అన్వేషించండి

Tata Aerisలో ఏ వేరియంట్‌ మీ బడ్జెట్‌కు సరిపోతుంది? వేరియంట్ల వారీగా ఫీచర్లు, ధరల వివరాలు

Tata Aerisలో 5 వేరియంట్లు ఉన్నాయి. Smart నుంచి Accomplished వరకు ధరలు, ఫీచర్లు, పెట్రోల్, CNG, MT, AMT ఎంపికల వివరాలు తెలుసుకోండి.

Tata Aeris variants, features and prices: టాటా మోటార్స్‌, కొత్త Aerisతో కాంపాక్ట్ సెడాన్ విభాగంలోకి మరోసారి బలమైన అడుగు వేసింది. ఇప్పటికే ఉన్న Tigor స్థానాన్ని ఈ కొత్త కారు భర్తీ చేసింది & రూ.5.29 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి వచ్చింది. టాటా మోటార్స్‌ మొత్తం ఐదు వేరియంట్లలో Aerisను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది, అవి.. Smart, Pure, Pure+, Creative & Accomplished.

ఈ 5 వేరియంట్లలోనూ పెట్రోల్ & CNG ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. 5 స్పీడ్ MTతో పాటు 5 స్పీడ్ AMTను కూడా ఎంచుకోవచ్చు. మరి ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయి? ఏ బడ్జెట్‌కు ఏది సరిపోతుంది?.

ఇంజిన్ & ధరలు

Aerisలో 1.2 లీటర్, 3 సిలిండర్ Revotron పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 86hp శక్తి & 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG వెర్షన్‌లో ఇదే ఇంజిన్ 75.5hp శక్తి & 96.5Nm టార్క్‌ను అందిస్తుంది.

CNG మోడళ్లలో రెండు సిలిండర్ల వ్యవస్థను ఉపయోగించారు. వీటిని బూట్ ఫ్లోర్ కింద అమర్చారు. దీంతో CNG కారు అయినప్పటికీ సామాను పెట్టుకునే స్థలం కొంత వరకు ఉపయోగకరంగా ఉంటుంది.

బేస్‌ మోడల్‌ అయిన Smart వేరియంట్ ధర రూ.5.29 లక్షల నుంచి రూ.6.29 లక్షల వరకు ఉంటుంది. Pure ధర రూ.6.14 లక్షల నుంచి రూ.7.69 లక్షల వరకు ఉంది. Pure+ ధర రూ.6.74 లక్షల నుంచి రూ.8.29 లక్షల వరకు ఉంటుంది.

Creative ధర రూ.7.49 లక్షల నుంచి రూ.9.04 లక్షల వరకు ఉంటుంది. టాప్ వేరియంట్‌ Accomplished ధర రూ.8.19 లక్షల నుంచి రూ.9.74 లక్షల వరకు ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

Smartలో ఏం ఉన్నాయి?

బేస్ Smart వేరియంట్‌లో హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, హాలోజన్ టెయిల్‌ల్యాంప్స్ ఉన్నాయి. 14 అంగుళాల స్టీల్ వీల్స్ లభిస్తాయి. సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్యాబ్రిక్ సీట్లు, మాన్యువల్ AC ఉన్నాయి.

భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజెస్ ఉన్నాయి. ABS, EBD, CSCతో పాటు ESP & ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉన్నాయి.

Pureలో అదనపు ఫీచర్లు

Pure వేరియంట్‌లో Smartలో ఇచ్చిన ఫీచర్లతో పాటు మరికొన్ని సౌకర్యాలు జత చేశారు. బ్లూటూత్‌తో కూడిన సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 2 స్పీకర్ల ఆడియో సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి.

నాలుగు పవర్ విండోస్, డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు, Type-A & Type-C ఛార్జింగ్ సాకెట్లు లభిస్తాయి. రియర్ డీఫాగర్, సెంట్రల్ లాకింగ్, ఎలక్ట్రికల్‌గా సర్దుకునే ORVMలు కూడా ఉన్నాయి.

Pure+లో మరింత టెక్నాలజీ

Pure+ వేరియంట్‌లో.. Pure వేరియంట్‌లో ఉన్న ఫీచర్లతో పాటు 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. వైర్‌లెస్ Android Auto & Apple CarPlay సపోర్ట్ లభిస్తుంది. 4 స్పీకర్ల ఆడియో సిస్టమ్ కూడా ఉంది.

రివర్స్ పార్కింగ్ కెమెరా, వెనుక AC వెంట్స్, 65W ఫ్రంట్ Type-C ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు వస్తాయి. ముందు & వెనుక సెంటర్ ఆర్మ్‌రెస్టులు, TPMS, హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Suzuki e-Access వర్సెస్‌ Yamaha EC-06.. రేంజ్, స్పీడ్, ధరలో ఏ బండి ఎలా ఉంది?

Creativeలో ప్రీమియం ఫీచర్లు

Creative వేరియంట్ నుంచి Aeris మరింత ప్రీమియంగా మారుతుంది. పైన చెప్పిన 3 వేరియంట్ల ఫీచర్లతో పాటు ఆటో LED హెడ్‌ల్యాంప్స్, LED DRLs, LED ఫాగ్ ల్యాంప్స్ & LED టెయిల్‌ల్యాంప్స్ ఉన్నాయి. ఆటో ఫోల్డింగ్ ORVMలు కూడా లభిస్తాయి.

పెట్రోల్ మోడళ్లలో 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా అందుబాటులో ఉన్నాయి.

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు కూడా ఉన్నాయి. డ్యూయల్ టోన్ రూఫ్ ఈ వేరియంట్‌కు అదనపు ఆకర్షణ.

Accomplishedలో టాప్ ఫీచర్లు

టాప్ వేరియంట్‌ Accomplished లో.. పైన వివరించిన అన్ని ఫీచర్లతో పాటు ముందు సీట్లకు వెంటిలేషన్ సదుపాయం, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, రెండు ట్వీటర్లు, లెదరెట్ సీట్లు & ఆర్మ్‌రెస్టులు ఉన్నాయి.

వెనుక ప్రయాణికుల కోసం 65W Type-C ఛార్జర్ ఇచ్చారు. 360 డిగ్రీ కెమెరా ఫీడ్‌ను ఉపయోగించే డ్యాష్‌క్యామ్ రికార్డర్ కూడా ఉంది. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, క్రోమ్ వెయిస్ట్‌లైన్ డీటెయిలింగ్ & మ్యాగజైన్ పాకెట్స్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

ఏ వేరియంట్ తీసుకోవాలి?

బడ్జెట్‌ను ప్రధానంగా చూస్తే, Pure+ వేరియంట్‌లో అవసరమైన ఫీచర్లు చాలా వరకు లభిస్తాయి. 8 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ కనెక్టివిటీ, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మరింత ప్రీమియం ఫీచర్లు కావాలంటే Creative వేరియంట్‌ను పరిశీలించవచ్చు. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో లభిస్తాయి.

టాప్ Accomplishedలో వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్ & డ్యాష్‌క్యామ్ వంటి అదనపు సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఈ ఫీచర్లు అవసరం లేని వారికి Creativeతోనే మంచి ప్యాకేజీ లభిస్తుంది.

ఇది కూడా చదవండి: పెట్రోల్, CNG వెర్షన్లు, 5 వేరియంట్లలో Tata Aeris లాంచ్‌.. ధరలు, ఆధునిక ఫీచర్లు ఇవే

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
2027 KTM 200 Dukeలో రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సహా కొత్త ఫీచర్లు.. మీరు తెలుసుకోవాల్సిన 7 విషయాలు
KTM 200 Duke మరోసారి అప్‌డేట్.. ఈసారి కొత్తగా వచ్చిన ఫీచర్లు ఏంటి?
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget