Royal Enfield Bullet Bike: రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్ ఇంజిన్, అద్భుతమైన ఫీచర్లు చూశారా
Royal Enfield Bullet Bike | రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 రెండు రంగుల్లో మార్కెట్లోకి వస్తుంది. అవి Cannon Black, రెండోది Battleship Blue రంగులో అందుబాటులోకి వస్తుంది.

Royal Enfield Bullet 650 | రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650ని EICMA 2025లో 125వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 తమ వారసత్వాన్ని మరింత బలపరుస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్ చాలా వరకు క్లాసిక్ 650 ఆధారంగా రూపొందించారు. అయితే దాని డిజైన్, రూపురేఖలలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ బుల్లెట్ బైక్ ఫీచర్లు, ఇంజిన్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 బైక్‌లో మోడ్రన్ టచ్ తీసుకొచ్చారు. ఇందులో చేతితో పెయింట్ చేసిన పిన్‌స్ట్రైప్‌లతో కూడిన టియర్-డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. వీటితో పాటు LED హెడ్‌లైంప్‌లు, పైలట్ లాంప్స్ ఉన్నాయి. ఇవి దీనికి బుల్లెట్ బైక్ లాంటి రూపాన్ని ఇస్తాయి. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పాత, కొత్తల కలయికగా ఉంది. అంటే అనలాగ్, డిజిటల్ రెండింటి కలయికను గమనించవచ్చు. అంతేకాకుండా వైర్-స్పోక్ వీల్స్ దీనికి సాంప్రదాయ రాయల్ ఎన్‌ఫీల్డ్ శైలి లుక్ ఇస్తాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 పవర్‌ట్రెయిన్
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇది 47 హార్స్‌పవర్, 52.3 NM టార్క్ జనరేట్ చేసే అదే 648 cc ట్విన్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు 6 స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్ ఉన్నాయి. ఈ బుల్లెట్ బైక్‌లో స్టీల్ ట్యూబులర్ ఫ్రేమ్, షోవా సస్పెన్షన్, ట్యూబ్ టైప్ టైర్లు ఉన్నాయి.
కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 రెండు రంగులలో తీసుకొచ్చారు. ఒకటి Cannon Black కలర్, కాగా Battleship Blue రంగులోనూ లభిస్తుంది. బ్లూ వేరియంట్ అంతర్జాతీయ మార్కెట్లలో లభిస్తుంది.
ఈ బైక్‌లను కూడా EICMAలో ప్రదర్శన
EICMA 2025 లో కంపెనీ క్లాసిక్ 650 స్పెషల్ ఎడిషన్, హిమాలయన్ మనా బ్లాక్ ఎడిషన్, ప్రత్యేక ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ స్క్రాంబ్లర్ EVలను కూడా ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ మోడల్ 19 అంగుళాల ముందు చక్రాలు, 18 అంగుళాల బ్యాక్ వీల్స్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, వాయిస్ అసిస్ట్, 4G, బ్లూటూత్ సహా Wi-Fi వంటి టెక్నాలజీ కలిగి ఉంది. వచ్చే ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లో దీన్ని లాంచ్ చేయాలని రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ భావిస్తోంది.























