అన్వేషించండి

కొత్త ఫీచర్లు వచ్చాయి, కానీ ఇవి లేవు: Skoda Kushaq Facelift కనిపించని 8 మోడ్రన్‌ విషయాలు

2026 Skoda Kushaq facelift కొత్త ఫీచర్లతో వచ్చింది. కానీ ADAS, 360 కెమెరా, డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ వంటి 8 కీలక ఫీచర్లు ఇందులో లేవు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Skoda Kushaq Facelift 2026 Price And Features: 2026 స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ భారతీయ మార్కెట్లోకి కొత్త ఫీచర్లతో పరిచయం అయ్యింది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌తో పోలిస్తే డిజైన్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌, కంఫర్ట్‌ పరంగా కొన్ని అప్‌డేట్లు వచ్చాయి. అయినా, ఈ సెగ్మెంట్‌లోని ఇతర SUVలతో పోలిస్తే కుషాక్‌లో ఇంకా కొన్ని కీలక ఫీచర్లు లేవు. వాటిలో కొన్ని లేకపోవడం అర్థం చేసుకోవచ్చు, కానీ మరికొన్ని ఫీచర్లు లేకపోవడం బయ్యర్లను అయోమయంలో పడేస్తుంది.

1. లెవల్‌ 2 ADAS

ఇప్పటికే మిడ్‌ సైజ్‌ SUV సెగ్మెంట్‌లో ADAS సాధారణ ఫీచర్‌గా మారుతోంది. హోండా ఎలివేట్‌, MG ఆస్టర్‌ వంటి కార్లు లెవల్‌ 2 ADAS‌తో వస్తున్నాయి. ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు కుషాక్‌లో లేకపోవడం పెద్ద లోపమే.

2. 360 డిగ్రీ సర్‌రౌండ్‌ వ్యూ కెమెరా

టాప్‌ వేరియంట్‌లో కూడా 360 డిగ్రీ కెమెరా ఇవ్వలేదు. ఇప్పుడు కాంపాక్ట్‌ SUVలలో కూడా ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. ట్రాఫిక్‌లో లేదా పార్కింగ్‌ సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

3. ప్రీమియం బ్రాండెడ్‌ ఆడియో సిస్టమ్‌

రైవల్స్‌లో Bose, JBL వంటి బ్రాండెడ్‌ సౌండ్‌ సిస్టమ్‌లు ఉన్నాయి. కానీ కుషాక్‌లో స్కోడా సొంత 6 స్పీకర్‌ సిస్టమ్‌ మాత్రమే ఉంది. ఆడియో ప్రేమికులకు ఇది నిరాశే.

4. డ్యూయల్‌ జోన్‌ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌

టాప్‌ ట్రిమ్‌లలో కూడా కేవలం సింగిల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ మాత్రమే ఉంది. హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌ ఈ విషయంలో ముందున్నాయి.

5. పవర్డ్‌ టెయిల్‌గేట్‌

టాటా సియేరా, టాటా కర్వ్‌ లాంటి SUVలు పవర్డ్‌ టెయిల్‌గేట్‌ ఇస్తున్నాయి. చేతుల్లో సామాను ఉన్నప్పుడు, కేవలం కాలిని గాల్లో ఊపి టెయిల్‌గేట్‌ తెలవొచ్చు, ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ ఫీచర్‌ ఇచ్చి ఉంటే కుషాక్‌కు ప్లస్‌ అయ్యేది.

6. ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌

స్టాప్‌-అండ్‌-గో ట్రాఫిక్‌లో EPB (ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌) చాలా ఉపయోగపడుతుంది. మారుతి విక్టోరిస్‌, MG ఆస్టర్‌ వంటి రైవల్స్‌ ఈ ఫీచర్‌ ఇస్తున్నాయి.

7. రియర్‌ సన్‌షేడ్స్‌

మన దేశంలోని వేడి వాతావరణంలో వెనుక సీటు ప్రయాణికులకు సన్‌షేడ్స్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కానీ కుషాక్‌లోని ఏ వేరియంట్‌లోనూ ఇవి లేవు.

8. వెంటిలేటెడ్‌ రియర్‌ సీట్లు

ఈ సెగ్మెంట్‌లో ఎవరూ ఇవ్వని ఈ ఫీచర్‌ను స్కోడా తీసుకురావచ్చు. మసాజ్‌ ఫంక్షన్‌ ఇచ్చినా, వెంటిలేషన్‌ లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది.

మొత్తంగా చూస్తే, 2026 Skoda Kushaq Facelift డ్రైవింగ్‌ డైనమిక్స్‌, బిల్డ్‌ క్వాలిటీ పరంగా బలంగా ఉన్నా, ఫీచర్ల విషయంలో రైవల్స్‌తో పోలిస్తే వెనుకబడింది. ఫీచర్లకు ప్రాధాన్యం ఇచ్చే కొనుగోలుదారులు ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
Second-hand Car: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
సెకండ్ హ్యాండ్ కియా సోనెట్ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు సమస్యలను ముందే చెక్ చేయండి!
Vibration-Free Bikes: లాంగ్ రైడ్స్‌కు బెస్ట్ బైక్స్‌.. అతి తక్కువ వైబ్రేషన్లు ఇచ్చే స్మూత్ ఇంజిన్, మంచి కంఫర్ట్ ఇచ్చే 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
హైవేపై గంటల తరబడి ప్రయాణించినా వైబ్రేషన్లు, అలసట తక్కువే.. 300cc విభాగంలో బెస్ట్ 5 బైక్స్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
Embed widget