Rohit Sharma Car Lamborghini Urus: లంబోర్గిని యురస్ కొన్న రోహిత్ శర్మ, ధర, ఫీచర్లు ఇవే- నెంబర్ మాత్రం వెరీ వెరీ స్పెషల్
రోహిత్ శర్మ కొత్త కారు లంబోర్గిని యురస్ కొన్నాడు. ఇది 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకుంటుంది. కారు నెంబర్ అతడికి చాలా స్పెషల్.

భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు Lamborghini Urus, ఇది అప్‌డేట్ అయిన SE వెర్షన్. తనతో ఉన్న పాత లంబోర్ఘినిని Dream11 ఫాంటసీ క్రికెట్ కాంటెస్ట్ విజేతకు బహుమతిగా ఇస్తానని ప్రకటించిన రోహిత్ శర్మ తర్వాత ఆ విజేతకు కారు అందజేశాడు.
అనంతరం హిట్ మ్యాన్ రోహిత్ శర్మ Lamborghini Urus ను ఆరెంజ్ కలర్ షేడ్‌లో కొనుగోలు చేశాడు. ఈ కారు రోహిత్ వద్ద ఇంతకుముందు ఉన్న బ్లూ Urus కంటే కాస్త భిన్నంగా ఉంది. Lamborghini Urus అప్‌డేట్ చేసిన మోడల్‌లో పలు మార్పులు చేశారు. ఇందులో కొత్త LED మ్యాట్రిక్స్ హెడ్‌లైట్ డిజైన్ ఇచ్చారు. ఇది మునుపటి Y-మోటిఫ్ కంటే భిన్నంగా ఉంది. దీని ఫ్రంట్ బంపర్, గ్రిల్ దీనికి బెస్ట్ రూపాన్ని ఇస్తాయి. దీంతో పాటు కారుకు 23-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దాంతో కారు చూసేందుకు స్పోర్ట్స్ కారులా కనిపిస్తుంది.
Lamborghini Urus SE మోదల్ ధర ఎంత?
Lamborghini Urus SE ధర విషయానికి వస్తే, రోహిత్ శర్మ కొనుగోలు చేసిన ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.57 కోట్లు. ఇందులో 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 620 hp ఎనర్జీని, 800Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Lamborghini Urus SE లో 25.9 kWh లిథియం- అయాన్ బ్యాటరీ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ తో వచ్చింది.
🚨NEW ORANGE LAMBORGHINI OF ROHIT SHARMA🚨
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 9, 2025
"Rohit Sharma bought a new orange colour Lamborghini Urus Se which has been delivered in Mumbai and bRO will be seen driving it soon." pic.twitter.com/vY0aWTzGZZ
Lamborghini Urus SE ఎనర్జీ, ఫీచర్లు..
లాంబోర్గిని యురస్ కారు ఇంజిన్ మొత్తం 800 bhp శక్తిని, 950Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఎలక్ట్రిక్ మోడ్‌లో ఈ SUV 60 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. 130 km/h వేగంతో EV మోడ్‌లో సైతం డ్రైవ్ చేయవచ్చు. ఈ కారు కేవలం 3.5 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది. కారు గరిష్ట వేగం గంటకు 312 కిలోమీటర్లు అని కంపెనీ పేర్కొంది.
రోహిత్ శర్మ లగ్జరీ కార్ల సేకరణలో రూ. 1.50 కోట్లు విలువ చేసే Mercedes-Benz S-Class కారు, రూ. 2.80 కోట్ల విలువైన Range Rover HSE LWB కారు, రూ. 1.79 కోట్ల విలువైన Mercedes GLS 400 D, BMW M5 మోడల్ కార్లు కూడా ఉన్నాయి. మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో
రోహిత్ శర్మ కారు నంబర్ వెనుక ఉన్న ప్రత్యేక కథ
రోహిత్ శర్మ తన కారుకు 3015 అనే నంబర్ ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. ఈ సంఖ్యకు అతనికి మూడు ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయి. రోహిత్‌కు నీలి రంగు లంబోర్గిని కారు ఉండేది. దాని నంబర్ 0264. వన్డేల్లో అతను శ్రీలంకపై చేసిన అద్భుతమైన 264 పరుగుల ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తుంది. ఆ లంబోర్గినిని రోహిత్ తర్వాత ఫాంటసీ యాప్ విజేతకు బహుమతిగా ఇచ్చేశాడు.
ఇప్పుడు ప్రస్తుత కారు నంబర్ 3015కి వస్తే, ఇది రోహిత్ కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక తేదీలను సూచిస్తుంది. రోహిత్ కుమార్తె సమైరా శర్మ డిసెంబర్ 30, 2018న జన్మించింది. కారులోని తొలి రెండు అంకెలు (30) ఆమె పుట్టిన తేదీని సూచిస్తుంది. 2024లో రితికా, రోహిత్‌కు కుమారుడికి జన్మనిచ్చింది. నవంబర్ 15న జన్మించిన ఆ బాబు పుట్టిన తేదీ రెండు అంకెలు (15) ను కారు నెంబరు చేసుకున్నాడు. ఈ రెండు అంకెలను కలిపితే (30 + 15 = 45), అది రోహిత్ శర్మకి చాలా ఇష్టమైనది, అతని జెర్సీ నంబర్.






















