Classic నుంచి Prestige+ వరకు: Skoda Kylaqలో ఏ వేరియంట్ బెస్ట్? ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి?
భారత మార్కెట్లో స్కోడా కైలాక్ ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధరలు, ఇంజిన్, గేర్‌బాక్స్, ఫీచర్లు, ఏ వేరియంట్ తీసుకుంటే మంచిదో పూర్తి వివరాలను 2 నిమిషాల్లో తెలుసుకోండి.

2026 Skoda Kylaq Review: భారతదేశంలో స్కోడా నుంచి వచ్చిన అత్యంత అందుబాటు ధర SUV 'కైలాక్'. ఈ మోడల్‌ను కంపెనీ మొత్తం ఆరు వేరియంట్లలో తీసుకొచ్చింది. అవి Classic, Classic+, Signature, Signature+, Prestige, Prestige+. అన్ని వేరియంట్లలోనూ ఒకే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు కూడా ఉన్నాయి.
ఇంజిన్ & పనితీరు
Skoda Kylaqలోని 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 115hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మాన్యువల్ వేరియంట్‌లో 0 నుంచి 100 km వేగాన్ని సుమారు 10.5 సెకన్లలో అందుకుంటుంది. ఆటోమేటిక్ వేరియంట్ అదే పనిని 11.69 సెకన్లలో పూర్తి చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, కంపెనీ ప్రకారం మాన్యువల్‌కి 19.68 kmpl, ఆటోమేటిక్‌కి 19.05 kmpl. రియల్ వరల్డ్‌లో ఇవి కొంచెం తక్కువగా ఉంటాయి.
కలర్ ఆప్షన్స్
Skoda Kylaq కొనేవాళ్లకు Olive Gold, Lava Blue, Deep Black, Tornado Red, Candy White, Carbon Steel, Brilliant Silver అనే ఏడు రంగులు అందుబాటులో ఉన్నాయి. అయితే బేస్ Classic వేరియంట్‌లో Lava Blue, Deep Black అందుబాటులో లేవు.
వేరియంట్ వారీగా ఫీచర్లు (ఎక్స్-షోరూమ్ ధరలు)
Skoda Kylaq Classic - ₹7.59 లక్షలు
ఈ వేరియంట్‌లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది. LED హెడ్‌ల్యాంప్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC, ట్రాక్షన్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, మాన్యువల్ AC, అన్ని పవర్ విండోలు వంటి మరెన్నో అవసరమైన ఫీచర్లు ఉన్నాయి.
Skoda Kylaq Classic+ - ₹8.25 లక్షల నుంచి ₹9.25 లక్షలు
ఈ వేరియంట్‌లో మాన్యువల్, ఆటోమేటిక్ రెండూ ఉన్నాయి. Classic లో ఉన్న ఫీచర్లతో పాటు సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ IRVM, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి అదనపు ఫీచర్లు వస్తాయి.
Skoda Kylaq Signature - ₹9.43 లక్షల నుంచి ₹10.43 లక్షలు
Classic+ లో ఉన్న ఫీచర్లతో పాటు ఇందులో 16 ఇంచుల అలాయ్ వీల్స్, 7 ఇంచుల టచ్‌స్క్రీన్, Android Auto, Apple CarPlay, రియర్ AC వెంట్స్, రియర్ వైపర్ & డిఫాగర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
Skoda Kylaq Signature+ - ₹10.77 లక్షల నుంచి ₹11.77 లక్షలు
ఈ వేరియంట్ చాలా మందికి బెస్ట్ ఎంపికగా కనిపిస్తోంది. Signature వేరియంట్‌లో ఉన్న ఫీచర్లతో పాటు ఇందులో 10 ఇంచుల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో AC, రియర్ కెమెరా, కీ లెస్ ఎంట్రీ, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
Skoda Kylaq Prestige - ₹11.75 లక్షల నుంచి ₹12.75 లక్షలు
ఇది మరింత లగ్జరీ ఫీల్ ఇస్తుంది. Signature+ లో ఉన్న ఫీచర్లతో పాటు 17 ఇంచుల అలాయ్ వీల్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్ లభిస్తాయి.
Skoda Kylaq Prestige+ - ₹11.99 లక్షల నుంచి ₹12.99 లక్షలు
ఇది టాప్ వేరియంట్. ఇందులో, Prestige+ లో ఉన్న ఫీచర్లతో పాటు పవర్డ్ ఫ్రంట్ సీట్లు అదనంగా వస్తాయి. పూర్తి ఫీచర్లతో ఇదే ఫుల్ లోడెడ్ వేరియంట్.
ఏ వేరియంట్ తీసుకుంటే మంచిది?
డబ్బుకు పూర్తి విలువ కోరేవారికి Signature+ వేరియంట్ బెస్ట్. అవసరమైన అన్ని ఫీచర్లు ఉండటంతో పాటు ధర కూడా కంట్రోల్‌లో ఉంటుంది. మీ బడ్జెట్ ఇంకాస్త తక్కువగా ఉంటే, Signature వేరియంట్ కూడా మంచి ఎంపికే.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















