అన్వేషించండి

తుపాను వర్షాల్లోనూ తూనీగలా తిరిగిన Tata Curvv EV -– 7,300 km తర్వాత రివ్యూ ఇది

ముంబై వర్షాల్లోనూ Tata Curvv EV 7,300 కి.మీ. డ్రైవ్‌ తర్వాత ఒక ఓనర్‌ ఇచ్చిన అనుభవం ఇది. మాన్సూన్ రోడ్లలోనూ సైలెంట్‌, సేఫ్‌గా నడిచింది ఈ EV.

Tata Curvv EV Long Term Driving Report: సాధారణంగా, ఎలక్ట్రిక్‌ కార్లు వర్షాలలో బలహీనంగా మారతాయని చాలా మంది అనుకుంటారు. కానీ Tata Curvv EV ఆ అభిప్రాయాన్ని పూర్తిగా తప్పని రుజువు చేసింది. ముఖ్యంగా, ముంబైని ముంచేసిన భారీ తుపాను వర్షాల్లో కూడా ఇది ఒక సైలెంట్‌ హీరోలా రాణించింది. 7,300 కి.మీ. దూరం తిరిగిన తర్వాత, ముంబైలో నివశిస్తున్న Tata Curvv EV ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌ ఇచ్చిన రివ్యూ ఇది.

నీళ్లు నిండిన రోడ్లపైనా నమ్మకం కలిగించిన డిజైన్‌
పెట్రోల్‌, డీజిల్‌ కార్ల ఎగ్జాస్ట్‌ లేదా ఎయిర్‌ ఇన్‌టేక్‌లో నీరు చేరితే, ఆ కార్లు ఆగిపోవడం సహజం. కానీ EVలకు ఆ భయం ఉండదు. Curvv EVలో బ్యాటరీ, మోటార్‌ IP67 సర్టిఫైడ్‌. అంటే, ఒక మీటరు లోతు నీటిలో 30 నిమిషాలు పాటు ఉన్నా సేఫ్‌. అందుకే నీరు నిలిచిన వీధుల్లోనూ సైలెంట్‌గా, టెన్షన్‌ లేకుండా వెళ్లగలిగారు.

డైలీ డ్రైవింగ్ అనుభవం
ప్రతిరోజూ డ్రైవ్‌ చేయడానికి ఈ కారు చాలా సౌకర్యంగా ఉంది. ఎలాంటి వైబ్రేషన్‌, ఇంజిన్‌ శబ్దం లేకుండా స్మూత్‌గా నడిచింది. “Sport Mode”లో ఎక్కువ సేపు వాడినా ట్రాఫిక్‌లో సులభంగా కట్‌ అవుతుంది. మొదట, ఆక్సిలరేషన్‌ టచ్‌ కొంచెం స్లోగా అనిపించినా.. డ్రైవింగ్‌ను స్మూత్‌గా చేయడానికి డిజైన్‌ పరంగా తీసుకున్న నిర్ణయం అది.

ఉపయోగకరమైన ఫీచర్లు

చార్జింగ్ ఫ్లాప్‌: కారు మధ్యలో ఉండటంతో ఎక్కడైనా చార్జ్‌ చేయడం సులువు.

బూట్ స్పేస్‌: 500 లీటర్ల బూట్‌ ఉండడం వల్ల సూట్‌కేసులు, లగేజ్‌ కోసం పర్ఫెక్ట్‌.

JBL సౌండ్‌ సిస్టమ్‌: క్లారిటీ, బాస్‌ అద్భుతంగా ఉన్నాయి.

ఫీచర్లు: పనోరమిక్‌ సన్‌రూఫ్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, 360 డిగ్రీల కెమెరా, వైర్‌లెస్‌ Android Auto/CarPlay వంటివన్నీ అందుబాటులో ఉన్నాయి.

మైనస్‌లు లేవా?
Tata Curvv EV, ఒక రోజు 12V auxiliary battery ఫెయిల్‌ కావడం వల్ల కారు పూర్తిగా డెడ్‌ అయింది. టెర్మినల్‌ రీసెట్‌ చేసిన తర్వాత స్టార్ట్‌ అయింది. కానీ, ఈ ఒక్క సంఘటనతో Tata కార్ల నమ్మకాన్ని ప్రశ్నించలేము. అలాగే 18 అంగుళాల టైర్లు రోడ్డుపై గుంతలు ఉన్నప్పుడు జర్క్‌ ఇస్తున్నట్లు అనిపిస్తాయి, 17 అంగుళాల టైర్లు ఉండి ఉంటే మరింత కంఫర్ట్‌గా ఉండేది.

రియర్‌ సీటింగ్ సమస్య
Curvv EVలో వెనుక సీట్‌లో హెడ్‌రూమ్‌ తక్కువ. ఆ సీటు కింద బ్యాటరీ ఉండటంతో, ఫ్లోర్‌ కాస్త పైకి లేచి, కాళ్లు కొంచెం పైకి పేపి కూర్చున్నట్లు అనిపిస్తుంది. ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం అసౌకర్యంగా అనిపిస్తుంది.

హైవేలో పెర్ఫార్మెన్స్‌
హైవే స్పీడ్స్‌లోనూ ఈ కారు చాలా స్థిరంగా ఉంది. టాటా కార్ల ప్లాట్‌ఫామ్‌ మాస్‌ బిల్డ్‌ క్వాలిటీ కారణంగా ఇది సాధ్యమైంది. కానీ స్టీరింగ్‌ వీల్‌ ఫీడ్‌బ్యాక్‌ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అయినప్పటికీ దీని ఖచ్చితత్వం సిటీ రోడ్లకు సరిపోతుంది.

చివరి మాట
7,300 కి.మీ. లాంగ్‌ డ్రైవింగ్‌ అనుభవం తర్వాత చెప్పేదేమిటంటే - Tata Curvv EV ఒక మంచి డైలీ కారు. వర్షాకాలపు రోడ్లపై సైలెంట్‌గా నడవడం, పెద్ద బూట్‌, శక్తిమంతమైన బ్యాటరీ రేంజ్‌ అన్నీ దీనికి ప్లస్‌ పాయింట్లు. కొన్ని చిన్న సమస్యలు ఉన్నా, ఇది రోజువారీ వాడకానికి సేఫ్‌ & కంఫర్ట్‌గా ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget