Tata Cars July Sales: టాటా మోటార్స్ జులై 2025 సేల్స్ రిపోర్ట్ – నెక్సాన్ టాప్, పంచ్ సేల్స్ తగ్గుదల
Tata Punch, Tata Harrier Sales: కొన్ని మోడళ్లు ఎక్కువగా అమ్ముడుబోయి, మరికొన్నింటి సేల్స్ తగ్గినప్పటికీ... వచ్చే ఫెస్టివ్ సీజన్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని టాటా మోటార్స్ భావిస్తోంది.

Tata Motors July 2025 Sales Report: నిర్మాణ నాణ్యతకు, ప్రయాణీకుల భద్రత టాటా కార్లు పెట్టింది పేరు. అయితే, మారుతి సుజుకీ, హ్యుందాయ్ వంటి కంపెనీ కార్లతో పోలిస్తే టాటా కార్ల మైలేజ్ స్వల్పంగా తగ్గుతుంది. జులై 2025లో, టాటా మోటార్స్ అమ్మకాలు వరుసగా నాలుగో నెలలోనూ తగ్గాయి. ఈ కంపెనీ, మే నెల సేల్స్ ర్యాంకింగ్స్‌లో కీలకమైన మూడో స్థానాన్ని కోల్పోయింది, అప్పటి నుంచి నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. టాటా మోటార్స్ ప్రస్తుతం ఎనిమిది ప్రధాన మోడళ్లను విక్రయిస్తోంది, అందులో ఎక్కువ భాగం ICE (పెట్రోల్/డీజిల్) & ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభిస్తాయి.
ఏ కారుకు ఎక్కువ డిమాండ్ - ఏ కారుకు తక్కువ డిమాండ్?
జులైలో టాటా మోటార్స్ అత్యధికంగా అమ్ముడైన మోడల్ Nexon. ఈ సబ్-4 మీటర్ SUV (ICE & EV వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది) గత నెలలో 12,825 యూనిట్లు విక్రయించింది. ఇది, 2024 జులైలో అమ్మిన 13,902 యూనిట్లతో పోలిస్తే 8% తగ్గుదల.
రెండో స్థానంలో Punch నిలిచింది. ఈ మోడల్ జులైలో 10,785 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది, ఇది గత సంవత్సరం (16,121 యూనిట్లు)తో పోలిస్తే 33% తగ్గుదల.
మూడో స్థానంలో Tiago ఉంది. ఈ ఏడాది జులైలో 5,575 యూనిట్లు అమ్మగా, 2024 జులైలో అమ్మిన 5,665 యూనిట్లతో పోలిస్తే 2% తగ్గింది.
Altroz మాత్రం సేల్స్‌లో వృద్ధిని చూసింది. మేలో వచ్చిన ఫేస్‌లిఫ్ట్ కారణంగా, 2025 జులైలో 3,905 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం 3,444 యూనిట్లతో పోలిస్తే 13% పెరుగుదల.
Harrier (తాజాగా EV వేరియంట్ ప్రారంభం) జులైలో 2,216 యూనిట్లు అమ్మింది. గత సంవత్సరం 1,991 యూనిట్లతో పోలిస్తే 11% పెరుగుదల.
Nexon ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైన SUV కూపే అయిన Curvv, జూన్‌లోని 2,060 యూనిట్ల స్థాయిలోనే కొనసాగింది, జులైలో 2,216 యూనిట్లు సేల్ చేసింది.
Safari మాత్రం భారీ తగ్గుదల చూసింది. ఈ మూడు వరుసల SUV జులైలో కేవలం 1,242 యూనిట్లు మాత్రమే అమ్మగలిగింది, ఇది గత సంవత్సరం ఇదే నెలలోని 2,109 యూనిట్లతో పోలిస్తే 41% తగ్గుదల.
Tigor (ICE & EV వెర్షన్లు) టాటా మోడళ్లలో తక్కువ డిమాండ్ ఉన్నది. జులైలో కేవలం 968 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి, ఇది గత సంవత్సరం 1,495 యూనిట్లతో పోలిస్తే 35% తగ్గుదల.
మొత్తం మీద, టాటా మోటార్స్ జులై 2025లో దేశీయ మార్కెట్లో 39,521 కార్లను విక్రయించింది. 2024 జులైలో అమ్మిన 44,727 యూనిట్లతో పోలిస్తే ఇది 12% తగ్గుదల.
ఈ డేటా ఆధారంగా చూస్తే... టాటా మోటార్స్‌కి నెక్సాన్, పంచ్ వంటి ప్రధాన మోడళ్లలో తగ్గుదల ఉన్నప్పటికీ; అల్ట్రోజ్, హారియర్ వంటి మోడళ్ల సేల్స్‌లో వృద్ధి కనిపించింది. రాబోయే పండుగ సీజన్‌లో కొత్త ఆఫర్లు, కొత్త వెర్షన్లు తీసుకువచ్చి టాటా మోటార్స్ సేల్స్‌ను పెంచే అవకాశం ఉంది.



















