అన్వేషించండి

Tata Motors Discounts: టాటా ఈవీ కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు - మే నెలలో ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసా.!

Tata Motors Announces Massive Discounts: టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్‌ఫోలియోపై మే 2026 నెలలో గరిష్టంగా రూ. 3.8 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు ఇంకా ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ ప్రకటించింది.

Tata Motors Announces Massive Discounts on Electric Vehicles : ఇండియ‌న్ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల (EV) శ్రేణిపై ఈ మే నెలలో అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా కస్టమర్లు గరిష్టంగా రూ. 3.8 లక్షల వరకు బెనిఫిట్స్ అందుకోవచ్చు. టాటా కంపెనీకి చెందిన పాపులర్ ఈవీ మోడల్స్ అయిన నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీ, హారియర్ ఈవీ ఇంకా కర్వ్ ఈవీ కార్లపై ఈ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ డిస్కౌంట్ల వివరాలు కార్ల మోడల్ ఇయర్, వేరియంట్లు ఇంకా స్థానిక డీలర్‌షిప్ దగ్గర ఉన్న స్టాక్‌ను బట్టి మారే అవకాశం ఉంది. కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి ఈ సమ్మర్ సీజన్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

నెక్సాన్ ,ఫ్లాగ్‌షిప్ హారియర్ ఈవీపై ఆఫర్లు..

టాటా కంపెనీలో మోస్ట్ పాపులర్ అయిన నెక్సాన్ ఈవీ (Nexon EV) పాత 2024, 2025 మోడళ్లపై రూ. 1.2 లక్షల వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఇందులో రూ. 20,000 గ్రీన్ బోనస్, రూ. 50,000 ఎక్స్ఛేంజ్ లేదా రూ. 55,000 స్క్రాపేజ్ బెనిఫిట్ తో పాటు రూ. 50,000 వరకు లాయల్టీ బోనస్ కలిసి ఉన్నాయి. అదే కొత్త 2026 నెక్సాన్ ఈవీ మోడల్‌పై మాత్రం గరిష్టంగా రూ. 50,000 వరకు మాత్రమే తగ్గింపు లభిస్తుంది. ఇక టాటా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన హారియర్ ఈవీ (Harrier EV) 2025, 2026 మోడళ్లపై రూ. 1.5 లక్షల వరకు భారీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో గ్రీన్ బోనస్ లేనప్పటికీ, రూ. 75,000 స్క్రాపేజ్ బెనిఫిట్ లేదా రూ. 50,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. పాత ఈవీ కస్టమర్లకు రూ. 1 లక్ష లాయల్టీ బోనస్, ఐసీఈ (పెట్రోల్/డీజిల్) నుండి అప్‌గ్రేడ్ అయ్యేవారికి రూ. 50,000 ఇస్తున్నారు. అన్ని వేరియంట్లపై రూ. 50,000 ఇంటర్వెన్షన్ బోనస్ కూడా వర్తిస్తుంది.

Read Also: Shah Rukh Khan Cadillac Escalade: షారుఖ్ ఖాన్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ కారు - ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న అమెరికన్ బీస్ట్!

టియాగో ఈవీ ,పంచ్ ఈవీలపై భారీ తగ్గింపు..

టాటా బ్రాండ్ నుండి వస్తున్న మోస్ట్ అఫర్డబుల్ ఎలక్ట్రిక్ కారు టియాగో ఈవీ (Tiago EV) పై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. పాత 2024, 2025 మోడల్ లోని ఎల్ఆర్ ఎక్స్‌జెడ్ ప్లస్ (LR XZ+ Tech Lux తో కలిపి) వేరియంట్లపై రూ. 2.1 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎల్ఆర్ ఎక్స్‌టీ (LR XT) వేరియంట్లపై రూ. 1.8 లక్షలు, ఎమ్ఆర్ (MR) వేరియంట్లపై రూ. 1.5 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. కొత్త 2026 మోడళ్లపై వేరియంట్‌ను బట్టి రూ. 60,000 నుండి రూ. 1.2 లక్షల వరకు తగ్గింపు ఉంటుంది. అలాగే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంచ్ ఈవీ (Punch EV) పాత లాంగ్ రేంజ్ వెర్షన్లపై రూ. 2.1 లక్షల వరకు బెనిఫిట్స్ అందుకోవచ్చు. మిడ్ రేంజ్ వేరియంట్లపై రూ. 1.9 లక్షలు, స్మార్ట్ ట్రిమ్ పై రూ. 1.6 లక్షల వరకు తగ్గింపు ఉంది. కొత్త 2026 మోడల్ పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ పై రూ. 1.4 లక్షలు, మిడ్ రేంజ్ పై రూ. 1.2 లక్షల వరకు ఆఫర్ ప్రకటించారు.

Read Also: FASTag Recharge Methods: ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ విధానాలు - హైవే ప్రయాణాన్ని మరింత సులభం చేసే టిప్స్ ..

కర్వ్ ఈవీపైనే అత్యధిక డిస్కౌంట్..

ఈ మే నెల డిస్కౌంట్ చార్ట్‌లో అందరికంటే టాప్‌లో నిలిచింది టాటా కర్వ్ ఈవీ (Curvv EV). ఈ సరికొత్త కూపే స్టైల్ ఎస్‌యూవీపై కస్టమర్లు ఏకంగా రూ. 3.8 లక్షల వరకు భారీ బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. పాత 2024, 2025 మోడల్ లోని క్రియేటివ్ 45 (Creative 45) వేరియంట్‌పై రూ. 3.3 లక్షల వరకు తగ్గింపు ఉండగా, మిగిలిన హయ్యర్ వేరియంట్లపై గరిష్టంగా రూ. 3.8 లక్షల భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇక కొత్త 2026 మోడల్ కర్వ్ ఈవీ విషయానికి వస్తే, వేరియంట్‌ను బట్టి కస్టమర్లు రూ. 3.3  లక్షల వరకు డిస్కౌంట్ ప్రయోజనాలను పొందవచ్చు. కారు మైంటెనెన్స్ టిప్స్ ఫాలో అవుతూ మంచి మైలేజ్ లేదా రేంజ్ పొందాలనుకునే వారికి, పర్యావరణహితమైన ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునే వారికి టాటా అందిస్తున్న ఈ ఆఫర్లు ఒక గోల్డెన్ అప్సరిట్యునిటీ అని చెప్పాలి. కారు కొనే ముందు మీ లోకల్ షోరూమ్‌లో స్టాక్ వివరాలు కనుక్కోవడం మంచిది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?
అన్ని కార్లకూ పవర్ పెట్రోల్ అవసరమా? పూర్తి నిజం ఏంటో ఇప్పుడే తెలుసుకోండి!
పవర్ పెట్రోల్ vs నార్మల్ పెట్రోల్ - మీ కారుకు ఏది బెస్ట్? డబ్బు వృథా చేసుకోవద్దు
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Embed widget