అన్వేషించండి

కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌లో 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ఎందుకు? స్కోడా తీసుకున్న కీలక నిర్ణయం వెనుకున్న లాజిక్‌ ఇదే

స్కోడా కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌లో 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ను తొలగించి 8-స్పీడ్‌ AT ఎందుకు తీసుకొచ్చింది? ఖర్చు, మైలేజ్‌, CO2 తగ్గింపులో కొత్త గేర్‌బాక్స్‌ ఇచ్చే ప్రయోజనాలను తెలుసుకోండి.

Skoda Kushaq Facelift: మన కార్ల మార్కెట్‌లో, స్కోడా కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ గురించి హాట్‌ హాట్‌ చర్చ జరుగుతోంది, దీనిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కుషాక్‌ కొత్త వెర్షన్‌లో స్కోడా తీసుకొస్తున్న అత్యంత కీలకమైన మార్పు ఏటంటే - 1.0 లీటర్‌ TSI ఇంజిన్‌కు కొత్త 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ను తొలగించి, ఎందుకు ఈ కొత్త గేర్‌బాక్స్‌ను తీసుకొస్తోంది అనే ప్రశ్న ఇప్పుడు చాలామందిలో ఉంది.

ఈ ప్రశ్నకు స్కోడా ఇచ్చే సమాధానం చాలా స్పష్టంగా ఉంది - ఖర్చు తగ్గింపు. ఇప్పటివరకు కుషాక్‌లో ఉపయోగించిన 6-స్పీడ్‌ Aisin ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ జపాన్‌ నుంచి దిగుమతి చేసుకునేది. దిగుమతి ఖర్చులు, లాజిస్టిక్స్‌, కరెన్సీ మార్పులు వంటివన్నీ కలిసొచ్చి కంపెనీకి ఖర్చు పెరిగేది.

చైనా నుంచి దిగుమతి
ఇప్పుడు కొత్తగా ఇస్తున్న Aisin AQ300 8-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ చైనాలో భారీ స్థాయిలో తయారవుతోంది. తయారీ ఖర్చు పరంగా చైనా ప్రపంచంలోనే బెటర్‌గా ఉంటుంది. స్కోడా తీసుకున్న ప్రధాన నిర్ణయానికి ఇదే బేస్‌. ఈ కొత్త గేర్‌బాక్స్‌ గత యూనిట్‌తో పోలిస్తే 10 నుంచి 15 శాతం వరకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

మెరుగైన ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ
ఖర్చు ఒక్కటే కాదు, ఈ కొత్త 8-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ మరో కీలక లాభాన్ని కూడా ఇస్తుంది, అదే 'మెరుగైన ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ'. అదనంగా రెండు గియర్లు ‍‌(6 బదులు 8) ఉండటంతో, ప్రతి గేర్‌ మధ్య మార్పు మరింత సాఫీగా జరుగుతుంది. దీని వల్ల వేగం పెంచేటప్పుడు, తగ్గించేటప్పుడు ఇంజిన్‌పై లోడ్‌ తగ్గుతుంది. ఫలితంగా ఇంధనం వృథా కాకుండా పూర్తిగా ఉపయోగపడుతుంది.

స్టాండర్డ్‌ డ్రైవింగ్‌ సైకిల్స్‌లో ఈ మార్పు వల్ల మైలేజ్‌ పెరగడమే కాకుండా CO2 ఉద్గారాలు కూడా తగ్గుతాయి. ప్రస్తుతం కఠినమవుతున్న ఉద్గారాల నిబంధనల దృష్ట్యా, ఇది స్కోడా కోసం చాలా కీలకమైన అడుగు.

ఈ కొత్త 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ కేవలం కుషాక్‌కే పరిమితం కాబోదు. రాబోయే రోజుల్లో ఫేస్‌లిఫ్ట్‌కు వచ్చే టైగున్‌, విర్టస్‌, స్లావియా వంటి స్కోడా-వోక్స్‌వ్యాగన్‌ (Skoda -VW) 2.0 కార్లలో కూడా ఇదే గేర్‌బాక్స్‌ చూడొచ్చని సమాచారం.

మరికొన్ని ఆకర్షణీయమైన అప్‌డేట్స్‌
గేర్‌బాక్స్‌ మార్పుతో పాటు, కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌లో మరికొన్ని ఆకర్షణీయమైన అప్‌డేట్స్‌ ఉన్నాయి. కొత్త డిజైన్‌, పానోరమిక్‌ సన్‌రూఫ్‌, 10.25 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, మెరుగైన ఎయిర్‌ కండిషనింగ్‌ సిస్టమ్‌, ఇంకా ఈ సెగ్మెంట్‌లో తొలిసారి రియర్‌ సీట్లకు మసాజ్‌ ఫంక్షన్‌ కూడా అందుబాటులోకి రానుంది.

ఇంజిన్‌ విషయానికి వస్తే, 115hp 1.0 లీటర్‌ TSI, 150hp 1.5 లీటర్‌ TSI యూనిట్లు మార్పుల్లేకుండా కొనసాగుతాయి. ప్రస్తుతం ప్రీ-బుకింగ్స్‌ జరుగుతున్న ఈ కారు ధరలను స్కోడా త్వరలో ప్రకటించనుంది.

మొత్తానికి, కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌లో 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ స్కోడా తీసుకున్న ఒక స్మార్ట్‌ స్ట్రాటజిక్‌ మూవ్‌ అని చెప్పవచ్చు. దీనివల్ల కంపెనీకి ఖర్చు తగ్గింపు, వినియోగదారుడికి మెరుగైన మైలేజ్‌ - ఇద్దరికీ లాభం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget