అన్వేషించండి

Tata Sumo Reborn: భారీ డిజైన్, 28 KMPL మైలేజ్‌తో రీలాంచ్‌ కానున్న టాటా సుమో - EMI కేవలం రూ.10 వేలే!

Tata Sumo 2025: రగ్గ్‌డ్‌ లుక్స్‌తో జనాన్ని ఆకర్షించిన టాటా సుమో, కొత్త మాసివ్‌ డిజైన్‌లో మళ్లీ వస్తోంది. ప్రస్తుతానికి, దీనిని టాటా సుమో గోల్డ్ 2025 లేదా టాటా సుమో రీబోర్న్‌ 2025 అని పిలుస్తున్నారు.

Tata Sumo Gold 2025: భారతదేశ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన SUV టాటా సుమోను, టాటా మోటార్స్ మళ్లీ తీసుకువస్తోంది, 2025లోనే ఇది లాంచ్‌ అవుతుంది. దృఢమైన రూపం, శక్తిమంతమైన ఉనికి & నమ్మకమైన పనితీరుకు ప్రసిద్ధి చెందిన టాటా సుమో, భారతీయ కుటుంబాలు, టూర్ ఆపరేటర్లు & గ్రామీణ ప్రయాణికులకు అత్యంత ఇష్టమైన ఫోర్‌వీలర్‌. కొత్త బోల్డ్ డిజైన్, 28 కి.మీ./లీటర్ మెరుగైన ఇంధన సామర్థ్యంతో, మరోసారి హృదయాలను గెలుచుకోవడానికి ఈ కారు సిద్ధమైంది. 

నెలకు ₹10,000 నుంచి ప్రారంభమయ్యే తక్కువ EMI ప్లాన్‌తో టాటా సుమో 2025 వెర్షన్‌ను కొనవచ్చు!.

బోల్డ్ & టఫ్‌ డిజైన్
టాటా సుమో 2025 ఎడిషన్ బయటి రూపాన్ని పూర్తిగా రిఫ్రెష్ చేశారు, ఆధునిక డిజైన్‌ను జోడించారు. అదే సమయంలో, పాత బలమైన బాడీని కంటిన్యూ చేశారు. ఈ SUV ఇప్పుడు భారీ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్‌లు, అగ్రెసివ్‌ బంపర్లు & బోల్డ్ బాడీ లైన్స్‌ను కలిగి ఉంది, ఇవి దీనికి స్పష్టమైన, శక్తివంతమైన రోడ్‌ ప్రెజన్స్‌ను ఇస్తాయి.

దృఢమైన, మరింత మన్నికైన ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన కొత్త సుమో.. సిటీ రోడ్లపైన, కఠినమైన మట్టి రోడ్ల మీద కూడా శక్తిమంతంగా పని చేయగలదు. పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్, మస్క్యులర్‌ వీల్ ఆర్చ్‌లు & దృఢమైన రూఫ్ రైల్స్‌తో ఇది ఎక్కడికైనా వెళ్ళగలిగే యుటిలిటీ వెహికల్‌లా కనిపిస్తుంది & మరింత మెరుగ్గా ఉంటుంది.

విశాలమైన క్యాబిన్‌ & ప్రాక్టికల్ ఫీచర్స్
టాటా సుమో 2025 ఇంటీరియర్‌ను ఇప్పటి సాంకేతికతకు తగ్గట్లు అప్‌గ్రేడ్ చేశారు. ఇది, వేరియంట్‌ను బట్టి 7-9 మంది ప్రయాణీకులకు కూర్చునే సామర్థ్యంతో కూడిన విశాలమైన క్యాబిన్‌తో వస్తుంది. తగినంత లెగ్‌రూమ్, అధిక హెడ్ క్లియరెన్స్ & లాంగ్ రైడ్‌ల కోసం రూపొందించిన సపోర్టివ్ సీట్లు ఇందులో ఉంటాయి. డాష్‌బోర్డ్‌ను టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్‌లు & ఎయిర్ కండిషనింగ్‌తో ఆధునీకరించారు. 

విశ్వసనీయమైన పనితీరు
సుమో 2025లో టాటా బిగించిన కొత్త డీజిల్ ఇంజిన్ అధిక టార్క్‌ను అందిస్తుంది, భారీ లోడ్‌లతో నడవడానికి & నిటారుగా ఎక్కడానికి ఇది అనువైనది. గుంతలు, రాళ్లతో నిండిన రోడ్లలోనూ ఇబ్బంది లేకుండా సస్పెన్షన్‌ను ట్యూన్ చేశారు. ఎక్కువ మంది ప్రయాణీకులను లేదా వస్తువులను మోసుకెళ్లేటప్పుడు రియర్‌-వీల్‌-డ్రైవ్ సెటప్ దీనికి అదనపు స్థిరత్వాన్ని ఇస్తుంది.

ప్రయాణీకుల భద్రత
ప్రయాణీకుల భద్రత కోసం.. ఈ కారులో ABS, డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్‌లు, రియర్‌ పార్కింగ్ సెన్సార్లు & రీన్‌ఫోర్డ్స్‌ బాడీ ఫ్రేమ్ ఉన్నాయి. ఇవి, మీ కుటుంబ సభ్యులకు రక్షణ కవచాల్లా ఉంటాయి.

28 KMPL మైలేజ్ - ఈ క్లాస్‌లో బెస్ట్‌
ఆశ్చర్యకరమైన 28 కి.మీ./లీ మైలేజ్‌ ఇచ్చేలా ఈ కారును తీర్చిదిద్దారు. ఈ సైజ్‌ & సామర్థ్యం కలిగిన SUV ల్లో ఈ మైలేజ్‌ ఇప్పటివరకు దాదాపుగా లేదు. అప్‌గ్రేడ్ చేసిన టర్బో డీజిల్ ఇంజిన్ & స్మార్ట్ ఇంధన నిర్వహణ వ్యవస్థలు ఈ SUV ఇంధన సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ వ్యవస్థలు... పవర్ & టార్క్‌ను అందించడమే కాకుండా రన్నింగ్ ఖర్చులను కూడా తక్కువగా ఉంచుతాయి. ఫలితంగా.. వాణిజ్య ఉపయోగం కోసం, లాంగ్ హైవే ట్రిప్‌లు లేదా హెవీ డ్యూటీ ఫ్యామిలీ ట్రావెల్ కోసం, అధిక డైలీ మైలేజీ ఆశించేవాళ్లకు ఇది ఒక మంచి ఎంపిక.

తక్కువ ధరకే ఓనర్‌షిప్‌ - EMI కేవలం ₹10,000/మంత్‌!
కొత్త టాటా సుమోను కొనగల బలమైన కారణాలలో ఒకటి దాని బడ్జెట్-ఫ్రెండ్లీ ఫైనాన్సింగ్ ఆప్షన్‌. అతి తక్కువ డౌన్ పేమెంట్‌తో, టాటా మోటార్స్ నెలకు కనిష్టంగా ₹10,000 వరకు EMIతో ఈ కారును అందుబాటులోకి తెస్తోంది. ఇది.. మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపార యజమానులు & ఫ్లీట్ ఆపరేటర్లకు కూడా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
Embed widget