అన్వేషించండి

Royal Enfield Himalayan 440: లాంచ్‌ అయిన నెలకే భారీ డిమాండ్‌.. 6 నెలల వెయిటింగ్‌ పిరియడ్‌, బుకింగ్స్‌ నిలిపివేత

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త మోటార్‌ సైకిల్‌కు అతి భారీ డిమాండ్‌ కారణంగా బుకింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ బైక్‌ వెయిటింగ్‌ పీరియడ్‌ దాదాపు 6 నెలలకు చేరింది.

Royal Enfield Himalayan 440 Price And Features Telugu: ఇండియాలో ఇటీవల లాంచ్‌ అయిన ఓ కొత్త అడ్వెంచర్‌ బైక్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో వెయిటింగ్‌ పిరియడ్‌ ఏకంగా ఆరు నెలలకు చేరింది. కస్టమర్ల నుంచి వస్తున్న బుకింగ్స్‌ను తట్టుకోలేక, ఆ కంపెనీ కొత్త బుకింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ బైక్‌ మరేదో కాదు.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440.

భారత్‌లో, సెప్టెంబర్‌ 4, 2026న హిమాలయన్‌ 440ను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ లాంచ్‌ అయింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.29 లక్షలు. లాంచ్‌ అయిన వెంటనే ఈ అడ్వెంచర్‌ బైక్‌కు భారీ స్పందన వచ్చింది, కొనడానికి జనం ఎగబడ్డారు. డెలివరీలు ప్రారంభమైన తర్వాత బుకింగ్స్‌ ఇంకా వేగంగా పెరిగాయి. ప్రస్తుతం ఈ బైక్‌కు వెయిటింగ్‌ పీరియడ్‌ దాదాపు ఆరు నెలలకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో, మరింత మంది కస్టమర్లను వెయిటింగ్‌ లిస్ట్‌లో చేర్చకుండా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుకింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఉత్పత్తి పెంచే అవకాశం

బుకింగ్స్‌ను ఆపిన సమయంలో, కంపెనీ ఈ బండి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఉత్పత్తి పెరిగి పెండింగ్‌ బుకింగ్స్‌ తగ్గిన తర్వాత మళ్లీ బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కస్టమర్లు ఎంతకాలం వేచి చూడాలో స్పష్టత లేకుండా కొత్త బుకింగ్స్‌ తీసుకోవడం కంపెనీకి ఇష్టం లేదని సమాచారం.

అంటే హిమాలయన్‌ 440 కొనాలని చూస్తున్నవాళ్లు ప్రస్తుతం బుకింగ్‌ కోసం కూడా మరికొంత సమయం వేచి చూడాల్సిందే. అయితే బుకింగ్స్‌ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయనే విషయాన్ని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇంకా వెల్లడించలేదు.

ధర పెరగదట!

హిమాలయన్‌ 440కు ఉన్న ప్రధాన ఆకర్షణల్లో దాని ధర కూడా ఒకటి. భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఫుల్‌ సైజ్‌ అడ్వెంచర్‌ బైక్‌లలో తక్కువ ధర ఉన్న మోడళ్లలో ఇది ఒకటి. అంతేకాదు.. హిమాలయన్‌ 450తో పోలిస్తే దీని ధర గణనీయంగా తక్కువ.

ఇది కూడా చదవండి: కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!

బుకింగ్స్‌ మళ్లీ ప్రారంభించినప్పుడు హిమాలయన్‌ 440 ధర పెంచే ఆలోచన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు లేదని తెలుస్తోంది. అంటే ప్రస్తుతానికి రూ.2.29 లక్షల ప్రారంభ ధరనే కొనసాగించే అవకాశం ఉంది. అయితే బుకింగ్స్‌ పునఃప్రారంభ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

443cc ఇంజిన్‌

హిమాలయన్‌ 440లో కొత్త 443cc సింగిల్‌ సిలిండర్‌ లాంగ్‌ స్ట్రోక్‌ ఇంజిన్‌ ఉంది. ఈ ఇంజిన్‌ 6,250rpm వద్ద 25.4bhp పవర్‌ను, 4,000rpm వద్ద 34Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు. పాత హిమాలయన్‌ 411లో ఉన్న 5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో పోలిస్తే ఇందులో అదనంగా ఒక గేర్‌ ఉంది.

డిజైన్‌ పరంగా హిమాలయన్‌ 411కు ఉన్న అడ్వెంచర్‌ బైక్‌ రూపాన్ని కొత్త మోడల్‌ కొనసాగిస్తుంది. రైడింగ్‌ పొజిషన్‌ కూడా నిటారుగా ఉంటుంది. ముందు భాగంలో 21 అంగుళాల వీల్‌, వెనుక 17 అంగుళాల వీల్‌ ఉన్నాయి.

సస్పెన్షన్‌ విషయానికి వస్తే.. ముందు భాగంలో 200mm, వెనుక భాగంలో 180mm ట్రావెల్‌ ఉంది. గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 220mmగా ఉంది. బ్రేకింగ్‌ కోసం ముందు 300mm డిస్క్‌, వెనుక 240mm డిస్క్‌ అందించారు.

డ్యూయల్‌ ఛానల్‌ ABS‌ స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఆఫ్‌రోడ్‌ రైడింగ్‌ సమయంలో ఉపయోగించుకునేందుకు ABS‌ స్విచబుల్‌ మోడ్‌ కూడా ఉంది.

ఇది కూడా చదవండి: ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!

మూడు రంగుల్లో..

హిమాలయన్‌ 440ను సెలా బ్లాక్‌, మస్టాంగ్‌ బ్రౌన్‌ & నెలాంగ్‌ వైట్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ దశలో డెలివరీ అయ్యే బైక్‌లపై ప్రత్యేకమైన 10 ఏళ్ల హిమాలయన్‌ యాన్యువల్‌ బ్యాడ్జ్‌ కూడా ఉంటుంది. హిమాలయన్‌ అడ్వెంచర్‌ బైక్‌ తొలిసారి మార్కెట్‌లోకి వచ్చి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దీనిని అందిస్తున్నారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra EV: సేఫ్టీలో సత్తా చాటిన టాటా సియెర్రా ఈవీ: పెద్దలు, పిల్లల రక్షణ పరీక్షల్లో బెస్ట్ స్కోర్లు సొంతం
సేఫ్టీలో సత్తా చాటిన టాటా సియెర్రా ఈవీ: పెద్దలు, పిల్లల రక్షణ పరీక్షల్లో బెస్ట్ స్కోర్లు సొంతం
3-Cylinder Vs 4-Cylinder: 3-సిలిండర్‌ లేదా 4-సిలిండర్‌.. మీ ఫ్యామిలీ కారుకు ఏ ఇంజిన్ సరిపోతుందో తెలుసుకోండి
3 సిలిండర్ ఇంజిన్‌ vs 4 సిలిండర్ ఇంజిన్.. ఏ కారు బెస్ట్? మైలేజ్, పెర్ఫార్మెన్స్‌, వైబ్రేషన్స్‌ పూర్తి వివరాలు
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
ప్రయాణానికి 'సేఫెస్ట్‌ కారు' అని నిరూపించుకున్న Mahindra XEV 9S.. భారత్ NCAP పరీక్షల్లో '5 స్టార్ సేఫ్టీ రేటింగ్'
మహీంద్రా XEV 9S కారు చాలా సేఫ్‌ గురూ! క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
Embed widget