Best Selling Royal Enfield Bike: బెస్ట్ సెల్లింగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇదే - ప్రతి నెలా వేలల్లో సేల్స్!
Royal Enfield Classic 350 Sale: 2024 సెప్టెంబర్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు అన్నిట్లో క్లాసిక్ అత్యధికంగా అమ్ముడుపోయింది. దీని ఎక్స్ షోరూం ధర రూ.1.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది.
Best Selling Bike of Royal Enfield in September: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు భారతదేశంలోని యూజర్లలో మంచి క్రేజ్‌ను కలిగి ఉన్నాయి. కేవలం బుల్లెట్ మాత్రమే కాకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన ఎన్నో మంచి బైక్‌లు ఉన్నాయి. 2024 సెప్టెంబర్ సేల్స్ రిపోర్ట్ ప్రకారం క్లాసిక్ 350 కంపెనీ అత్యధికంగా అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా నిలిచింది.
2024 సెప్టెంబర్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350... 33,065 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఆగస్టులో ఈ బైక్‌కు సంబంధించి 28,450 యూనిట్లు అమ్ముడయ్యాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి ప్రజల్లో చాలా మంచి క్రేజ్ ఉందని గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ మోటార్‌సైకిల్ ఫీచర్లు, ధర ఏమిటో తెలుసుకుందాం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర, ఫీచర్లు...
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో 350 సీసీ, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్ట్, ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 6,100 ఆర్పీఎం వద్ద 20.2 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 4,000 ఆర్పీఎం వద్ద 27 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఇంధన సామర్థ్యం 13 లీటర్లుగా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.99 లక్షలుగా ఉంది. దాని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 2.3 లక్షల వరకు ఉంటుంది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
ఇంతకుముందు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ పాపులర్ బైక్‌ను కొత్త కలర్ వేరియంట్‌లతో విడుదల చేసింది. బ్రిటిష్ బైక్ తయారీదారు క్లాసిక్ 350 ఐదు వేరియంట్‌లను ఏడు కొత్త కలర్ స్కీమ్‌లతో పరిచయం చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 హెరిటేజ్ వేరియంట్‌లో మద్రాస్ రెడ్, జోధ్‌పూర్ బ్లూ, హెరిటేజ్ ప్రీమియంలో మెడలియన్ బ్రాంజ్, సిగ్నల్స్‌లో కమాండో శాండ్, డార్క్‌లో గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్, క్రోమ్ వేరియంట్‌లో ఎమరాల్డ్ కలర్ స్కీమ్‌లు ఉన్నాయి.
పోటీ వీటితోనే...
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350... టీవీఎస్ రోనిన్ 225, యెజ్డీ స్క్రాంబ్లర్, యెజ్డీ రోడ్‌స్టర్ వంటి బైక్‌లతో పోటీపడుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ అన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
The Royal Enfield Super Meteor 650 x SENA brings you the SENA 50S—a world-class device for a smoother, connected ride.
— Royal Enfield (@royalenfield) October 25, 2024
Visit: https://t.co/lEMF1xL7zZ#SuperMeteor650XSENA #KeepCruisingStayConnected #SuperMeteor650 #PureCruising #RoyalEnfield #RidePurehttps://t.co/sLLsNrcTja
Can your digital tools of today fuel a new reality for the next millennium?
— Royal Enfield (@royalenfield) October 23, 2024
👉 Share your art on your IG profile.
📢 Tag @royalenfield & use #ArtOfMotorcyclingY3K & #ArtOfMotorcycling
🤙 Keep watching this space for the world of Y3K & we'll reach out to you via DM. pic.twitter.com/0RnWhPa6Y0