Ola Electric Bikes: సింగిల్ ఛార్జ్‌తో 500 km రేంజ్ - ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు స్టార్ట్ అయ్యాయ్
Ola Roadster X Bike Delivery: ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ, 3 బ్యాటరీ ప్యాక్‌లతో రోడ్‌స్టర్ ఎక్స్ వెర్షన్‌ను & 2 బ్యాటరీ ప్యాక్‌లతో రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ వెర్షన్‌ను లాంచ్ చేసింది.

Ola Roadster X and X Plus Bike Delivery Starts: ఓలా మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ రోడ్‌స్టర్ ఎక్స్‌ను బుక్ చేసుకున్న వాళ్లకు గుడ్ న్యూస్. ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు శుక్రవారం (23 మే 2025) నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బుక్ చేసుకున్న వాళ్లకు కంపెనీ నుంచి కాల్స్ & మెసేజ్‌లు వెళ్లాయి, షోరూమ్‌కు వచ్చి బండి తీసుకెళ్లమని కంపెనీ కోరింది. వాస్తవానికి, డెలివెరీలకు సంబంధించిన వివరాలను రెండు రోజుల క్రితమే ఓలా కంపెనీ తన కస్టమర్లకు షేర్ చేసింది, శుక్రవారం నుంచి ఎలక్ట్రిక్ బైక్‌ల డెలివరీ దశలవారీగా ప్రారంభించింది.
ఓలా ఎలక్ట్రిక్ బైక్ ఎంట్రీ లెవల్ X సిరీస్‌లో Roadster X & Roadster X Plus అనే 2 మోడళ్లను ఈ కంపెనీ లాంచ్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ లెక్క ప్రకారం, Roadster X Plus బైక్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 501 కిలోమీటర్ల రేంజ్ (Ola Roadster X Plus Electric Bike Range) ఇస్తుంది. అంటే, సింగిల్ ఛార్జ్‌తో దాదాపుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి రావచ్చు. ఈ ఓలా బైక్ ఓలా జెన్ 3 ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందింది.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ ఫీచర్లు (Ola Roadster X Plus Features)
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ 2 బ్యాటరీ ప్యాక్స్ ఆప్షన్స్‌తో లాంచ్ అయింది, అవి - 4.5 kWh బ్యాటరీ ప్యాక్ & 9.1 kWh బ్యాటరీ ప్యాక్. దీనికి 11 kW పీక్ పవర్ మోటార్ ఉంది, ఇది కేవలం 2.7 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. బిగ్ బ్యాటరీ ప్యాక్‌తో, ఈ బైక్ 501 km IDC రేంజ్ ఇవ్వగలదని కంపెనీ గతంలోనే ప్రకటించింది. రైడర్ వెసులుబాటు కోసం ఈ బండిలో మూడు రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. 4.5 kW బ్యాటరీ ప్యాక్‌తో బైక్ కొనాలంటే 1 లక్ష 5 వేల రూపాయలు అవుతుంది & 9.1 kW బ్యాటరీ ప్యాక్ ఉన్న బైక్ కోసం (Ola Roadster X Plus Price) 1 లక్ష 55 వేల రూపాయలు ఖర్చు చేయాలి.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఫీచర్లు (Ola Roadster X Features)
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ, రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్‌తో పాటు రోడ్‌స్టర్ ఎక్స్‌ను కూడా విడుదల చేసింది. ఇది కూడా 3 బ్యాటరీ ప్యాక్‌లతో వచ్చింది, అవి - 2.5 kW బ్యాటరీ ప్యాక్, 3.5 kW బ్యాటరీ ప్యాక్ & 4.5 kW బ్యాటరీ ప్యాక్. ఈ బైక్‌కు 7 kW పీక్ పవర్ మోటార్‌ను ఫిట్ చేశారు. ఈ బండి గరిష్ట వేగం గంటకు 118 కి.మీ. ఇది 3.1 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ బైక్ ధర ఎంత?
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తే (Ola Roadster X Electric Bike Range) 252 km రేంజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ ధర విషయానికి వస్తే... 2.5 kW బ్యాటరీ ప్యాక్ ధర (Ola Roadster X Plus Price) 74,999 రూపాయలు. 3.5 kW బ్యాటరీ ప్యాక్ ధర 84,999 రూపాయలు & 4.5 kW బ్యాటరీ ప్యాక్ ధర 94,999 రూపాయలు.





















