Tata Nexon Facelift vs Maruti Suzuki Brezza: ప్రస్తుతం మనదేశంలో బెస్ట్ ఎస్‌యూవీ ఏది?
Nexon Facelift vs Brezza: ఈ రెండు కార్లలో మీరు ఏది కొనవచ్చు? బెస్ట్ ఎస్‌యూవీ ఏది?
Tata Nexon Facelift Vs Maruti Suzuki Brezza: ప్రస్తుతం మనదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఒకటైన టాటా నెక్సాన్‌ను (Tata Nexon Facelift) ఇటీవలే కంపెనీ అప్‌డేట్ చేసింది. కొత్త నెక్సాన్ రూ. 8.10 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల అయింది. సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మరో ఎస్‌యూవీ మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Brezza). కానీ విక్రయాల విషయంలో మాత్రం నెక్సాన్‌దే పై చేయి. ఇప్పుడు ఈ రెండు కార్లలో ఏది బెస్టో చూద్దాం.
సైజు విషయంలో ఇలా?
రెండు మోడల్స్ పొడవు పరంగా దాదాపు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. టాటా నెక్సాన్ పొడవు 3995 మిల్లీ మీటర్లు కాగా, వెడల్పు 1804 మిల్లీ మీటర్లు గానూ, ఎత్తు 1620 మిల్లీ మీటర్లు గానూ, వీల్ బేస్ 2498 మిల్లీ మీటర్లు గానూ, గ్రౌండ్ క్లియరెన్స్ 208 మిల్లీ మీటర్లు గానూ ఉంది. ఈ కారు 382 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంది.
ఇక మారుతి బ్రెజా పొడవు 3995 మిల్లీ మీటర్లు గానూ, వెడల్పు 1790 మిల్లీ మీటర్లు గానూ, ఎత్తు 1685 మిల్లీ మీటర్లు గానూ, వీల్‌బేస్ 2500 మిల్లీ మీటర్లు గానూ, గ్రౌండ్ క్లియరెన్స్ 198 మిల్లీ మీటర్లు గానూ ఉంది. బ్రెజా బూట్ స్పేస్ 328 లీటర్లుగా ఉంది.
ఫీచర్స్ ఎందులో బెస్ట్?
టాటా నెక్సాన్, బ్రెజా రెండింటిలోనూ అనేక కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కోసం వైర్‌లెస్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ వేరియంట్స్ కోసం పాడిల్ షిఫ్టర్లు, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి అనేక ఇతర ఫీచర్లు వీటిలో ఉన్నాయి.
2023 టాటా నెక్సాన్ ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, హైట్ అడ్జస్టబుల్ కో-డ్రైవర్ సీట్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్రెజా, మార్క్ హెడ్ అప్ డిస్‌ప్లేతో పోలిస్తే పూర్తిగా డిజిటల్ 10.25 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. అలాగే యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరోవైపు అప్‌డేట్ అయిన నెక్సాన్‌తో పోలిస్తే హెడ్ అప్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్ల నుంచి బ్రెజా ప్రయోజనాలను పొందుతుంది. భద్రత పరంగా కూడా టైర్ ప్రెజర్ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, కార్నరింగ్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లతో బ్రెజా కంటే నెక్సాన్ ఈ విషయంలో ముందంజలో ఉంది.
ఇంజిన్ ఎందులో బెస్ట్?
బ్రెజాతో పోలిస్తే నెక్సాన్ కాస్త చిన్నదైన, శక్తివంతమైన టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇందులో టాటా మోటార్స్ దాని పెట్రోల్ ఇంజన్‌తో నాలుగు గేర్‌బాక్స్ ఆప్షన్స్‌ను అందిస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఏఎంటీ, 7 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ఉన్నాయి.
ఇక బ్రెజా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఇందులో సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంది. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో రానుంది.
దేని ధర ఎంత?
కొత్త టాటా నెక్సాన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.10 లక్షల నుంచి రూ. 13 లక్షల మధ్య ఉంది. ఈ ఎస్‌యూవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.29 లక్షల నుంచి రూ. 14.14 లక్షల మధ్య ఉంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial