అన్వేషించండి

Tata Punch EV కి రెండు కొత్త రంగులు - గతంలో కంటే సూపర్‌ ఫాస్ట్‌గా ఛార్జింగ్‌!

Tata Punch EV new colors: టాటా మోటార్స్, తన అత్యంత తక్కువ ధర ఎలక్ట్రిక్ కారు టాటా పంచ్ EV ని కొత్త రంగులు & ఫాస్ట్ ఛార్జింగ్‌ ఫీచర్‌తో అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ఈ కారు ఏడు రంగులలో అందుబాటులో ఉంటుంది.

Tata Punch EV Price, Range And Features In Telugu: టాటా బ్రాండ్‌లో బాగా అమ్ముడవుతున్న & బడ్జెట్‌-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన టాటా పంచ్ EV ఇప్పుడు మరింత మారిపోయింది. ఫ్యూచరిస్టిక్‌ డిజైన్ & అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో కస్టమర్లను కట్టిపడేసిన పంచ్ EV, రెండు కొత్త రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు, కంపెనీ, ఈ EVలో ఛార్జింగ్ వేగాన్ని కూడా పెంచింది. దీంతో ఈ కారు మునుపటి కంటే మరింత ప్రాక్టికల్‌ ఆప్షన్‌గా మారింది.

కొత్త కలర్స్‌తో పెరిగిన స్టైల్‌
పంచ్ EV లో ఇప్పుడు ప్యూర్ గ్రే (Pure Grey) & సూపర్‌నోవా కాపర్ ‍‌(Supernova Copper) కలర్స్‌ యాడ్‌ అయ్యాయి. ఈ రెండు కొత్త షేడ్స్ జోడించిన తర్వాత, ఈ కారు ఇప్పుడు మొత్తం ఏడు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు ఎంపవర్డ్ ఆక్సైడ్, సీవీడ్, ఫియర్‌లెస్ రెడ్, డేటోనా గ్రే & ప్రిస్టైన్ వైట్ రంగులు ఉన్నాయి. ఈ రంగులన్నీ బ్లాక్ రూఫ్‌తో డ్యూయల్-టోన్ షేడ్స్‌లో అందుబాటులో ఉండడం ఈ కారు ప్రత్యేకత, ఇది కారు స్టైల్‌ను మరింత ప్రీమియం అప్పీల్‌లోకి మారుస్తుంది.

గతంలో కంటే వేగంగా ఛార్జింగ్
కొత్త అప్‌డేట్‌తో, పంచ్ EV DC ఫాస్ట్ ఛార్జింగ్ వేగం మెరుగుపడింది. గతంలో, 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేయడానికి 56 నిమిషాలు పట్టేది. ఇప్పుడు ఈ పని కేవలం 40 నిమిషాల్లోనే పూర్తవుతుంది. అంతేకాదు, ఇప్పుడు ఈ కారు కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌లో దాదాపు 90 కి.మీ. దూరాన్ని కవర్ చేయగలదు. అంటే, ప్రయాణ సమయంలో ఎక్కడైనా ఆగి కేవలం 10 నిమిషాలు ఛార్జ్‌ చేసుకుంటే చాలు, దాదాపు 90 కిలోమీటర్ల దూరం వెళ్లిపోవచ్చు.

టాటా పంచ్ ఈవీ ఫీచర్లు
టాటా పంచ్ EV స్టైలిష్‌గా ఉండటమే కాదు, పూర్తిగా సాంకేతికతతో నిండి ఉంది. క్యాబిన్‌లో 10.25-అంగుళాల డ్యూయల్ స్క్రీన్ సెటప్ (ఇన్ఫోటైన్మెంట్ & ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్ కోసం) ఉంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకి ఇది సపోర్ట్‌ చేస్తుంది. రియర్‌ AC వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్ & 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను కూడా ఈ కారుతో పాటు వస్తాయి. ప్రయాణీకుల సౌకర్యం కోసం వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ & సింగిల్-పేన్ సన్‌రూఫ్‌ వంటివి ఈ కారులో చూడవచ్చు.

సేఫ్టీ ఫీచర్లు
టాటా పంచ్ EV భద్రత పరంగా కూడా చాలా ముందుంది. ఆరు ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, హిల్ హోల్డ్ కంట్రోల్ & హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ దీనిని ఈ విభాగంలో అత్యంత సురక్షితమైన & అత్యంత విశ్వసనీయమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా మార్చాయి.

టాప్ హెడ్ లైన్స్

ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌, రూ.1.20 లక్షల వరకు తగ్గించిన కియా!
ఈ పండుగ సీజన్‌లో కియా కార్లపై భారీ ఆఫర్లు.. రూ.1.20 లక్షల వరకు తగ్గింపు!
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ vs పాత మోడల్‌.. మైలేజ్, పవర్‌లో వచ్చిన మార్పులేంటి?
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ ఎంత మైలేజ్ ఇస్తుంది? కంపెనీ లెక్కలు చూస్తే షాకే!
మారుతి కార్ల ధరలు పెరగనున్నాయ్.. ఏకంగా రూ.20,000 వరకు!
కొత్త కారు కొనేవాళ్లకు షాక్‌ ఇచ్చిన మారుతి.. ఈ నెలలో ధరలు పెంపు!
Hyundai Creta Electric లాంగ్‌టర్మ్‌ రిపోర్ట్‌.. 11,000 km తిరిగిన ఈ కారులో లోపాలు ఏవైనా కనిపించాయా?
11,000 km తిరిగిన Hyundai Creta Electric.. ఈ జర్నీలో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?

వీడియోలు

Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Fatima Sana Women's Asia Cup 2026 | పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్
Telangana Politics | BRS MLC Arrest | తెల్లవారుజామున BRS ఎమ్మెల్సీల అరెస్ట్.. తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
KTR challenges Congress | ఎమ్మెల్సీల అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్.. “మేమంతా అరెస్ట్‌కు సిద్ధం.. మీరు సిద్ధమా?”
Mohsin Naqvi Women's Asia Cup 2026 | టీమిండియా గెలిస్తే ట్రోఫీ ఇస్తారా? నఖ్వీ రాకతో మళ్లీ వివాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
Historic IND VS JPN Clash: వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
Telangana Assembly Sessions: నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
KTR Challenge: 420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
Anaswara Rajan: కాకా కూతురు అమ్ములు పాప... చిరంజీవి సినిమాలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్... బర్త్‌డే స్పెషల్
కాకా కూతురు అమ్ములు పాప... చిరంజీవి సినిమాలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్... బర్త్‌డే స్పెషల్
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ vs పాత మోడల్‌.. మైలేజ్, పవర్‌లో వచ్చిన మార్పులేంటి?
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ ఎంత మైలేజ్ ఇస్తుంది? కంపెనీ లెక్కలు చూస్తే షాకే!
Dates Benefits : ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోజుకు ఎన్ని తింటే మంచిది
ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోజుకు ఎన్ని తింటే మంచిది
KL Rahul Future Clarity: ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
Embed widget