అన్వేషించండి

Nitrogen In Car: టైర్లలో నైట్రోజన్ నింపితే మైలేజ్ పెరుగుతుందా? పంక్చర్లు తగ్గుతాయా? నిపుణుల సమాధానం ఇదే

కారు టైర్లలో నైట్రోజన్ నింపడం వల్ల నిజంగా ప్రయోజనాలున్నాయా? సాధారణ గాలి & నైట్రోజన్ మధ్య తేడాలు, లాభాలు, నష్టాలు, ఏది ఉత్తమ ఎంపికో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Nitrogen vs regular air for car tyres: కారు గురించి జరిగే చర్చల్లో ఒకటి - టైర్లలో నైట్రోజన్ నింపాలా లేదా సాధారణ గాలి సరిపోతుందా అన్నది. నైట్రోజన్ వాడితే పంక్చర్లు తగ్గుతాయని, మైలేజ్ పెరుగుతుందని, టైర్ల జీవితం ఎక్కువ అవుతుందని చాలా మంది నమ్ముతుంటారు. ఇది కేవలం మార్కెటింగ్ ప్రచారమేనని మరికొందరు భావిస్తారు. మరి నిజంగా కారు టైర్లకు ఏది ఉత్తమం? ఈ అంశాన్ని వివరంగా పరిశీలిద్దాం.

నైట్రోజన్ & సాధారణ గాలి మధ్య తేడా ఏమిటి?

మనం సాధారణంగా టైర్లలో నింపే గాలిలో సుమారు 78 శాతం నైట్రోజన్, 21 శాతం ఆక్సిజన్ ఉంటాయి. మిగిలిన భాగంలో కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, నియాన్, హీలియం వంటి ఇతర వాయువులు ఉంటాయి. అయితే టైర్ల కోసం ప్రత్యేకంగా అందించే నైట్రోజన్ దాదాపు 100 శాతం స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువు. ఇందులో ఆక్సిజన్ లేదా తేమ ఉండదు. అందువల్ల ఇది పొడిగా ఉండే వాయువుగా పరిగణిస్తారు.

నైట్రోజన్ వల్ల కలిగే ప్రయోజనాలు

నైట్రోజన్‌లో తేమ లేకపోవడం వల్ల టైర్ ప్రెజర్ ఎక్కువ స్థిరంగా ఉంటుంది. సాధారణ గాలిలో ఉండే తేమ వేడి కారణంగా ఆవిరిగా మారి టైర్ ప్రెజర్‌లో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. ప్రత్యేకించి ఎక్కువ దూరం హైవే ప్రయాణాలు చేసే సమయంలో టైర్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో నైట్రోజన్ నింపిన టైర్లు మరింత స్థిరమైన పనితీరును చూపిస్తాయి.

ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే, నైట్రోజన్ అణువులు ఆక్సిజన్ అణువుల కంటే కొంచెం పెద్దవిగా ఉంటాయి. అందువల్ల టైర్ నుంచి గాలి బయటకు లీక్ అయ్యే వేగం తక్కువగా ఉంటుంది. దీంతో టైర్ ప్రెజర్ ఎక్కువకాలం నిలిచి ఉంటుంది.

అలాగే సాధారణ గాలిలోని తేమ కారణంగా వీల్ రిమ్‌లపై తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. నైట్రోజన్ వాడితే ఈ సమస్య కొంతవరకు తగ్గుతుంది.

నైట్రోజన్ వాడడంలో ఉన్న నష్టాలు

నైట్రోజన్‌ వాడకం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఉచితంగా అందుబాటులో ఉండదు. సాధారణ గాలిని చాలా పెట్రోల్ బంక్‌లలో ఉచితంగా నింపుకోవచ్చు.

నైట్రోజన్ నింపడానికి సాధారణంగా రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చవుతుంది. ప్రతి టాప్-అప్‌కు కూడా అదనపు వ్యయం ఉంటుంది.

మరో సమస్య - అన్నిచోట్లా అందుబాటులో లేకపోవడం. నగరాల్లో నైట్రోజన్ స్టేషన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలు, కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు లేదా దూర ప్రాంతాల్లో వీటి లభ్యత పరిమితంగా ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో టైర్ గాలి తగ్గితే సాధారణ గాలిని నింపాల్సి వస్తుంది. ఇలా నైట్రోజన్ & సాధారణ గాలి కలవడం వల్ల నైట్రోజన్ ప్రయోజనాలు క్రమంగా తగ్గిపోతాయి.

నైట్రోజన్ వల్ల మైలేజ్ పెరుగుతుందా?

టైర్లలో నైట్రోజన్ నింపితే మైలేజ్ భారీగా పెరుగుతుందని, పంక్చర్లు రాకుండా ఉంటాయని, టైర్లు వేడెక్కవని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇవి పూర్తిగా నిజం కావు.

నైట్రోజన్ అనేది టైర్ ప్రెజర్‌ను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ మైలేజ్‌లో గణనీయమైన పెరుగుదల, పంక్చర్ల నివారణ లేదా టైర్ల జీవితకాలంలో అద్భుతమైన మార్పు తీసుకురాదని నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడు నైట్రోజన్ వాడాలి?

మీరు తరచుగా హైవే ప్రయాణాలు చేస్తుంటే లేదా అధిక వేగంతో ఎక్కువ దూరాలు ప్రయాణిస్తుంటే నైట్రోజన్ ఒక మంచి ఎంపిక కావచ్చు. రేసింగ్ ట్రాక్‌లు, మోటార్ స్పోర్ట్స్ & ఏరోస్పేస్ రంగాల్లో నైట్రోజన్ వాడటానికి ఇదే కారణం. అయితే, రోజువారీ నగర ప్రయాణాలు, సాధారణ వినియోగం కోసం సాధారణ గాలి పూర్తిగా సరిపోతుంది.

తుది మాట

టైర్ల ఆరోగ్యం విషయంలో నైట్రోజన్ కంటే ముఖ్యమైనది సరైన మెయింటెనెన్స్. క్రమం తప్పకుండా టైర్ ప్రెజర్ చెక్ చేయడం, వీల్ అలైన్‌మెంట్ చేయించడం, టైర్ రొటేషన్ పాటించడం & జాగ్రత్తగా డ్రైవ్ చేయడం ద్వారా టైర్ల జీవితకాలాన్ని పెంచుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!
ట్రాఫిక్‌ చలానాలు చెల్లించకపోతే వాహన సేవలకు బ్రేక్, లైసెన్స్‌పై వేటు, కరెంటు కట్‌!
ట్రాఫిక్ చలానా కట్టలేదా? ఇక కరెంట్ బిల్లు మోతే!.. ఈ రెండిటికీ ఏంటి సంబంధం?
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
ఉజ్జయినిలో షాహీ మసీదు కూల్చివేత వివాదం: షాహీ మసీదును ఎవరు నిర్మించారు, దాని చరిత్ర ఏంటి?
ఉజ్జయినిలో షాహీ మసీదు కూల్చివేత వివాదం: షాహీ మసీదును ఎవరు నిర్మించారు, దాని చరిత్ర ఏంటి?
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Embed widget