అన్వేషించండి

ప్రభాస్‌ కార్‌ గ్యారేజ్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే - లాంబోర్గిని నుంచి రోల్స్‌ రాయిస్‌ వరకు అన్నీ ఉన్నాయ్‌!

డార్లింగ్‌ ప్రభాస్‌ గ్యారేజ్‌లో ఉన్న ఖరీదైన కార్లు ఏవో తెలుసా? లాంబోర్గిని అవెంటడార్‌, రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌, రేంజ్‌ రోవర్‌ వంటి ఎగ్జాటిక్‌ కార్ల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Hero Prabhas Car Collection: భారతీయ సినీ పరిశ్రమలో పాన్‌ ఇండియా స్టార్‌ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్‌. భారీ బడ్జెట్‌ సినిమాలతో బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన ఈ స్టార్‌, వెండితెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ తన స్టేటస్‌ను గట్టిగా చూపిస్తాడు. ముఖ్యంగా ప్రభాస్‌కు ఉన్న పెద్ద ఆసక్తి ఏమిటంటే... ఎగ్జాటిక్‌, అల్ట్రా లగ్జరీ కార్లు.

సోషల్‌ మీడియాలో లైఫ్‌స్టైల్‌ను ఎక్కువగా ప్రదర్శించని సెలబ్రిటీల్లో ప్రభాస్‌ ఒకరు. కానీ ఆయన గ్యారేజ్‌లో ఉన్న కార్లు మాత్రం ఆయన స్టార్‌డమ్‌ను స్ట్రాంగ్‌గానే చెబుతాయి. లాంబోర్గిని వంటి సూపర్‌కార్‌ నుంచి రోల్స్‌ రాయిస్‌ లాంటి అల్ట్రా గల్జరీ లిమోజిన్‌ వరకూ ప్రభాస్‌ కార్ల కలెక్షన్‌ నిజంగా కార్‌ లవర్స్‌కు కలల ప్రపంచం.

లాంబోర్గిని అవెంటడార్‌ S రోడ్‌స్టర్‌

ప్రభాస్‌ కార్ల కలెక్షన్‌లో హాట్‌ టాపిక్‌ అంటే లాంబోర్గిని అవెంటడార్‌ S రోడ్‌స్టర్‌. ఇది సాధారణ అవెంటడార్‌ కాదు. రూఫ్‌ తీసేసినప్పుడు డ్రైవింగ్‌ ఫీల్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే రోడ్‌స్టర్‌ వేరియంట్‌. మొదట ఈ కారు బ్రైట్‌ ఆరెంజ్‌ కలర్‌లో ఉండేది. లాంబోర్గిని దీనిని ‘అరాంచియో’ అని పిలుస్తుంది. తరువాత ఇది సాటిన్‌ బ్లాక్‌ ర్యాప్‌లో కనిపించినట్లు సమాచారం.

ఈ సూపర్‌కార్‌లో 6.5 లీటర్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ V12 పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 770 PS శక్తి, 720 Nm టార్క్‌ను ఇస్తుంది. 7-స్పీడ్‌ డ్యుయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో ఇది రోడ్డు మీద అగ్నిపర్వతంలా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ మోడల్‌ మార్కెట్‌లో లేదు. అప్పట్లో భారత్‌లో దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర దాదాపు రూ. 6 కోట్ల వరకు ఉండేది.

రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌

స్పీడ్‌ కోసం లాంబోర్గిని అయితే, అత్యంత లగ్జరీ ప్రయాణం కోసం ప్రభాస్‌ ఎంచుకున్నది రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌. ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఇష్టపడే ఈ లిమోజిన్‌ ప్రభాస్‌ గ్యారేజ్‌లో ఉండటం విశేషం. ఇందులో 6.75 లీటర్‌ V12 ఇంజిన్‌ ఉంటుంది. ఇది రియర్‌ వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

రోల్స్‌ రాయిస్‌ అంటేనే కస్టమ్‌ మేడ్‌ లగ్జరీ బ్రాండ్‌. ఇంటీరియర్‌, ఫీచర్లు అన్నీ యజమాని అభిరుచికి అనుగుణంగా తయారు చేస్తారు. ప్రస్తుతం భారత్‌లో ఫాంటమ్‌ బేస్‌ ధర రూ. 9 కోట్లకు పైగా ఉంటుంది. ఎక్స్‌టెండెడ్‌ వీల్‌బేస్‌ వేరియంట్‌ అయితే దాదాపు రూ. 10.48 కోట్ల వరకు ఉంటుంది.

రేంజ్‌ రోవర్‌ ఆటోబయోగ్రఫీ

ఏ భారతీయ సెలబ్రిటీ గ్యారేజ్‌లోనైనా రేంజ్‌ రోవర్‌ తప్పనిసరిగా కనిపిస్తుంది. ప్రభాస్‌ కూడా దీనికి మినహాయింపు కాదు. ఆయన ముందు తరం రేంజ్‌ రోవర్‌ను ఉపయోగించి, 2023లో కొత్త తరం రేంజ్‌ రోవర్‌ ఆటోబయోగ్రఫీకి అప్‌గ్రేడ్‌ అయ్యారు. ఇది బ్లాక్‌ కలర్‌లో ఉంటుంది.

ఈ SUVలో 4.4 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది LWB ఫార్మాట్‌లో వచ్చే టాప్‌ స్పెక్‌ ఆటోబయోగ్రఫీ వేరియంట్‌. ప్రస్తుతం దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర సుమారు రూ. 4.25 కోట్లుగా ఉంది.

ఇవి మాత్రమే కాదు, డార్లింగ్‌ గ్యారేజ్‌లో ఇంకొన్ని ప్రీమియం కార్లు కూడా ఉన్నాయి. ప్రభాస్‌ కార్ల కలెక్షన్‌ ఆయన స్టార్‌ స్టేటస్‌కు అద్దం పడుతుంది. హై స్పీడ్‌, లగ్జరీ, ఎగ్జాటిక్‌ అనుభూతి - ఈ మూడు కలిసిన కార్లే రాజాసాబ్‌ గ్యారేజ్‌లో కనిపిస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

నెలకు రూ.12,000 EMIతోనూ మారుతి బ్రెజ్జా మీ ఇంటికొస్తుంది, లోన్‌ ఎంత తీసుకోవాలంటే?
కేవలం రూ.లక్షన్నరతో Maruti Brezzaను మీ ఇంటికి తెచ్చుకోవచ్చు! నెలకు ఎంత చెల్లించాలంటే?
Top Automatic Cars: ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
రూ.65 వేల నుంచి లక్ష ధరలో హోండా టూవీలర్స్‌.. షైన్‌, యాక్టివ్‌, డియో, లివో మోడళ్లు
రూ.లక్ష లోపే కొనగలిగే హోండా బైక్ లేదా స్కూటర్.. మీ కోసం 10 రకాల టూవీలర్లు
హోండా షైన్‌ 125 ఆన్‌రోడ్‌ రేటు ఎంత? కేవలం రూ.10 వేల డౌన్‌పేమెంట్‌తో 3, 4, 5 ఏళ్ల EMI ప్లాన్స్‌
ఈ పండక్కి Honda Shine 125 కొనాలనుకుంటే లోన్‌ ఎంత వస్తుంది? EMI ఎంత పడుతుంది?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
Embed widget