అన్వేషించండి

Tata Sierra డార్క్ ఎడిషన్ లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్-షోరూమ్, ఆన్ రోడ్ ధర వివరాలు

టాటా మోటార్స్ Tata Sierra Dark Edition మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో ఆల్-బ్లాక్ లుక్, పర్పుల్ డిటైలింగ్, ప్రీమియం క్యాబిన్ ఇచ్చారు. హైదరాబాద్‌లో ధర వివరాలు తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా సియెర్రా డార్క్ ఎడిషన్ నలుపు థీమ్‌తో విడుదలైంది.
  • ప్రారంభ ధర రూ.13.99 లక్షలు; నలుపు అల్లాయ్ వీల్స్‌తో ఆకట్టుకుంటుంది.
  • లోపలి భాగం పర్పుల్ థీమ్; మునుపటి ఇంజిన్ ఆప్షన్లు కొనసాగాయి.

టాటా మోటార్స్ తన పాపులర్ సియెర్రా SUV కొత్త Dark Editionను లాంచ్ చేసింది. టాటా మోటార్స్ దీనికి Sierra DARK అని పేరు పెట్టింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో అతిపెద్ద మార్పు దీని లుక్. పూర్తి వాహనానికి డార్క్, బ్లాక్ థీమ్ ఇచ్చారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.99 లక్షలుగా నిర్ణయించారు. టాప్ వేరియంట్ ధర రూ. 21.59 లక్షలు ఉంటుంది. హైదరాబాద్‌లో బేస్ మోడల్ ఆన్ రోడ్ ధర రూ.17.10 లక్షల వరకు ఉండగా.. టాప్ వేరియంట్ అన్ రోడ్ ధర రూ. 26.50 లక్షల వరకు ఉంటుంది.  ఈ ఎడిషన్ Pure L నుంచి Accomplished+ వేరియంట్ వరకు మార్కెట్లో అందుబాటులో ఉంది.

బ్లాక్ లుక్‌లో టాటా సియెర్రా

Sierra Dark Editionలో ప్రత్యేకమైన అంశం దీని కొత్త Friesian Black కలర్. దీనంతో పాటు బ్లాక్ ఫినిష్ ఉన్న లోగో, బ్యాడ్జింగ్ ఇచ్చారు. వాహనం 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు కూడా బ్లాక్ ఇచ్చారు. బంపర్, బయటి భాగాలపై కూడా డార్క్ ఫినిష్ కనిపిస్తుంది. దాంతో రెగ్యులర్ టాటా సియెర్రాతో పోలిస్తే దీని లుక్ మరింత డార్క్‌గా ఉంటుంది. అయితే డార్క్ ఎడిషన్‌లో ప్రధాన మార్పులు డిజైన్, కాస్మొటిక్ అప్‌డేట్‌ మాత్రమే. టాటా కంపెనీ దీని ఇంజిన్, గేర్‌బాక్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.

లోపల కూడా బ్లాక్, పర్పుల్ థీమ్ 

టాటా సియెర్రా క్యాబిన్‌ను కూడా బయటి డార్క్ లుక్‌కి సరిపోయేలా డిజైన్ చేశారు. ఇందులో బ్లాక్ ఇంటీరియర్‌తో పాటు Violet Eclipse థీమ్, పర్పుల్ డిటైలింగ్ ఇచ్చారు. ఎసి వెంట్లు, సెంటర్ కన్సోల్, సీట్ స్టిచింగ్ వంటి పార్ట్స్ కోసం పర్పుల్ రంగును ఉపయోగించారు. సీట్లపై బ్లాక్ లెదరెట్ అపోల్స్టరీ వస్తుంది. డార్క్ క్రోమ్ ఫినిష్ ఉన్న కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు. డాష్‌బోర్డ్, ఇంటీరియర్ లేఅవుట్ రెగ్యులర్ సియెర్రా తరహాలోనే ఉంచారు. 

ఫీచర్లు ఏమున్నాయి

Sierra Dark Editionలో ఫీచర్లు వేరియంట్‌ను బట్టి లభిస్తాయి. టాప్ వేరియంట్‌లో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా,  లెవెల్ 2 ADAS వంటి ఫీచర్లు లభిస్తాయి. కొన్ని వేరియంట్లలో 12 స్పీకర్ల JBL ఆడియో సిస్టమ్ ఇచ్చారు. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, డార్క్ ఎడిషన్‌లో సియెర్రా ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కొనసాగించారు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 

 

Frequently Asked Questions

టాటా సియెర్రా డార్క్ ఎడిషన్ యొక్క ప్రధాన ఆకర్షణ ఏమిటి?

టాటా సియెర్రా డార్క్ ఎడిషన్ పూర్తి వాహనానికి డార్క్, బ్లాక్ థీమ్‌తో వస్తుంది. దీని లుక్ మరింత డార్క్ గా ఉంటుంది.

సియెర్రా డార్క్ ఎడిషన్ ప్రారంభ ధర ఎంత?

సియెర్రా డార్క్ ఎడిషన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.99 లక్షలు. టాప్ వేరియంట్ ధర రూ. 21.59 లక్షలు.

సియెర్రా డార్క్ ఎడిషన్ ఇంజిన్‌లో మార్పులు ఉన్నాయా?

లేదు, డార్క్ ఎడిషన్‌లో ఇంజిన్, గేర్‌బాక్స్‌లో ఎలాంటి మార్పులు లేవు. ప్రధాన మార్పులు డిజైన్, కాస్మెటిక్ అప్‌డేట్‌లు మాత్రమే.

సియెర్రా డార్క్ ఎడిషన్ లోపలి భాగం ఎలా ఉంటుంది?

దీని క్యాబిన్ బ్లాక్ ఇంటీరియర్‌తో పాటు వయొలెట్ ఎక్లిప్స్ థీమ్, పర్పుల్ డిటైలింగ్‌ను కలిగి ఉంటుంది. సీట్లపై బ్లాక్ లెదరెట్ అపోల్స్టరీ వస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget