-Royal Enfield Himalayan 452: మార్కెట్లోకి రానున్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ 452 - ధర ఎంత ఉండవచ్చు?
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452 బైక్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.
Upcoming Royal Enfield Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452 మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. దీని ధరను 2023 నవంబర్ 7వ తేదీన ప్రకటించనున్నారు. రాబోయే ఈ మోటార్‌సైకిల్ డిజైన్, ఫీచర్ల గురించి కస్టమర్లకు తెలపడం కోసం కంపెనీ టీజర్ ఇమేజెస్‌ను విడుదల చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఈ ఫొటోను షేర్ చేశారు. టీజర్ వీడియోలో హిమాలయన్ 452 సవాలుగా ఉమ్లింగ్ లా పాస్‌లో తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఒకసారి లాంచ్ అయ్యాక ఇది కేటీయం 390 అడ్వెంచర్, హీరో ఎక్స్‌పల్స్ 400లకు పోటీని ఇవ్వనుంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ. 2.85 లక్షలుగా ఉండనుందని వార్తలు వస్తున్నాయి.
ఇంజిన్ ఇలా?
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452 మోడల్‌లో 451.65 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించనున్నారని తెలుస్తోంది. ఇది 8,000 ఆర్పీఎం వద్ద 40 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుందని, 40 నుంచి 45 ఎన్ఎం టార్క్‌ను పొందగలదని లీక్ అయిన హోమోలోగేషన్ డాక్యుమెంట్ వెల్లడించింది.
ఫోర్ వాల్వ్, డీఓహెచ్‌సీ కాన్ఫిగరేషన్ ఉన్న ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు అందుబాటులో ఉంటాయి. ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్ ఉంటుంది. సస్పెన్షన్‌గా ఇది యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ రియర్ యూనిట్‌ను కూడా పొందుతుంది.
రాబోయే హిమాలయన్ 452 బరువు దాదాపు 210 కిలోలుగా ఉంది. ఇది హిమాలయన్ 411 కంటే దాదాపు రెట్టింపు అని చెప్పవచ్చు. దీని పొడవు 2245 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 852 మిల్లీమీటర్లు గానూ, ఎత్తు 1316 మిల్లీమీటర్లు గానూ ఉంది. దీని వీల్‌బేస్ 1510 మిల్లీమీటర్లుగా ఉంది. హిమాలయన్ 411తో పోలిస్తే, ఈ కొత్త అడ్వెంచర్ టూరర్ 55 మిల్లీమీటర్లు పొడవు, 12 మిల్లీమీటర్లు వెడల్పు కొంచెం ఎక్కువగా ఉంటుంది. సాధారణ కలర్ ఆప్షన్లు మాత్రమే కాకుండా హిమాలయన్ 452 కొత్త కామెట్ వైట్ పెయింట్ స్కీమ్‌లో అందించబడుతుంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయి?
దీని ఫీచర్ల గురించి చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రైడ్ బై వైర్ టెక్నాలజీ, రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ప్రత్యేక ముక్కు లాంటి ఫెండర్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, విండ్‌స్క్రీన్, స్ప్లిట్ సీట్ డిజైన్, వైర్-స్పోక్స్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయని ఫొటోను చూసి అనుకోవచ్చు. ఇది 21 అంగుళాల ఫ్రంట్ వీల్, 17 అంగుళాల వెనుక చక్రం కలిగి ఉంటుంది.
The all-new Himalayan is a creature of its environment. A profound, mystical space that is always changing, and changing fast.
— Royal Enfield (@royalenfield) October 8, 2023
The only constant in the Himalayas is change.#RoyalEnfieldHimalayan #AllRoadsNoRoads #RoyalEnfield #RidePure #PureMotorcycling pic.twitter.com/VTYnnJj7oo
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial