, సౌకర్యాలు ఉండవనే అపోహ ఉంటుంది. కానీ, టియాగో స్మార్ట్ వేరియంట్ ఆ అపోహను తొలగిస్తోంది. ఇది కేవలం మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పెట్రోల్‌ వెర్షన్ ధర 5.67 లక్షలు ఉంటే సీఎన్జీ వెర్షన్ 6.80లక్షలకు లభిస్తోంది. 

Tata Tiago Smart Base Variant Features: టాటా టియాగో స్మార్ట్‌ వేరియంట్‌! తక్కువ ధరలో అత్యుత్తమ భద్రత, సీఎన్జీ ఆప్షన్‌! 

మే నెలాఖరు నుంచి టాటా మోటార్స్ టియాగో అప్‌డేటెడ్‌ వెర్షన్లు మార్కెట్‌లో ఉంచింది. ఇందులో భాగంగానే మే 28న పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లను అధికారికంగా మార్కెట్‌లోకి తెచ్చారు. జూన్ 3 నాటికి ఈ బేస్ వేరియంట్‌ పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వినియోగదారులకు స్పష్టంగా తెలిశాయి. 

టియాగో స్మార్ట్ వేరియంట్‌ను ఎంచుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. దీనికి పోటీగా ఉన్న మారుతి స్విఫ్ట్ లేదా హ్యుందాయ్‌ గ్రాండ్ ఐ10 నియోస్ బేస్ వేరియంట్‌ కంటే ఇది చాలా తక్కువ ధరకే లభిస్తోంది. బేస్ వేరియంట్‌ అయినప్పటికీ ఇందులో సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ లేదు. బేస్ వేరియంట్‌ నుంచే సీఎన్జీ ఆప్షన్ అందించడం సామాన్యుడికి ఇంధన ఖర్చులు తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. 

Tata Tiago Smart Base Variant Features: టాటా టియాగో స్మార్ట్‌ వేరియంట్‌! తక్కువ ధరలో అత్యుత్తమ భద్రత, సీఎన్జీ ఆప్షన్‌! 

డిజైన్‌లో కనిపించిన మార్పులు 

టియాగో స్మార్ట్ వేరియంట్‌ చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ టియాగో సిగ్నేచర్ షేప్‌ను అలాగే ఉంచారు. ఇందులో సాధారణంగా హాలోజన్ హెడ్‌ ల్యాంప్స్‌ ఉంటాయి. ముందు భాగంలో బ్లాక్ టాటా అప్లిక్యూ, బ్లాక్ గ్రిల్ ఇచ్చారు. ఇది కారుకు ఒక క్లాసిక్‌ లుక్ ఇస్తుంది. ఇందులో 14 ఇంచ్ స్టీల్ వీల్స్‌ వస్తాయి. వీల్ క్యాప్స్ ఉండవు. బయటి రియర్ వ్యూ మిర్రర్స్‌, డౌర్‌ హ్యాండిల్స్ బ్లాక్ కలర్‌లో ఉంటాయి. వెనుక భాగంలో ఫుల్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. ఇది బేసి వేరియంట్‌కు ప్రీమియం టచ్ ఇస్తుంది. 

Tata Tiago Smart Base Variant Features: టాటా టియాగో స్మార్ట్‌ వేరియంట్‌! తక్కువ ధరలో అత్యుత్తమ భద్రత, సీఎన్జీ ఆప్షన్‌! 

ఇంటీరియర్ ఫీచర్లు 

కారు లోపల స్మార్ట్ వేరియంట్ చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. బ్లాక్, గ్రే కలర్‌ ఫ్యాబ్రిక్‌ అప్హోల్స్టరీని ఉపయోగించారు. ఈ వేరింట్‌లో ఎలాంటి ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్ ఉండదు. దీనికి బదులు మొబైల్ ఫోన్ హోల్డర్‌ను అమర్చుకోవడానికి ఒక ప్రత్యేక స్లాట్ ఇచ్చారు. ఇది చాలా స్మార్ట్ ఐడియా, ఎందుకంటే ప్రస్తుత కాలంలో చాలా మంది తమ ఫోన్‌నే నావిగేషన్ కోసం వాడుతున్నారు. టాప్‌ మోడల్స్‌లో ఉండే కొత్త డిజిటల్ క్లస్టర్‌నే ఈ బేస్ వేరియంట్‌లోనూ కొనసాగించారు. స్మార్ట్‌ పరికరాల కోసం ఒక 12వీ సాకెట్ ఇచ్చారు. 

Tata Tiago Smart Base Variant Features: టాటా టియాగో స్మార్ట్‌ వేరియంట్‌! తక్కువ ధరలో అత్యుత్తమ భద్రత, సీఎన్జీ ఆప్షన్‌! 

భద్రతలో రాజీ లేదు 

టాటా కార్లు అంటేనే భద్రతకు మారుపేరు. టియాగో స్మార్ట్ వేరియంట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ ఇచ్చారు. బ్రేకింగ్ వ్యవస్థను నియంత్రించడానికి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. చిన్నపిల్లల భద్రత కోసం చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్ చేయడానికి రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉపయోగపడతాయి. కారులో ఉన్న అందరు ప్రయాణికులకు 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఇచ్చారు. 

ఇంజిన్ పనితీరు 

టియాగో స్మార్ట్ రెండు రకాల ఇంధన ఆప్షన్లతో వస్తుంది. 1.2లీటర్ మూడు సిలిండ్‌ ఇంజిన్ 85bhp పవర్, 113nM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్ సీఎన్జీ మోడ్‌లో 76bhp పవర్‌, 96Nm టార్క్‌ను ఇస్తుంది. సీఎన్జీ మోడళ్లలో టాటా పేటెంట్ పొందిన ట్విన్ సిలిండర్ లే అవుట్ ఉంటుంది. దీని వల్ల డిక్కీలో సామాన్లు పెట్టుకోవడానికి తిగిన స్థలం ఉంటుంది. ఇందులో 5 స్పీడ్‌ మాన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంది. 

Tata Tiago Smart Base Variant Features: టాటా టియాగో స్మార్ట్‌ వేరియంట్‌! తక్కువ ధరలో అత్యుత్తమ భద్రత, సీఎన్జీ ఆప్షన్‌! 

ఎవరితో పోటీ పడుతుంది?

భారత్ మార్కెట్‌లో టియాగో స్మార్ట నేరుగా మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్‌ గ్రాండ్ ఐ 10, సిట్రోయెన్ సీ 3X సీఎన్జీతో పోటీ పడుతుంది.  ధర పరంగా చూస్తే స్విఫ్ట్, నియోస్‌ల కంటే టియాగో స్మార్ట చౌకైంది. స్పేస్ విషయంలోనూ ముందంజలో ఉంది. తక్కువ బడ్జెట్‌లో, సిటీ డ్రైవింగ్ కోసం సేఫ్టీ ఫీచర్లు ఉన్న కారు కావాలనుకునే వారికి ముఖ్యంగా మైలేజీ ముఖ్యం అనుకునే వాళ్లకు టియాగో స్మార్ట్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. 

Frequently Asked Questions

టాటా టియాగో స్మార్ట్ వేరియంట్ ధర ఎంత? ఏ ఇంధన ఆప్షన్లలో లభిస్తుంది?

టాటా టియాగో స్మార్ట్ పెట్రోల్ వెర్షన్ ధర ₹5.67 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సీఎన్జీ వెర్షన్ ₹6.80 లక్షలకు లభిస్తుంది. ఇది పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో వస్తుంది.

టియాగో స్మార్ట్ వేరియంట్ భద్రతా ఫీచర్లు ఏమిటి?

టియాగో స్మార్ట్ వేరియంట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు ఉన్నాయి. భద్రతలో ఎటువంటి రాజీ లేదు.

టియాగో స్మార్ట్ వేరియంట్ లోపలి భాగంలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

ఇందులో బ్లాక్, గ్రే ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్టరీ, మొబైల్ ఫోన్ హోల్డర్ స్లాట్, కొత్త డిజిటల్ క్లస్టర్, 12V సాకెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉండదు.

టియాగో స్మార్ట్ బేస్ వేరియంట్ ఎవరికి అనుకూలం?

తక్కువ బడ్జెట్‌లో, సిటీ డ్రైవింగ్ కోసం సేఫ్టీ ఫీచర్లున్న కారు కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ముఖ్యంగా మైలేజీ ముఖ్యం అనుకునే వారికి టియాగో స్మార్ట్ పర్ఫెక్ట్ ఛాయిస్.

టాప్ హెడ్ లైన్స్

కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget