అన్వేషించండి

KTM 390 Duke కొనాలనుకుంటున్నారా? షోరూంకి వెళ్లే ముందే ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి

KTM 390 Duke కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా? ఇంజిన్‌ పవర్‌, మైలేజ్‌, సీట్‌ హైట్‌, బరువు, తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్‌ ధర వంటి ముఖ్యమైన వివరాలను ఈ స్టోరీలో సులభంగా తెలుసుకోండి.

KTM 390 Duke India: మన మార్కెట్‌లో పెర్ఫామెన్స్‌ స్పోర్ట్స్‌ బైక్‌ల గురించి మాట్లాడుకుంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు KTM 390 Duke. ఈ సెగ్మెంట్‌లో ఎన్నో సంవత్సరాల నుంచి బెంచ్‌మార్క్‌గా నిలిచిన ఈ బైక్‌... పవర్‌, రైడింగ్‌ ఫీల్‌, ఫీచర్లు పరంగా ఇప్పటికీ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. 2023లో లాంచ్‌ అయిన తాజా జనరేషన్‌ మోడల్‌ అయితే మరింత సమగ్రంగా మారింది. కొత్త డిజైన్‌, అప్‌డేటెడ్‌ ఇంజిన్‌, ఆధునిక టెక్నాలజీతో డబ్బుకు పూర్తి విలువ ఇచ్చే ప్యాకేజీగా నిలిచింది. ఈ బైక్‌ కొనాలనుకునే వారికి సాధారణంగా వచ్చే ఐదు ముఖ్య ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం.

KTM 390 Duke ఇంజిన్‌ పవర్‌ ఎంత?

KTM 390 Duke లో 399cc సింగిల్‌ సిలిండర్‌, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఇచ్చారు. ఈ ఇంజిన్‌ 8,500 rpm వద్ద 46 hp పవర్‌, 6,500 rpm వద్ద 39 Nm టార్క్‌ ఇస్తుంది. పెర్ఫామెన్స్‌ టెస్టుల్లో ఈ బైక్‌ కేవలం 5.21 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంది. ప్రస్తుతం భారత్‌లో తయారయ్యే బైక్‌లలో ఇది వేగంగా యాక్సిలరేట్‌ అయ్యే బైక్‌లలో ఒకటిగా నిలుస్తోంది.

KTM 390 Duke బరువు ఎంత?

ఈ బైక్‌ కర్బ్‌ వెయిట్‌ (ఫ్యూయల్‌, ఇతర ఆయిల్స్‌ పూర్తిగా నింపిన తర్వాత) 168.3 కిలోలు మాత్రమే. తక్కువ బరువుతో పాటు శక్తిమంతమైన ఇంజిన్‌ ఉండటంతో, దీని పవర్‌ టు వెయిట్‌ రేషియో టన్నుకు సుమారు 273 hpగా ఉంటుంది. ఇదే ఈ బైక్‌ రైడింగ్‌లో అంత అగ్రెసివ్‌ ఫీల్‌ ఇవ్వడానికి ప్రధాన కారణం.

KTM 390 Duke మైలేజ్‌ ఎంత ఇస్తుంది?

పెర్ఫామెన్స్‌ బైక్‌ అయినా కూడా మైలేజ్‌ విషయంలో 390 Duke మంచి ఫలితాలు చూపించింది. సిటీ రైడింగ్‌లో సగటుగా 29.4 kmpl, హైవే మీద 31.4 kmpl వరకు మైలేజ్‌ వచ్చింది. అయితే స్పోర్టీగా నడిపితే ఈ సంఖ్యలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది.

KTM 390 Duke సీట్‌ హైట్‌ ఎంత?

ఈ బైక్‌ సీట్‌ హైట్‌ 800 mm. సెగ్మెంట్‌ పరంగా ఇది చాలా మందికి సౌకర్యంగా ఉంటుంది. గత మోడల్‌తో పోలిస్తే సీట్‌ హైట్‌ను కొంచెం తగ్గించారు. పొడవుగా ఉండే రైడర్లకు కూడా కాళ్లకు ఇబ్బంది అనిపించదు. కావాలంటే KTM యాక్సెసరీ క్యాటలాగ్‌లో లభించే ఆప్షనల్‌ సీట్‌తో దీనిని 820 mm వరకు పెంచుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో KTM 390 Duke ధర ఎంత?

KTM 390 Duke ధర తెలుగు రాష్ట్రాల్లో రూ.2.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)గా ఉంది. ఈ బైక్‌ గన్‌మెటల్‌ గ్రే, ఎలక్ట్రానిక్‌ ఆరెంజ్‌, అట్లాంటిక్‌ బ్లూ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. గ్లోబల్‌ మార్కెట్‌లో కొత్త కలర్‌ ఆప్షన్లు, అప్‌డేటెడ్‌ ఫ్రంట్‌ బ్రేక్‌ క్యాలిపర్‌తో మోడల్‌ వచ్చింది, అది ఇంకా భారత్‌లో అందుబాటులోకి రాలేదు.

విజయవాడలో ఆన్‌ రోడ్‌ ధర

ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹ 2,99,493

RTO ఛార్జీలు: ₹ 37,439

ఇన్సూరెన్స్‌ (కాంప్రెహెన్సివ్‌): ₹ 26,253

ఆన్‌ రోడ్‌ ధర: ₹ 3,63,185

హైదరాబాద్‌లో ఆన్‌ రోడ్‌ ధర

ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹ 2,99,231

ఇన్సూరెన్స్‌ (జీరో డిప్రెసియేషన్‌): ₹ 24,387

RTO & ఇతర ఛార్జీలు: ₹ 57,393

ఎక్స్‌టెండెడ్‌ వారంటీ: ₹ 2,599

AMC: ₹ 2,199

స్టాండర్డ్‌ యాక్సెసరీస్‌: ₹ 1,450

ఆన్‌ రోడ్‌ ధర: ₹ 3,87,259

మొత్తంగా చూస్తే, KTM 390 Duke పవర్‌, స్టైల్‌, ఫీచర్లు, రైడింగ్‌ ఆనందం అన్నింటినీ కలిపిన ప్యాకేజీ. స్పోర్ట్స్‌ బైక్‌ అనుభూతిని కోరుకునే యువ రైడర్లకు ఇది ఇప్పటికీ ఒక బెస్ట్‌ చాయిస్‌గా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

5 New Cars In October: కారు కొనాలనుకుంటున్నారా ? దసరా, దీపావళి కంటే మార్కెట్లోకి 5 కొత్త కార్లు
కారు కొనాలనుకుంటున్నారా ? దసరా, దీపావళి కంటే మార్కెట్లోకి 5 కొత్త కార్లు
పవర్‌ఫుల్ పల్సర్ బైక్ Pulsar NS 400Z లాంచ్.. ఫీచర్లు చూశారా- డ్యూక్ బైక్‌కు గట్టి పోటీ !
పవర్‌ఫుల్ పల్సర్ బైక్ Pulsar NS 400Z లాంచ్.. ఫీచర్లు చూశారా- డ్యూక్ బైక్‌కు గట్టి పోటీ !
రూ.లక్షల్లో కొత్త కారు, రూ.వేలల్లో మెయింటెనెన్స్‌ ఖర్చు! క్యాబ్‌లో తిరగడమే బెటర్‌ ఐడియానా?
సిటీలో డైలీ డ్రైవింగ్‌ కోసం కారు కొనడం మంచిదా? రోజూ క్యాబ్‌ బుక్‌ చేసుకోవడమే బెటరా?
Royal Enfield Himalayan 440: లాంచ్‌ అయిన నెలకే భారీ డిమాండ్‌.. 6 నెలల వెయిటింగ్‌ పిరియడ్‌, బుకింగ్స్‌ నిలిపివేత
ఈ బైక్‌ కొంటే ఇంటికి తీసుకెళ్లడానికి ఆరు నెలలు ఆగాలట! రష్‌ తట్టుకోలేక బుకింగ్స్‌ కూడా బంద్‌

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medals: ఒకేరోజు 4 స్వర్ణాలు.. ఆసియా గేమ్స్ 2026లో అదరగొట్టిన భారత బాక్సర్లు, రెజర్లు
ఒకేరోజు 4 స్వర్ణాలు.. ఆసియా గేమ్స్ 2026లో అదరగొట్టిన భారత బాక్సర్లు, రెజర్లు
Govt Doctors Dismissed: ఏపీ ప్రభుత్వం కన్నెర్ర.. 70 మంది డాక్టర్లపై వేటు వేసిన మంత్రి సత్యకుమార్ !
ఏపీ ప్రభుత్వం కన్నెర్ర.. 70 మంది డాక్టర్లపై వేటు వేసిన మంత్రి సత్యకుమార్ !
Auto Fares Hike: తెలంగాణలో ఆటో ఛార్జీలు పెంపు.. రవాణా శాఖ కీలక ఉత్తర్వులు
తెలంగాణలో ఆటో ఛార్జీలు పెంపు.. రవాణా శాఖ కీలక ఉత్తర్వులు
CM Vijay Vetri Payanam: కండక్టర్‌లా సీఎం విజయ్.. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభం!
కండక్టర్‌లా సీఎం విజయ్.. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభం!
Dilsukhnagar Santoshimatha Temple: దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో అలజడి.. విగ్రహం ధ్వంసానికి యత్నించిన నిందితుడి అరెస్ట్
దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో అలజడి.. విగ్రహం ధ్వంసానికి యత్నించిన నిందితుడి అరెస్ట్
ED Notices To YS Avinash Reddy: వివేకా హత్య కేసు.. విచారణకు రావాలని ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఈడీ నోటీసులు
వివేకా హత్య కేసు.. విచారణకు రావాలని ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఈడీ నోటీసులు
PM Modi Video Call Pilot Smith: స్మిత్ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియో కాల్‌.. ఎవరి ప్రాణాలు పోవొద్దనే ప్రార్థించానన్న స్మిత్!
స్మిత్ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియో కాల్‌.. ఎవరి ప్రాణాలు పోవొద్దనే ప్రార్థించానన్న స్మిత్!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Embed widget