అన్వేషించండి

Suzuki Bikes Recall: మూడు బైక్‌లను నిలిపివేసిన సుజుకి - ఎందుకు ఆపేశారు?

Suzuki Bikes: జపనీస్ ఆటోమొబైల్ బ్రాండ్ సుజుకి మూడు 250 సీసీ బైకులను రీకాల్ చేసింది.

Suzuki Gixxer 250 Recall: ప్రస్తుతం సుజుకి ఫ్లాగ్‌షిప్ లైనప్ 250 సీసీ సెగ్మెంట్‌లో మూడు విభిన్న మోటార్‌సైకిళ్లను కలిగి ఉంది. కొత్త స్ట్రీట్ నేక్డ్‌ని జిక్సర్ 250 (Suzuki Gixxer 250) అని పిలుస్తారు. అదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన అడ్వెంచర్ స్టైల్ బైక్ అయిన జిక్సర్ ఎస్ఎఫ్ 250 (Suzuki Gixxer SF 250) అనే కౌంటర్‌పార్ట్ మోడల్‌ కూడా ఉంది. ఇది కాకుండా వీ-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 (Suzuki V Storm SX 250) కూడా అందుబాటులో ఉంది. ఈ మూడు మోటార్‌సైకిళ్లను కంపెనీ రీకాల్ చేసింది.

జపనీస్ బ్రాండ్ ప్రస్తుతం డ్యామేజ్ కంట్రోల్‌లో బిజీగా ఉంది. ఎందుకంటే భారతదేశంలోని దాని 250 సీసీ లైనప్ కొన్ని పవర్‌ట్రెయిన్ సమస్యలతో వ్యవహరించింది. ముఖ్యంగా దాని క్యామ్ ప్రాంతంలో. పై మూడు మోటార్‌సైకిళ్లు ఒకే 249 సీసీ ఇంజన్‌తో వస్తాయి. అందుకే మూడు మోడల్స్‌ను రీకాల్ చేశారు. ఈ వాహనాల్లో కొన్నింటిలో ఎగ్జాస్ట్ క్యామ్ లోబ్ అబ్‌నార్మల్ వేర్ గుర్తించారు. ఈ మోటార్‌సైకిళ్లు ప్రయాణంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆగిపోవచ్చు లేదా అధిక శబ్దం చేయవచ్చు. అందువల్ల కంపెనీ జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250, వీ-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 మోడళ్లను రీకాల్ చేసింది.

దేశవ్యాప్తంగా ఉన్న సుజుకి డీలర్‌షిప్‌లు ప్రస్తుతం ప్రభావితమైన మోటార్‌సైకిళ్లు లేదా వాటి బ్యాచ్‌లను పిన్ పాయింట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. డీలర్‌షిప్‌లు బాధిత మోటార్‌సైకిల్ యజమానులను వారి సమీప సర్వీస్ సెంటర్‌లో సేవను అందించడానికి సంప్రదిస్తాయి. యజమానికి ఎటువంటి ఖర్చు లేకుండా సుజుకి విడిభాగాలను భర్తీ చేస్తుంది.

ఎందుకు ఇలా అయింది?
ఈ సమస్య సంభవించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే సుజుకి ఈ అసాధారణ ఎగ్జాస్ట్ క్యామ్ లోబ్ వేర్ కారణానికి సంబంధించి ఎటువంటి ఖచ్చితమైన రీజనింగ్‌ను అందించలేదు లేదా ఈ రీకాల్ ద్వారా ప్రభావితమైన నమూనా సైజును లేదా ప్రభావిత బ్యాచ్‌ల సంఖ్యను సుజుకి వెల్లడించలేదు. భారతదేశంలోని సుజుకి 250 సీసీ మోటార్‌సైకిళ్లకు ఇటీవల చేసిన అప్‌డేట్లను మినహాయిస్తే... వీ-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 మూడు మోటార్‌సైకిళ్లలో సరికొత్తది.

భారతదేశంలో లాంచ్ అయిన వీ-స్టార్మ్ ఎస్ఎక్స్ సుజుకి అత్యధిక రేటింగ్ పొందిన జిక్సర్ 250 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. మూడు మోటార్‌సైకిళ్లలో ముఖ్యంగా ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ మధ్య చాలా సైకిల్ భాగాలు కామన్‌గా ఉంటాయి. దీని ఇంజన్ సమానమైన శక్తిని, టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇంజిన్ ఎలా ఉంది?
సుజుకి జిక్సర్‌లోని 249 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజన్ 26.5 పీఎస్ , 22.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చారు. ఈ ఇంజిన్ సుజుకి ఆయిల్ కూలింగ్ టెక్నాలజీతో కూడిన సాధారణ ఎస్ఓహెచ్‌సీ సెటప్‌తో వస్తుంది. మూడు మోటార్‌సైకిళ్లు డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో పాటు దాదాపు ఒకే విధమైన సైకిల్ భాగాలను పొందుతాయి. వీ-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 కూడా వెనుక చక్రంలో ఏబీఎస్‌ని స్విచ్ ఆఫ్ చేసే అవకాశం లేదు. 2023 ఫిబ్రవరి అప్‌డేట్‌తో మూడు బైక్‌ల్లో ఉన్న ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్లలో ఒకే విధమైన ఫీచర్లు ఉన్నాయి.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
టాటా కర్వ్ బలాలు, బలహీనతలు - కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
స్టైలిష్‌ కార్‌ టాటా కర్వ్ కొనాలా? వద్దా? - కొనడానికి 4 కారణాలు, దూరంగా ఉండడానికి 3 కారణాలు
కియా సైరోస్ రియల్ వరల్డ్ మైలేజ్ టెస్ట్ - మాన్యువల్‌ది పైచేయా? DCT గెలిచిందా?
కియా సైరోస్ టర్బో MT గేర్‌బాక్స్‌ Vs DCT గేర్‌బాక్స్‌ - ఏ వేరియంట్ ఎక్కువ మైలేజ్ ఇచ్చింది?
526km రేంజ్‌తో కియా సైరోస్ EV ఎంట్రీ - టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV 3XO EVతో పోలిస్తే ప్రత్యేకత ఏంటి?
కియా సైరోస్ EV వర్సెస్‌ టాటా నెక్సాన్ EV వర్సెస్‌ మహీంద్రా XUV 3XO EV - మీకు ఏ ఎలక్ట్రిక్ SUV బెస్ట్?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget