అన్వేషించండి

పెట్రోల్‌ ఖర్చులకు గుడ్‌బై!, Tata Tiago EV ఇప్పుడు కేవలం ₹9 వేల EMIతో మీ సొంతం

Tata Tiago EV Range: టాటా టియాగో EV రెండు వేరియంట్లలో వస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే దీని బేస్ మోడల్‌ 250 కి.మీ.ల రేంజ్ ని అందిస్తుంది, టాప్ వేరియంట్ రేంజ్ 315 కి.మీ.ల వరకు ఉంటుంది.

Tata Tiago EV Price, Down Payment, Car Loan and EMI: ఇప్పుడు ఇంధనం ధరలతో ధనం తగ్గుతోంది గానీ దూరం తగ్గడం లేదు. దీనికి పరిష్కారం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (EVs). ఇటీవల, టాటా టియాగో EV తెలుగు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కాంపాక్ట్‌ సైజ్‌తో స్టైలిష్‌గా, యువతరానికి నచ్చేలా దీనిని డిజైన్‌ చేశారు. ఫ్రంట్‌లో ఇచ్చిన షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌, బ్లూ హైలైట్స్‌తో ఎలక్ట్రిక్‌ లుక్‌ స్పెషల్‌గా కనిపిస్తుంది. కొత్తగా డిజైన్‌ చేసిన అల్లాయ్‌ వీల్స్‌తో కారు ప్రెజెన్స్‌ మోర్‌ స్పోర్టీగా మారింది. సింపుల్‌గా ఉన్నా మోడర్న్‌ డిజైన్‌ కారణంగా సిటీ డ్రైవ్‌కి ఇది పర్ఫెక్ట్‌ EVగా నిలుస్తుంది.

సాధారణంగా, ఎలక్ట్రిక్ కార్ల రన్నింగ్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఆఫీసు లేదా రోజువారీ అప్‌&డౌన్‌కు ఎలక్ట్రిక్‌ కార్లు ఉత్తమంగా ఉంటాయి, టాటా టియాగో EV కూడా దీనికి మినహాయింపు కాదు.

తెలుగు రాష్ట్రాల్లో టాటా టియాగో EV ఆన్‌-రోడ్‌ ధర
హైదరాబాద్‌లో టాటా టియాగో EV బేస్ వేరియంట్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 7.99 లక్షలు. దీనికి RTO ఛార్జీలు దాదాపు రూ. 2,000 & బీమా దాదాపు రూ. 43,000, ఇతర ఖర్చులు కలిపి మొత్తం దాదాపు రూ. 8.44 లక్షలు చెల్లించాలి, ఇదే ఆన్‌-రోడ్‌ ధర (Tata Tiago EV on-road price, Hyderabad Vijayawada) . విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాలు, పట్టణాల్లో కూడా దాదాపు ఇదే ఆన్‌-రోడ్‌ ధర అమల్లో ఉంది.

టియాగో EV EMI ఆప్షన్స్‌
మీరు టాటా టియాగో EV కొనుగోలు కోసం ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. డౌన్ పేమెంట్‌గా రూ. 3 లక్షలు జమ చేస్తే, మిగిలిన మొత్తానికి (రూ. 5.44 లక్షలు) బ్యాంకు నుంచి కార్‌ లోన్‌ తీసుకోవాలి. మీ క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటే, కనీస వడ్డీ రేటుకే బ్యాంక్‌ మీకు లోను మంజూరు చేస్తుంది. ఉదాహరణకు, బ్యాంక్‌ 9% వార్షిక వడ్డీ రేటుతో మీకు రూ. రూ. 5.44 లక్షల కార్‌ లోన్‌ ఇచ్చిందని భావిస్తే, EMI ఆప్షన్స్‌ చూద్దాం.

7 సంవత్సరాలకు లోన్‌ తీసుకుంటే, నెలకు రూ. 8,745 EMI చెల్లించాలి. ఈ ఏడేళ్లలో రూ. 1,91,032 లక్షలు వడ్డీ చెల్లించాలి. 

6 సంవత్సరాల్లో లోన్‌ క్లియర్‌ చేయాలంటే, నెలకు రూ. 9,797 EMI చెల్లించాలి. ఈ ఆరేళ్లలో రూ. 1,61,836 లక్షలు వడ్డీ చెల్లించాలి. 

5 సంవత్సరాల కాల పరిమితి ఎంచుకుంటే, నెలకు రూ. 11,283 EMI చెల్లించాలి. ఈ ఐదేళ్లలో రూ. 1,33,432 లక్షలు వడ్డీ చెల్లించాలి. 

4 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌ పెట్టుకుంటే, నెలకు రూ. 13,526 EMI చెల్లించాలి. ఈ నాలుగేళ్లలో రూ. 1,05,700 లక్షలు వడ్డీ చెల్లించాలి. 

టియాగో EV పవర్‌ & రేంజ్‌
టాటా టియాగో EV ని రెండు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. దీని బేస్ మోడల్‌ను ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 250 కి.మీ.ల దూరం మళ్లీ ఛార్జింగ్‌ అక్కరలేదని కంపెనీ చెబుతోంది. టాప్ వేరియంట్‌లో ఈ పరిధి 315 కి.మీ.ల వరకు ఉంటుంది . టియాగో EV టాప్ వేరియంట్‌లో 24 kWh బ్యాటరీ ఉంటుంది. DC 25kW ఫాస్ట్ ఛార్జర్‌తో ఈ EV ని 58 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేయవచ్చు, సాధారణ 15 Amp హోమ్ ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జ్ కావడానికి 15 నుంచి 18 గంటల సమయం పడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget