Simple Dot One: రూ.లక్షలో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన ఇండియన్ కంపెనీ - సింగిల్ ఛార్జితో ఎన్ని కిలోమీటర్లు?
Simple Dot One Scooter: సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మనదేశంలో లాంచ్ అయింది.
Simple Dot One Launched: ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ కంపెనీలు తమ ఫేమస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో చవకైన వెర్షన్‌లను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టాయి. ఇందులో ఏథర్ 450ఎస్, ఓలా ఎస్1 ఎయిర్, ఎస్1ఎక్స్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు సింపుల్ ఎనర్జీ కూడా దేశంలో సింపుల్ డాట్ వన్ (Simple Dot One) ఈ-స్కూటర్‌ను రూ. లక్ష (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) ధరకు విడుదల చేసింది. ఇది బెంగుళూరు నగరంలో ముందుగా బుక్ చేసుకున్న సింపుల్ వన్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా నిర్ణయించిన లాంచ్ ప్రైస్.
బుకింగ్, కలర్ ఆప్షన్లు
స్కూటర్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులు కొత్త సింపుల్ డాట్ వన్ ఈ-స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ సింపుల్ వన్ చవకైన వేరియంట్. సింపుల్ డాట్ వన్ ఈ-స్కూటర్ బ్రాజెన్ బ్లాక్, నమ్మ రెడ్, గ్రేస్ వైట్, అజూర్ బ్లాక్ వంటి నాలుగు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఇది బ్రేజెన్ ఎక్స్, లైట్ ఎక్స్ వంటి రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది.
సింపుల్ డాట్ వన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Simple Dot One Specifications, Simple Dot One Features)
సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 151 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఇందులో 8.5 కిలోవాట్ (11.4 బీహెచ్‌పీ పవర్ జనరేట్ చేసే) ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది గరిష్టంగా 72 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కంపెనీ క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటలకు 105 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. కేవలం 2.77 సెకన్లలోనే 0 నుండి 40 కిలోమీటర్ల వరకు వేగాన్ని ఈ బైక్ అందుకోగలదు.
సింపుల్ డాట్ వన్‌లో నాలుగు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. అవే ఎకో, రైడ్, డాష్, సోనిక్ . ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సీబీఎస్ (కాంబీ బ్రేకింగ్ సిస్టం)తో రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. ఇది 90/90 సెక్షన్ ట్యూబ్‌లెస్ టైర్‌లతో కూడిన 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ షాడ్‌తో రానుంది. సింపుల్ డాట్ వన్ ఈ-స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 164.5 మిల్లీమీటర్లుగా ఉంది. అండర్ సీట్ స్టోరేజ్ కెపాసిటీ 35 లీటర్లు కాగా... దీని బరువు 126 కిలోలుగా ఉంది.
కంపెనీ ఎంట్రీ-లెవల్ స్కూటర్‌లో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్ అందించారు. ఇది ఏథర్ 450ఎస్, ఓలా ఎస్1 ఎయిర్‌తో సహా దాని పోటీదారులలో చాలా ఎలక్ట్రిక్ బైకుల్లో కనిపించదు. ఈ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మొబైల్ కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!