అన్వేషించండి

TVS Ntorq 125 నుంచి అప్‌గ్రేడ్‌కు మంచి ఆప్షన్‌! - స్పోర్టీ స్కూటర్లలో Ntorq 150 ఎందుకు స్పెషల్‌?

TVS Ntorq 150 రోడ్‌ టెస్ట్‌ రివ్యూ ఇది. 13hp ఇంజిన్‌, రేస్‌ మోడ్‌, షార్ప్‌ బ్రేకింగ్‌, మంచి కంఫర్ట్‌తో స్పోర్టీ స్కూటర్‌ సెగ్మెంట్‌లో ఎన్‌టార్క్‌ కొత్త బెంచ్‌మార్క్‌లా మారింది.

TVS Ntorq 150 Review: భారత మార్కెట్‌లో స్పోర్టీ స్కూటర్‌ అంటే ఇప్పటివరకు ఎక్కువ మందికి గుర్తుకు వచ్చేవి యమహా ఏరోక్స్‌ 155, హీరో జూమ్‌ 160, అప్రిలియా SR 175. ఇప్పుడు ఈ జాబితాలో TVS Ntorq 150 కూడా చేరింది. ఇప్పటికే యువతలో మంచి పేరు తెచ్చుకున్న Ntorq 125 ఆధారంగా, మరింత పవర్‌ ఇచ్చేలా ఈ స్కూటర్‌ను రూపొందించారు. రోజువారీ వినియోగంలో ఇబ్బంది లేకుండా, ఫన్‌ ఫ్యాక్టర్‌ను కూడా ఇవ్వడం దీని అసలైన బలం.

పేపర్‌పై చూసినప్పుడు ఫీచర్లు బాగానే అనిపించినా, నిజమైన రోడ్‌ టెస్ట్‌లోనే ఎన్‌టార్క్‌ 150 అసలు స్వభావం బయటపడింది. ఇది కేవలం ఫాస్టెస్ట్‌ ఎన్‌టార్క్‌ మాత్రమే కాదు, ప్రాక్టికల్‌ స్కూటర్‌ కూడా.

రైడ్‌ అండ్‌ కంఫర్ట్‌

Ntorq 150లో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం వీల్‌ సైజ్‌. ప్రత్యర్థి కంపెనీలన్నీ 14 అంగుళాల వీల్స్‌ వాడితే, న్టార్క్‌ మాత్రం 12 అంగుళాల వీల్స్‌కే పరిమితం అయ్యింది. కాగితాలపై ఇది లోపంలా అనిపించినా, రోడ్డుపై మాత్రం స్పోర్టీనెస్‌, కంఫర్ట్‌ మధ్య చక్కని బ్యాలెన్స్‌ ఇస్తుంది.

స్పోర్టీ స్కూటర్‌ అంటే సస్పెన్షన్‌ చాలా గట్టిగా ఉంటుందనే భావన ఉంటుంది. కానీ న్టార్క్‌ 150 అలా కాదు. సస్పెన్షన్‌ మరీ మృదువుగా కాకపోయినా, చెత్త రోడ్లపై గట్టిగా తగిలేలా ఉండదు. రోజూ ఆఫీస్‌, కాలేజ్‌ వెళ్లేవారికి ఇది పెద్ద ప్లస్‌ పాయింట్‌.

సీట్‌ వెడల్పుగా, మంచి కుషన్‌తో వస్తుంది. పొడవైన రైడర్లు కూడా ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు. వెనుక మరో వ్యక్తి కూర్చున్నా సీటింగ్‌ కంఫర్ట్‌లో పెద్దగా తేడా కనిపించదు. స్పీడ్‌ పెంచినప్పుడు సుమారు 80-85 km వేగం వరకు స్కూటర్‌ స్థిరంగా ఉంటుంది. టాప్‌ స్పీడ్‌ దగ్గర చిన్న బంప్స్‌ కొంచెం అస్థిరతకు కారణమవుతాయి. ఇక్కడే పెద్ద వీల్స్‌ ఉన్న స్కూటర్ల ఆధిక్యం కనిపిస్తుంది.

ఇంజిన్‌, పనితీరు, బ్రేకింగ్‌

Ntorq 150 ఇంజిన్‌ 125cc ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడినప్పటికీ, లోపల భారీ మార్పులు చేశారు. 149.7cc ఇంజిన్‌ 13hp పవర్‌, 14.2Nm టార్క్‌ను ఇస్తుంది. టీవీఎస్‌ iGo అసిస్ట్‌ వల్ల అదనంగా 0.7Nm టార్క్‌ అందుతుంది. రోజువారీ డ్రైవ్‌లో ఇది మృదువుగా అనిపించినా, ఓవర్‌టేక్‌ల సమయంలో స్పష్టంగా ఉపయోగపడుతుంది.

ఈ బండిలో స్ట్రీట్‌, రేస్‌ అనే రెండు రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. స్ట్రీట్‌ మోడ్‌ న్టార్క్‌ 125 తరహా అనుభూతి ఇస్తే, రేస్‌ మోడ్‌లో థ్రాటిల్‌ స్పందన మరింత షార్ప్‌గా మారుతుంది. మోడ్‌ మార్పు వెంటనే ఫీల్‌ అవుతారు.

బ్రేకింగ్‌ విభాగంలో కూడా న్టార్క్‌ 150 మంచి మార్కులు కొట్టింది. సింగిల్‌ చానెల్‌ ABS ఉన్నా, టైర్‌ గ్రిప్‌ బలంగా ఉండటంతో ABS ఎక్కువగా జోక్యం చేసుకోదు. హార్డ్‌ కార్నరింగ్‌లో 12 అంగుళాల వీల్స్‌తో కష్టమేమో అని అనిపిస్తుంది కానీ, స్కూటర్‌ మనం ఊహించినంత స్థిరంగా స్పందిస్తుంది.

పనితీరు విషయానికి వస్తే, అప్రిలియా SR 175 కంటే ఇది వేగంగా పరుగులు తీస్తుంది. 0 నుంచి 80 km వేగం చేరుకోవడంలో ఒక సెకన్‌కు పైగా తేడా కనిపిస్తుంది. 80 km స్పీడ్‌లో వెళ్తుండగా బ్రేక్‌ వేసినప్పుడు బండి ఆగే దూరం కూడా తక్కువే.

మైలేజ్‌, ఫీచర్లు, ప్రాక్టికాలిటీ

నగరంలో, పరిమిత వేగంతో నడిపితే మైలేజ్‌ ఆశించిన దాని కంటే బాగానే వచ్చింది. హైవేలో 70 km లోపు వేగంలో వెళితేనే మంచి ఫలితం ఇస్తుంది. అగ్రెసివ్‌గా నడిపితే మైలేజ్‌ తగ్గుతుంది.

క్వాడ్‌ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌ డిజైన్‌ అందరికీ నచ్చకపోయినా, వెలుతురు మాత్రం అద్భుతంగా ఇస్తుంది. ఇది, మన దేశంలోని స్కూటర్ల బెస్ట్‌ హెడ్‌లైట్లలో ఒకటని చెప్పొచ్చు. అపాచీ RTR 310 నుంచి తీసుకున్న TFT డిస్‌ప్లే ప్రీమియం ఫీల్‌ ఇస్తుంది. అయితే రేంజ్‌, మైలేజ్‌ సమాచారం లేకపోవడం కొంచెం నిరాశ కలిగిస్తుంది.

22 లీటర్ల అండర్‌సీట్‌ స్టోరేజ్‌లో హాఫ్‌ ఫేస్‌ హెల్మెట్‌ మాత్రమే సరిపోతుంది. ఫ్రంట్‌ కబ్బీ వాలుగా ఉండటంతో ఫోన్‌ పెట్టుకోవడానికి అంతగా ఉపయోగకరం కాదు.

ధర

TVS Ntorq 150 ధర రూ. 1.09 లక్షల నుంచి (ఎక్స్‌-షోరూమ్‌) ప్రారంభమవుతుంది. ఈ సెగ్మెంట్‌లో ఇదే అత్యంత చౌకైన స్పోర్టీ స్కూటర్‌. టాప్‌ వేరియంట్‌ సుమారు రూ. 10 వేల ఎక్కువైనా, ఫీచర్ల పరంగా వాల్యూ ఇస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget