అన్వేషించండి

Tata Punch EV ని రూ.10,000 EMIతో కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, లోన్‌ ఎన్నేళ్లు కట్టాలి?

Tata Punch EV EMI Plan: టాటా పంచ్ EV పూర్తిగా ఛార్జ్ చేస్తే 315 కి.మీ. డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదని టాటా మోటార్స్ చెబుతోంది. ఇది గరిష్టంగా 140 కి.మీ. వేగంతో దూసుకువెళుతుంది.

Tata Punch EV Price, Range And Features In Telugu: భారతదేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్‌కు అనుగుణంగా కార్ల తయారీ కంపెనీలు అనేక కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నాయి. EV విభాగంలో టాటా మోటార్స్ కూడా ముందు వరుసలో ఉంది. మీరు, టాటా బ్రాండ్‌లో ఒక బెస్ట్‌ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటే, టాటా పంచ్‌ EV గురించి తెలుసుకోవాలి. ఈ కారును ఫైనాన్స్‌లో కూడా తీసుకోవచ్చు. కొద్దిపాటి మొత్తాన్ని డౌన్‌ పేమెంట్‌ చేస్తే చాలు, టాటా పంచ్‌ EVకి మీరు ఓనర్‌ కావచ్చు.

టాటా పంచ్ EV, కాంపాక్ట్‌ SUV డిజైన్‌తో స్టైలిష్‌ లుక్‌ అందిస్తుంది. స్మూత్‌ LED DRLs, సిగ్నేచర్‌ గ్రిల్‌ డిజైన్‌ & మస్క్యులర్‌ బాడీ లైన్స్‌ దాని రోడ్‌ ప్రెజెన్స్‌ను పెంచుతాయి. డ్యూయల్‌-టోన్ కలర్‌ ఆప్షన్స్‌ & ఆకర్షణీయమైన అలాయ్ వీల్స్‌ టాటా పంచ్‌ EVని మరింత ప్రీమియం అపీల్‌లో చూపిస్తాయి. ఎత్తైన గ్రౌండ్‌ క్లియరెన్స్‌ & స్పోర్టీ స్టాన్స్‌ వంటివి ఈ కారును సిటీ రోడ్స్‌ & ఆఫ్‌-రోడ్‌ ట్రిప్స్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్‌ చేస్తాయి.

హైదరాబాద్‌/విజయవాడలో టాటా పంచ్ EV ఆన్-రోడ్ ధర ఎంత? 
తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్ EV ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 9.99 లక్షలు. దీనికి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ఇన్సూరెన్స్‌, ఇతర ఖర్చులు కలిపితే, హైదరాబాద్‌/విజయవాడలో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 11.50 లక్షలు అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాలు & డీలర్‌షిప్‌లను బట్టి ఆన్-రోడ్ ధర కొద్దిగా మారవచ్చు. 

టాటా పంచ్‌ EV ఫైనాన్స్‌ ప్లాన్‌
మీరు, టాటా పంచ్‌ EVని రూ. 5 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేస్తే, మిగిలిన రూ. 6.50 లక్షలను బ్యాంకు నుంచి కారు లోన్‌గా తీసుకోవాలి. మీరు ఈ మొత్తాన్ని 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో పొందారని అనుకుందాం. ఇప్పుడు EMI ఆప్షన్స్‌ ఇలా ఉంటాయి:

7 సంవత్సరాల రుణ వ్యవధి పెట్టుకుంటే, మీరు నెలకు రూ. 10,458 EMI చెల్లించాలి. ఏడేళ్లు పూర్తయ్యేసరికి బ్యాంకుకు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 2,28,464 అవుతుంది.

6 సంవత్సరాల రుణ వ్యవధి పెట్టుకుంటే, మీరు నెలకు రూ. 11,717 EMI చెల్లించాలి. ఆరేళ్లు పూర్తయ్యేసరికి బ్యాంకుకు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 1,93,595 అవుతుంది.

5 సంవత్సరాల రుణ వ్యవధి పెట్టుకుంటే, మీరు నెలకు రూ. 13,493  EMI చెల్లించాలి. ఐదేళ్లు పూర్తయ్యేసరికి బ్యాంకుకు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 1,59,576 అవుతుంది.

4 సంవత్సరాల రుణ వ్యవధి పెట్టుకుంటే, మీరు నెలకు రూ. 16,175 EMI చెల్లించాలి. నాలుగేళ్లు పూర్తయ్యేసరికి బ్యాంకుకు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 1,26,413 అవుతుంది.

లోన్‌ టెన్యూర్‌ తగ్గే కొద్దీ మంత్లీ EMI పెరిగినప్పటికీ, బ్యాంక్‌కు కట్టాల్సిన మొత్తం వడ్డీ తగ్గుతుంది. 

కారుపై రుణం పొందడం, వార్షిక వడ్డీ రేటు వంటివి మీ వ్యక్తిగత క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటాయి. 

టాటా పంచ్ EV స్పెసిఫికేషన్లు & ఇంజిన్
టాటా మోటార్స్, పంచ్ ఎలక్ట్రిక్‌ కోసం 25 kWh సామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఇచ్చింది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను AC ఛార్జర్‌తో 3.6 గంటల్లో 10 నుంచి 100 శాతం వరకు & DC ఫాస్ట్ ఛార్జర్‌తో 56 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. 

పూర్తిగా ఛార్జ్ చేస్తే, పంచ్ EV 315 కి.మీ. డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదని టాటా మోటార్స్ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్‌ కారు గరిష్టంగా గంటకు 140 కి.మీ వేగంతో నడుస్తుంది. కంపెనీ డేటా ప్రకారం, పంచ్ EV 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని సాధించడానికి 9.5 సెకన్లు పడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget