Skoda Slavia Kushaq Limited Edition: స్కోడా కైలాక్, కుషాక్, స్లావియా కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్ వచ్చేశాయి! 11.25 లక్షల నుంచి ధర ప్రారంభం
Skoda Kylaq Slavia Kushaq Limited Edition:స్కోడా కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్‌ను తీసుకొచ్చింది. ఒక్కో మోడల్ కేవలం 500 యూనిట్లు మాత్రమే అమ్మబోతోంది. ధరలేంటీ స్పెసిఫికేషన్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి.

Skoda Slavia Kushaq Limited Edition: స్కోడా ఇండియా తన పాతికేళ్ల వేడుకను పురష్కరించుకొని కొత్త లిమిటెడ్ ఎడిషన్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మూడు ముఖ్యమైన ఎడిషన్లతో అదరగొట్టేందుకు సిద్ధమైంది. స్కోడా కైలాక్,స్కోడా స్లావియా, స్కోడా కుషాక్‌ను టాప్ ఎండ్ వేరియంట్ ఆధారంగా మరిన్ని అప్‌డేట్స్‌లో మార్కెట్‌లోకి దించింది.
లిమిటెడ్ ఎడిషన్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ మూడు మోడల్స్‌లో ఒక్కో మోడల్‌లో కేవలం 500 యూనిట్లు మాత్రమే అమ్మకానికి పెట్టనుంది.వీటి ధర కూడా 11.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. స్కోడా లిమిటెడ్ ఎడిషన్ ఇంటికి తీసుకురావాలని ఆలోచించే వాళ్లకు మాత్రం ఇది మంచి అవకాశం.
ధరలు ఎలా ఉంటాయి
స్కోడా ధరలు వాటి వేరియెంట్స్‌పై ఆధారపడి ఉన్నాయి. కైలాస్ లిమిడెట్ ఎడిషన్ సిగ్నేచర్ ప్లస్, ప్సెస్టీజ్ అనే రెండు వేరియెంట్స్ తీసుకొచ్చింది. కుషాక్, స్లావియా టాప్ స్పెక్ మోంటే కార్లో వేరియెంట్స్‌ను తీసుకొచ్చింది.
| వేరియెంట్ | స్టాండర్డ్ మోడల్ ధర | స్పెషల్ ఎడిషన్ ధరలు |
| స్కోడా కైలాక్ సిగ్నేచర్‌ప్లస్ ఎంటీ | రూ. 11.25 లక్షలు | రూ. 11.25 లక్షలు |
| ప్రెస్టీజ్ ఎంటీ | రూ. 12.89 లక్షలు | రూ. 12.89 లక్షలు |
| స్కోడా స్కావియా మోంటే కార్లో1 లీటర్ ఎంటీ | రూ. 15.63 లక్షలు | రూ. 15.63 లక్షలు |
| మోంటే కార్లో 1 లీటర్ ఏటీ | రూ. 16.73 లక్షలు | రూ. 16.73 లక్షలు |
| మోంటే కార్లో 1.5 లీటర్ డీసీటీ | రూ. 18.33 లక్షలు | రూ. 18.33 లక్షలు |
| స్కోడా స్లావియా మోంటే కార్లో 1 లీటర్ ఎంటీ | రూ. 16.39 లక్షలు | రూ. 16.39 లక్షలు |
| మోంటే కార్లో 1 లీటర్ ఏటీ | రూ. 17.49 లక్షు | రూ. 17.49 లక్షలు |
| మోంటో కార్లో 1.5 లీటర్ డీసీటీ | రూ. 19.09 లక్షలు | రూ. 19.09 లక్షలు |
మూడు లిమిటెడ్ ఎడిషన్స్‌లో 36 డిగ్రీల కెమెరా ఉంది. బ్రాండ్ పేరు తెలియజేసే పుడిల్ ల్యాంప్స్, డోర్స్‌లో బెన్పోక్ 25 ఇయర్స్ అనే బ్యాడ్జ్ ఉంటుంది.
స్కోడా స్లావియా, స్కోడా కుషాక్‌లను తీసుకుంటే అదనంగా ఓ కిట్ ఇస్తున్నారు. మోంటడే కార్లో వేరియంట్‌లో బంపర్, డోర్లు, టెయిల్‌గేట్‌పై ఎరుపు రంగు ట్రిమ్‌లు ఉంటాయి. చీకటి వేళలో కనిపించేందుకు వీటిని రూపొందించారు. అండర్ బాడీ లైటింగ్ కూడా ఉంటుంది.
ఆన్‌బోర్డు ఫీచర్లు
స్కోడా స్లావియా, కుషాక్, కైలాక్‌లలో టాప్ ఫీచర్లలో వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెటిలేషన్ తో కూడిన పవర్డ్ ఫ్రెంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటో మేటిక్ క్లైమేట్ కంట్రోల్, సింగిల్ ఫేస్ సన్‌రూఫ్ ఉంది. భద్రతాపరంగా కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈబీడీతో కూడిన ఏబీఎస్ , పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది.
ఇంజిన్ ఆప్షన్‌లు
మూడు కార్లు 1-లీటర్ మూడు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తాయి. స్కోడా కుషాక్, స్లావియా అదనంగా 1.5 లీటర్ నాలుగు సీలిండర్ టర్బో- పెట్రోల్ ఇంజిన్‌తో వస్తాయి.
| పారామీటర్ | 1 లీటర్ టర్బో పెట్రోల్ | 1.5 లీటర్ టర్బో పెట్రోల్(స్లావిా, కుషాక్‌లో మాత్రమే ) |
| పవర్ | 115 పీఎస్ | 150 పీఎస్(పీఎస్) |
| టార్క్(ఎన్‌ఎం) | 178(ఎన్‌ఎం) | 250(ఎన్‌ఎం) |
| ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ | 6-స్పీడ్ ఎంటీ/6 స్పీడ్ ఓటీ | 7 -స్పీడ్ డీసీటీ |
ఎవరికి పోటీ ఇస్తుంది
స్కోడా కైలాక్ కారు మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, కియా సోనె్/సైరోస్, హ్యూందయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ ఓ వంటి సబ్-మీటర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వబోతోంది. స్కోడా స్లావియా మాత్రం హోడా సిటీ, హ్యూందాయ్ వెర్నా, VW వర్టస్‌కి పోటీగా మారుతుంది. స్కోడా కుషాక్ కారు హ్యూందాయ్ క్రెటా, కియా సెల్టోస్ VWటైగన్, మారుతిగ్రాండ్ విటారా, హూండా ఎలివేట్, ఎంజీ ఆస్టర్‌లతో పోటీ పడనుంది.






















