TVS Sport GST Offer: TVS Sport మీద కూల్ ఆఫర్ - GST ట్రిమ్మింగ్ తర్వాత దీని ధర ఎంత తగ్గిందో తెలుసా?
TVS Sport Mileage: TVS స్పోర్ట్ బైక్ గురించి కంపెనీ చెప్పిన ప్రకారం, ఈ బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. ఈ బండికి టెలిస్కోపిక్ ఫోర్క్ & ట్విన్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి.

TVS Sport New Price After GST Reduction: టీవీఎస్ స్పోర్ట్, దేశంలో అత్యంత అందుబాటులో ఉన్న కమ్యూటర్ బైకుల్లో ఒకటి. దీనిలో ES & ES+ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. TVS Sport ES, డిజైనింగ్ అప్‌డేట్‌తో అందుబాటులో ఉంది. దీని బాడీ మీద బ్లాక్ ఫినిష్‌తో పాటు ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇవి బైక్‌ను చాలా మోడ్రన్‌గా & యూత్‌ఫుల్‌గా మార్చాయి. ఫ్యూయల్ ట్యాంక్‌పై “110” పవర్ బ్యాడ్జ్ స్పష్టంగా కనిపిస్తుంది, ఇది ఈ బండి 109.7cc ఇంజిన్ సామర్థ్యానికి ప్రతీక. అలాయ్ వీల్స్ మీద డెకాల్ వర్క్ వల్ల బైకుకు స్టైల్ టచ్ వచ్చింది. అలాగే, LED DRL తో కూడిన హెలోజెన్ హెడ్‌లైట్ బైకు ముందు భాగాన్ని ఆకర్షణీయంగా మార్చింది. TVS Sport కొనేవాళ్ల కోసం కొత్తగా Black Neon, Grey Red కలర్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి, ఇవి యూత్ మెచ్చే రంగులు. ఈ కొత్త రంగులు ఈ మోటార్ సైకిల్‌కు స్పోర్టియర్ విజువల్ ప్రెజెన్స్ ఆపాదించాయి.
ఈ నెల మూడో వారం నుంచి, అంటే సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేటు అమల్లోకి వస్తుంది. ఆ రోజు నుంచి టీవీఎస్ స్పోర్ట్ ధర తగ్గుతుంది. జీఎస్టీ సంస్కరణల (GST 2.0) ప్రకారం, 350 cc లేదా అంతకన్నా తక్కువ ఇంజిన్ ఉన్న బైక్‌లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీనికి అనుగుణంగా, జీఎస్టీ తగ్గింపు తర్వాత, టీవీఎస్ స్పోర్ట్ ఎంత మీద జీఎస్‌టీ ఏకంగా 10% తగ్గుతుంది, చాలా డబ్బు ఆదా అవుతుంది.
TVS స్పోర్ట్ బైక్ పై ఎంత ఆదా అవుతుంది?
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో, ప్రస్తుతం, TVS స్పోర్ట్ ప్రారంభ ధర రూ. 69,922 (ఎక్స్-షోరూమ్). ఇది 28 శాతం GST వర్తిస్తున్న రేటు. ఈ GSTని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన తర్వాత, ఈ బండి ఎక్స్-షోరూమ్ ధర 10 శాతం తగ్గుతుంది. దీని తర్వాత, బైక్ ధర దాదాపు రూ. 64,000 ఎక్స్-షోరూమ్ అవుతుంది. కస్టమర్లకు దాదాపు రూ. 6,000 ఆదా అవుతుంది.
TVS స్పోర్ట్ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని బేస్ వేరియంట్ (ES) ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో దాదాపు రూ. 87,000. దీని టాప్ వేరియంట్ (ES+) ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 89,000.
TVS స్పోర్ట్స్ మైలేజ్
టీవీఎస్ స్పోర్ట్ మైలేజ్ విషయానికి వస్తే, ఈ బైక్ లీటరుకు 75-80 కి.మీ. కంటే మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ARAI సర్టిఫై చేసిన ప్రకారం, సిటీలో 70 kmpl & హైవే మీద 80 kmpl మైలేజ్ వస్తుంది. ఈ మోటార్ సైకిల్‌కు టెలిస్కోపిక్ ఫోర్క్ & ట్విన్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. కంటే ఎక్కువ.
ఈ బండి... Hero HF 100, Honda CD 110 Dream & Bajaj CT 110X తో పోటీ పడుతుంది.
EMI మీద తీసుకోవచ్చా?
మీరు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ బండిని EMI ఆప్షన్‌లో కొనవచ్చు. ముందుగా, కనీసం రూ. 10,000 డౌన్ పేమెంట్ చేయాలి & మిగిలిన డబ్బును లోన్‌గా తీసుకోవాలి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ మీకు వెంటనే లోన్ మంజూరు చేస్తుంది.





















