News
News
వీడియోలు ఆటలు
X

Tata Altroz CNG: టాటా ఆల్ట్రోజ్ CNG బుకింగ్స్ షురూ, అదిరిపోయే మైలేజ్, సూపర్ డూపర్ ఫీచర్లు, వచ్చే నెలలో డెలివరీ!

టాటా ఆల్ట్రోజ్ CNG బుకింగ్స్ షురూ అయ్యాయి. చక్కటి మైలేజ్, అదిరిపోయే ఫీచర్లతో ఈ కారు వచ్చే నెలలో వినియగదారుల ముందుకు రాబోతోంది.

FOLLOW US: 
Share:

టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ Altroz CNG వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ కారు    బుకింగ్స్ ను టాటా సంస్థ ప్రారంభించింది.  దీనిని కొనుగోలు చేయాలి అనుకునే వినియోగదారులు రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెలలో డెలివరీ ఇచ్చే అవకాశం ఉంది. టాటా ఆల్ట్రోజ్ CNG వెర్షన్లు XE, XM+, XZ, XZ+  లాంటి నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌ పో 2023లో టాటా సంస్థ ఆల్ట్రోజ్ CNG హ్యాచ్‌ బ్యాక్‌ ను ప్రదర్శించింది. ఈ కారు ఇదే  కేటగిరీలోని ఇతర మోడళ్లు అయిన మారుతి సుజుకి బాలెనో,  టయోటా గ్లాంజాకు సంబంధించిన CNGకు పోటీగా ఉండబోతోంది.   

వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లు

ఆల్ట్రోజ్ CNG వెర్షన్ టాటా  కార్లలో మూడో మోడల్ గా మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది.  ఇండియన్ కార్‌ మేకర్ ఇంతకు ముందు టిగోర్ సెడాన్,  టియాగో హ్యాచ్‌ బ్యాక్‌లను iCNG టెక్నాలజీతో విడుదల చేసింది. అయితే, Altroz iCNG వెర్షన్ మిగతా రెండింటికి భిన్నంగా ఉంటుంది. కారు లోపల  మరింత స్థలాన్నిఅందించేలా, టాటా మోటార్స్ భారతదేశంలో మొదటిసారిగా కొత్త ట్విన్-సిలిండర్ CNG సాంకేతికతను పరిచయం చేసింది. ఒక్కొక్కటి 30 లీటర్ల రెండు CNG సిలిండర్‌లను కలిగి ఉన్న CNG కిట్, లగేజీ స్థలాన్ని ఎక్కువగా తగ్గించకుండా బూట్ స్పేస్‌లో తక్కువగా ఉంచబడుతుంది. CNG కిట్ ఉన్నప్పటికీ Altroz CNG 300 లీటర్లకు పైగా బూట్ స్పేస్‌ను అందిస్తుందని టాటా మోటార్స్ తెలిపింది.  Tiago, Tigor వంటి సాంప్రదాయ CNG వాహనాలలో, బూట్ స్పేస్ లోపల ఉంచబడిన పెద్ద CNG సిలిండర్ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది.  Altroz CNG  పోటీదారులైన  Baleno, Glanza వంటివి ఈ ఫీచర్‌ను అందించవు.

ఆల్ట్రోజ్ CNG హ్యాచ్‌ బ్యాక్  స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే చూడటానికి పెద్దగా మార్పులు ఏమీ లేవు.  iCNG బ్యాడ్జింగ్, ఫ్యూయల్ మోడ్‌ల మధ్య మారడానికి లోపల కన్సోల్‌లోని CNG స్విచ్ గుర్తించదగిన మార్పుగా చెప్పుకోవచ్చు. టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జిని నాలుగు కలర్ ఆప్షన్‌లలో అందిస్తుంది. ఒపెరా బ్లూ, డౌన్‌టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్ రంగుల్లో లభించనునాయి.  ఆల్ట్రోజ్ iCNG   లీథరెట్ సీట్లు, iRA కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి ఇంజన్‌ ప్రత్యేకత, మైలేజ్

టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది టియాగో,  టిగోర్ సిఎన్‌జి మోడళ్లకు కూడా శక్తినిస్తుంది. మాన్యువల్ గేర్‌ బాక్స్‌తో జతచేయబడిన ఇంజన్, iCNG మోడ్‌లో 73 bhp,  95 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. CNG కిట్ లేకుండా, ఇంజిన్ 84.82 bhp శక్తిని, 13 Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.  ఆల్ట్రోజ్ iCNG   ఇంధన సామర్థ్యం దాదాపు 27 కిమీ/కిలో ఉంటుందని అంచనా.  ఇది టియాగో iCNG ఆఫర్‌ల మాదిరిగానే ఉంటుంది.

Read Also: వేసవిలో వేడిని తట్టుకునే బెస్ట్ కార్లు ఇవే, వెంటిలేటెడ్ సీట్లే కాదు, తక్కువ ధర కూడా!

Published at : 19 Apr 2023 03:54 PM (IST) Tags: Tata Altroz tatamotors Tata Altroz CNG Tata Altroz CNG bookings

సంబంధిత కథనాలు

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!

Luna moped EV: లూనా మోపెడ్ మళ్లీ వచ్చేస్తోంది, దీనికి పెట్రోల్ అక్కర్లేదు - గుడ్‌న్యూస్ చెప్పిన కైనెటిక్ CEO

Luna moped EV: లూనా మోపెడ్ మళ్లీ వచ్చేస్తోంది, దీనికి పెట్రోల్ అక్కర్లేదు - గుడ్‌న్యూస్ చెప్పిన కైనెటిక్ CEO

Royal Enfield Hunter: బైక్ లవర్స్‌కు షాక్ - రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ధరలు పెంపు, ఏ బైక్ ధర ఎంత పెరిగిందంటే?

Royal Enfield Hunter: బైక్ లవర్స్‌కు షాక్ - రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ధరలు పెంపు, ఏ బైక్ ధర ఎంత పెరిగిందంటే?

టాప్ స్టోరీస్

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం